E-Paper
Advertisement

డేంజర్ బెల్స్.. ప్రపంచ దేశాలకు ఐక్యరాజ్యసమితి హెచ్చరిక!

డేంజర్ బెల్స్.. ప్రపంచ దేశాలకు ఐక్యరాజ్యసమితి హెచ్చరిక!
Advertisement

Global Warming: పర్యావరణానికి సంబంధించి ఒక షాకింగ్ హెచ్చరిక బయటికొచ్చింది. గ్లోబల్ వార్మింగ్‌ను 1.5 డిగ్రీల సెల్సియస్‌కు పరిమితం చేయాలన్న ‘పారిస్ అగ్రిమెంట్’ ఆశలు అడియాసలయ్యాయి. ఐక్యరాజ్యసమితికి చెందిన ఎన్విరాన్‌మెంట్ ప్రోగ్రామ్ రిలీజ్ చేసిన నివేదిక ప్రకారం.. ఈ 1.5 డిగ్రీల లిమిట్‌ను దాటడం ఖాయమని చెప్తోంది.

ఆహార సంక్షోభం..

శాస్త్రవేత్తల విశ్లేషణ ప్రకారం.. పెరిగే ప్రతీ ఒక్క డిగ్రీ ఉష్ణోగ్రత పర్యావరణానికి పూడ్చలేని నష్టాన్ని కలిగిస్తుంది. మంచు దిబ్బలు కరిగిపోవడం, సముద్రాలు వేడెక్కడం వల్ల వాతావరణంలో తేమ పెరిగి, ఆకస్మిక మేఘవిస్పోటనాలు, ముంచెత్తే భారీ వరదలు, భీకరమైన తుఫానులు సంభవిస్తాయి. కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పూర్తిగా తగ్గిపోయి, నదులు ఎండిపోయి తాగునీటికి, వ్యవసాయానికి తీవ్ర కొరత ఏర్పడుతుంది. ఉష్ణోగ్రతల్లో మార్పుల వల్ల పంటల దిగుబడి తగ్గిపోయి, ప్రపంచవ్యాప్తంగా ఆహార సంక్షోభం ఏర్పడుతోంది. సముద్రాల్లో ఉండే 70 శాతం నుంచి 90 శాతం వరకు పగడపు దిబ్బలు పూర్తిగా నశించిపోయే ప్రమాదం ఉంది. టెంపరేచర్‌ను ప్రపంచదేశాలు అదుపులోకి తేవాలంటే… ఊహించని స్థాయిలో కార్బన్ ఎమిషన్స్ తగ్గించాలి. 2035 నాటికి రినోవబుల్ ఎనర్జీ అంటే సౌర, పవన్ విద్యుత్‌ని త్రిపుల్ చేయాలి, 2040 నాటికి బొగ్గు వాడకాన్ని పూర్తిగా బంద్ చేయాలి.

2030 నాటికి..

Advertisement

కానీ గ్రౌండ్ రియాలిటీ చూస్తే దీనికి పూర్తిగా రివర్స్‌లో ఉంది. ప్రస్తుతం వివిధ దేశాలు ఇచ్చిన హామీల ప్రకారం చూస్తే 2030 నాటికి కేవలం 5 నుంచి 8 శాతం మాత్రమే ఎమిషన్స్ తగ్గుతాయి. దీనివల్ల ఉష్ణోగ్రతలు ఏకంగా 2.6 డిగ్రీల వరకు పెరిగే రిస్క్ ఉంది. ఇక అమెరికా లాంటి పెద్ద దేశాలు పారిస్ అగ్రిమెంట్ నుంచి తప్పుకోవడం వల్ల పరిస్థితి మరింత దారుణంగా మారింది. దేశాలు ప్రస్తుత పాలసీలనే కంటిన్యూ చేస్తే.. టెంపరేచర్స్ 2.8 డిగ్రీల వరకు పెరిగి భయంకరమైన వాతావరణ మార్పులు ఎదురవుతాయి. ఐక్యరాజ్యసమితి ఇచ్చిన ఈ తీవ్రమైన హెచ్చరికల మధ్య వచ్చే నెల టర్కీలో జరగబోయే COP31 సమ్మిట్‌లో ప్రపంచ నాయకులు ఎలాంటి కఠిన నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి.

Also read: బిగ్ బ్రేకింగ్.. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ వాయిదా!

Tags

Related News

చిరిగిన రూ.10 నోటు వివాదం.. డెలివరీ బాయ్‌పై కస్టమర్ దాడి.. అవమానంతో యువకుడు సూసైడ్!

‘దేశ ప్రతిష్టను తాకట్టు పెడుతున్నారు’.. రాహుల్‌పై విరుచుకుపడ్డ ప్రధాని మోదీ!

ఆడి కారు బీభత్సం.. బైక్‌ను ఢీకొట్టి, బాధితుడ్ని తొక్కుకుంటూ వెళ్లిన డ్రైవర్!

ఇన్‌స్టాలోకి కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియాగాంధీ.. ఫస్ట్ ఫోస్టు ఇదే

వృద్ధ తల్లిదండ్రులను వదిలి భర్తను ఇంటల్లుడిగా ఉండాలన్న యువతి.. విడాకుల కేసులో కోర్టు తీర్పు ఇదే

భార్య తల నరికి త్రిశూలంపై పెట్టి తాంత్రిక పూజ, బెంగాల్‌లో గగుర్పొడిచే ఘటన

ఎల్ఐసిలో ఫ్రెషర్స్ జాబ్స్.. 232 ఉద్యోగ ఖాళీలు.. వెంటనే అప్లై చేయండి

Big Stories

Advertisement
×