E-Paper
Advertisement

iPhone 16 తక్కువ ధరకే వస్తోందని కొంటున్నారా? ఈ విషయం తెలిస్తే ప్లాన్ మార్చుకుంటారు!

iPhone 16 తక్కువ ధరకే వస్తోందని కొంటున్నారా? ఈ విషయం తెలిస్తే ప్లాన్ మార్చుకుంటారు!
Advertisement

iPhone 16 Price Drop: అమేజాన్ సేల్‌లో ఐఫోన్ 16 ధర తగ్గిందని కొనేయాలని చూస్తున్నారా? అయితే ఒక్క నిమిషం ఆగండి! అదే బడ్జెట్‌లో అంతకంటే కొత్త ఐఫోన్ కూడా తక్కువ ధరకే దొరుకుతోంది. ఓవైపు ఐఫోన్ 16, మరోవైపు ఐఫోన్ 17e, ఇంకోవైపు బడ్జెట్ ఫోన్ ఐఫోన్ 16e.. మరి వీటిలో ఏది కొంటే మీ డబ్బుకు సరైన విలువ దక్కుతుంది? ఏ ఫోన్‌లో ఏ ఫీచర్లు ఉన్నాయి? కొనేముందు ఈ విషయాలు తెలుసుకుంటే మీ నిర్ణయం మారొచ్చు.

కెమెరా కోసం ఐఫోన్ 16..

అమేజాన్‌లో ఐఫోన్ 16 (128GB) ధర రూ.76,999గా ఉంది. ఇందులో ఏ18 చిప్‌సెట్, యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లు ఉన్నాయి. వెనుకవైపు రెండు కెమెరాలు ఉండటంతో వైడ్ యాంగిల్, అల్ట్రా వైడ్ ఫొటోలు తీయొచ్చు. మ్యాక్రో ఫొటోగ్రఫీకి కూడా ఉపయోగపడుతుంది. కెమెరా కంట్రోల్ బటన్ మరో ప్రత్యేకత. ఫొటోలు, వీడియోలు ఎక్కువగా తీసేవాళ్లకు ఈ ఫోన్ మంచి ఎంపిక.

Advertisement

Also Read: ఈ ఫోన్ డిస్‌ప్లే రిపేర్ ఖర్చుతో iPhone 18 Pro కొనేయొచ్చు.. యాపిల్ కొత్త ఫోల్డబుల్ రేట్లు తెలుసా?

తక్కువ ధరకే ఐఫోన్ 17e..

ఐఫోన్ 17e (256GB) ధర రూ.71,999గా ఉంది. ఐఫోన్ 16 కంటే సుమారు రూ.5,000 తక్కువకే లభిస్తోంది. ఇందులో కొత్త ఏ19 చిప్‌సెట్, రెట్టింపు స్టోరేజ్ ఉన్నాయి. మ్యాగ్‌సేఫ్ వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. అయితే వెనుకవైపు ఒకే కెమెరా ఉంటుంది. కెమెరా కంటే ఫోన్ వేగం, ఎక్కువ స్టోరేజ్ ముఖ్యమనుకునేవాళ్లకు ఇది మంచి ఆప్షన్.

బడ్జెట్ తక్కువైతే ఐఫోన్ 16e..

Advertisement

ఐఫోన్ 16e (128GB) ధర రూ.59,900. ఇందులో ఏ18 చిప్‌సెట్, యాపిల్ ఇంటెలిజెన్స్ సపోర్ట్ ఉన్నాయి. రోజువారీ వాడకానికి ఇది సరిపోతుంది. ఐఫోన్ 16తో పోలిస్తే సుమారు రూ.17,000 ఆదా చేసుకోవచ్చు. అయితే అల్ట్రా వైడ్ కెమెరా, కెమెరా కంట్రోల్ బటన్ ఇందులో ఉండవు. తక్కువ ఖర్చుతో ఐఫోన్ కొనాలనుకునేవాళ్లు ఈ మోడల్‌ను పరిశీలించొచ్చు.

ఏ ఐఫోన్ కొనడం మంచిది?

ఫొటోగ్రఫీకి ప్రాధాన్యం ఇస్తే ఐఫోన్ 16, కొత్త ప్రాసెసర్‌తో పాటు ఎక్కువ స్టోరేజ్ కావాలంటే ఐఫోన్ 17e, తక్కువ బడ్జెట్‌లో ఐఫోన్ కావాలంటే 16e ఎంచుకోవచ్చు. ఫోన్ కొనేముందు అమేజాన్ ధరలు, బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్చేంజ్ డిస్కౌంట్లు కూడా చెక్ చేయండి. కేవలం ధర తగ్గిందని కాకుండా.. మీ అవసరాలకు ఏ ఫోన్ సరిపోతుందో చూసుకుని నిర్ణయం తీసుకోవడం మంచిది.

Also Read: ఆకట్టుకునే లుక్, అడ్వాన్స్‌డ్ ఏఐ ఫీచర్స్‌తో Samsung Galaxy F70 5G వచ్చేస్తోంది!

Tags

Related News

మెమరీ చిప్‌ల కొరత.. 14 ఏళ్ల కనిష్టానికి పడిపోయిన గ్లోబల్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్!

యాపిల్ వాచ్ సిరీస్ 11పై ఊహించని డిస్కౌంట్.. అమెజాన్ పండుగ సేల్‌లో టాప్-5 డీల్స్ ఇవే!

శీతాకాలం అలర్ట్.. ఏసీ అవుట్ డోర్ యూనిట్‌కు కవర్.. కేవలం రూ.200తో రూ.20 వేల నష్టానికి చెక్!

ఆకట్టుకునే లుక్, అడ్వాన్స్‌డ్ ఏఐ ఫీచర్స్‌తో Samsung Galaxy F70 5G వచ్చేస్తోంది!

ఒకే ఒక్క రీఛార్జ్.. ఏడాది పొడవునా ఫ్రీ కాల్స్, డేటా.. Airtel చౌకైన వార్షిక ప్లాన్స్ ఇవే!

ఆఫీస్,స్టడీస్ కోసం బెస్ట్ డెల్ ల్యాప్‌టాప్..120Hz డిస్‌ప్లేతో అదుర్స్!

రూ.937లకే పోర్టబుల్ స్పీకర్! డిస్కౌంట్‌లో కొనేయండి

Big Stories

Advertisement
×