E-Paper
Advertisement

వెంకీ సినిమా విషయంలో మరో ట్విస్ట్.. ‘ఆదర్శ కుటుంబం’ కొత్త రిలీజ్ డేట్ ఇదేనా?

వెంకీ సినిమా విషయంలో మరో ట్విస్ట్.. ‘ఆదర్శ కుటుంబం’ కొత్త రిలీజ్ డేట్ ఇదేనా?
Advertisement

Adarsha Kutumbham:వెంకీ మామ సినిమా వస్తుందంటే చాలు ఫ్యామిలీ ఆడియన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తుంటారు. ఈ స్టార్ హీరోకి ఉన్న క్రేజ్ అలాంటిది మరి.ఇక ఇప్పటికే సంక్రాంతికి వస్తున్నాంతో సాలిడ్ బ్లాక్ బస్టర్ కొట్టి మన శంకర వరప్రసాద్ లో క్యామియోతో అలరించిన వెంకీ ఇపుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఆదర్శ కుటుంబం అంటూ సరికొత్త సినిమాని సెట్స్ పైకి తీసికెళ్ళిన సంగతి తెల్సిందే.

ఇక గతంలో ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మల్లీశ్వరి’ వంటి బ్లాక్‌బస్టర్ సినిమాలకి త్రివిక్రమ్ పెన్ ఎలా పేలిందో స్పెషల్ గా చెప్పక్కర్లేదు.

Advertisement

ఇబ్బందులు పడే ఒక మిడిల్ క్లాస్ భర్తగా

ఈ సినిమా కథ విషయానికి వస్తే, ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ చూస్తే వెంకటేష్ ‘చిట్టిబాబు’ అనే పాత్రలో కనిపించబోతున్నారని అర్థమవుతోంది. ఇంట్లో భార్య మాట దాటలేక, కుటుంబ బాధ్యతలు మోస్తూ, పరిస్థితికి తగ్గట్టు ఇబ్బందులు పడే ఒక మిడిల్ క్లాస్ భర్తగా నవ్వులు పూయించడం ఖాయంగా కనిపిస్తోంది.

Advertisement

ఇక మధ్యతరగతి కుటుంబాల్లో ఉండే చిన్న చిన్న సమస్యలు, వాటి నుంచి పుట్టే కామెడీ, అనుబంధాలను తెరకెక్కించడంలో త్రివిక్రమ్ పెట్టింది పేరు. ముఖ్యంగా వెంకీ మార్క్ కామెడీ టైమింగ్, త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్ కలిస్తే థియేటర్లలో మళ్లీ నవ్వుల వర్షం కురవడం పక్కా అని ఫిక్స్ అయిపోయారంతా.

రిలీజ్ డేట్ విషయంలో పెద్ద గందరగోళం 

ఇదిలా ఉండగా ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో పెద్ద గందరగోళమే కనిపిస్తుంది.మొదటగా గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న వస్తుంది అనుకున్నప్పటికీ మళ్ళీ ఏమైనా డేట్ మారొచ్చు అన్న గాసిప్స్ చక్కర్లు కొట్టాయి.అక్టోబర్ 9,14,16 లలో ఒక డేట్ ఉండొచ్చు అని బలంగా వినిపించింది. అయితే వాటన్నింటికి ఎండ్ కార్డ్ వేస్తూ ఎట్టి పరిస్థితుల్లో అక్టోబర్ 2న సినిమా వచ్చి తీరుందని కాన్ఫిడెంట్ గా చెప్పాడు నిర్మాత నాగ వంశీ.

అయితే తాజాగా ఫిలిమ్ సర్కిల్స్ లో వినిపిస్తున్న వార్తల ప్రకారం ఈ సినిమా అక్టోబర్ 2న వచ్చే అవకాశం లేదని, అందరు అనుకుంటున్నట్టుగా అక్టోబర్ 14నే థియేటర్ లలోకి అడుగుపెట్టబోతుందని తెలుస్తుంది.

అక్టోబర్ 14నే ఆదర్శకుటుంబం ఎంట్రీ ఇస్తుందా

అయితే దసరా సీజన్ అవడం మూలాన రజినీ జైలర్ 2 తో అక్టోబర్ 15న వస్తామని ఇప్పటికే ఖర్చీఫ్ వేసేయగా, అక్టోబర్ 16న మేమూ కూడా వచ్చేస్తామంటూ రణబాలి రెడీ అయిపోతున్నాడు.మరి ఇంతటి పోటీ పెట్టుకుని నిజంగానే మేకర్స్ అక్టోబర్ 14న వచ్చేందుకు ధైర్యం చేస్తారా లేక రోజులు గడిచిన కొద్ది మరో తేదీ ఏమైనా అఫీషియల్ గా అనౌన్స్ చేస్తారా ..చూడాలి.

ఇక సినిమాలో నటీనటుల విషయానికి వస్తే శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తుండగా, నారా రోహిత్ ఒక కీలక పాత్రలో కనిపిస్తాడని తెలుస్తుంది. వీరితో పాటు నివేదా పేతురాజ్, రావు రమేష్, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్ వంటి నటులు సినిమాలో నటిస్తున్నారు. ఇక థమన్ అందిస్తున్న సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌కు పెద్ద అసెట్ అని చెప్పక్కర్లేదు.

మరో తేదీ ఏమైనా అఫీషియల్ గా అనౌన్స్ చేస్తారా

‘ఆదర్శ కుటుంబం – హౌస్ నెం.47’ అనే ట్యాగ్‌లైన్ చూస్తుంటే కథంతా ఒక ఇల్లు, దాని చుట్టూ ఉన్న మనుషుల మధ్యే తిరుగుతుందని అర్థమవుతోంది.చూడాలి మరి వినిపిస్తున్నట్టుగా అక్టోబర్ 14నే ఆదర్శకుటుంబం ఎంట్రీ ఇస్తుందా లేక మరో తేదీ ఏమైనా అనౌన్స్ చేస్తుందా !

ALSO READ:ఆనంద్ దేవరకొండ ‘ఎపిక్’ స్టోరీ ఇదేనా?

Tags

Related News

పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ హీరోయిన్.. వరుడు ఎవరు? బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే?

వినాయక్ చేతుల మీదుగా ట్రైలర్ లాంచ్.. 18న థియేటర్లలోకి ‘కళ్యాణం కమనీయం జీవితం’

బేబీ బంప్ తో ‘ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా’ మ్యాగజైన్ పై సామ్..సిద్ధంగా ఉన్నానంటూ!

‘దాదా’ మూడ్ లో 80’స్ లోకి వెళ్ళిన బాలయ్య.. న్యూ గెటప్ అదుర్స్ మావా!

రణబాలి టీజర్ రిలీజ్..’సింగనమల బొబ్బిలి రణబాలి’గా విజయ్ దేవరకొండ

టాక్సిక్ డిజాస్టర్ టాక్.. యశ్ ఫస్ట్ రియాక్షన్ ..ఏమన్నారంటే?

ఆనంద్ దేవరకొండ ‘ఎపిక్’ స్టోరీ ఇదేనా?

Big Stories

Advertisement
×