E-Paper
Advertisement

భూతాలు లేవు, దెయ్యాలు లేవు… అయినా గుండెల్లో రైళ్లు పరిగెత్తించే హారర్ థ్రిల్లర్… 7.9 రేటింగ్

భూతాలు లేవు, దెయ్యాలు లేవు… అయినా గుండెల్లో రైళ్లు పరిగెత్తించే హారర్ థ్రిల్లర్… 7.9 రేటింగ్
Advertisement

Psychological Horror Thriller: ఒక అమ్మాయి తాను ప్రేమించిన అబ్బాయిని తన తల్లిదండ్రులకు పరిచయం చేయడానికి ఇంటికి తీసుకెళ్తుంది. అక్కడ అందరూ చాలా మంచివాళ్లలానే కనిపిస్తారు. కానీ ఆ ఇంట్లో పని చేసే వాళ్ల ప్రవర్తన ఎందుకు అంత వింతగా ఉంటుంది ? అసలు ఆ కుటుంబం క్రిస్‌ ను అంత ప్రత్యేకంగా ఎందుకు గమనిస్తోంది ? ప్రాణాలతో బయటపడేలోపే అతడికి తెలిసే నిజం ఏంటి ? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం కావాలంటే ‘Get Out’ (2017) తప్పక చూడాల్సిన సైకాలజికల్ హారర్ థ్రిల్లర్ మూవీ. మరి ఈ మూవీ ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది ? అనేది తెలుసుకుందాం.

కథలోకి వెళ్తే…

క్రిస్ వాషింగ్టన్ ఒక ఫొటోగ్రాఫర్. రోజ్ అనే అమ్మాయితో ప్రేమలో ఉన్న అతడు ఆమె తల్లిదండ్రులను కలవడానికి వాళ్ళ బంగ్లాకు వెళ్తాడు. రోజ్ కుటుంబం మొదట క్రిస్‌ ను ఎంతో ఆప్యాయంగా స్వాగతిస్తుంది. కానీ అక్కడ పని చేసే వాల్టర్, జార్జినా అనే సిబ్బంది ప్రవర్తన మాత్రం అతడికి అనుమానం కలిగిస్తుంది. వాళ్లు మాట్లాడే విధానం, ముఖ కవళికలు అస్సలు సహజంగా ఉండవు. ఇంతలో రోజ్ తల్లి మిస్సి క్రిస్‌ తో ప్రత్యేకంగా మాట్లాడుతుంది. తాను హిప్నాటిజం చేయగలనని చెప్పి, అతడి సిగరెట్ అలవాటు మాన్పిస్తానంటుంది.

Advertisement

కానీ ఆ ప్రక్రియలో క్రిస్‌ ను తెలియకుండానే హిప్నటైజ్ చేస్తుంది. క్షణాల్లో అతడు తన శరీరాన్ని నియంత్రించుకోలేని ఓ భయంకరమైన మానసిక ప్రపంచంలోకి వెళ్లిపోతాడు. అదే ‘ది సన్‌కెన్ ప్లేస్’. మరుసటి రోజు ఇంట్లో జరిగే పార్టీతో అనుమానాలు మరింత పెరుగుతాయి. అక్కడికి వచ్చిన ధనవంతులు క్రిస్‌ ను సాధారణ అతిథిలా కాకుండా అతడి శరీరాన్ని పరిశీలిస్తున్నట్టుగా చూస్తారు. మరో నల్లజాతీయుడి ఫొటో తీసినప్పుడు అతడు అకస్మాత్తుగా క్రిస్‌ ను చూసి ‘గెట్ అవుట్’ అంటూ హెచ్చరించడంతో పరిస్థితి మరింత భయంకరంగా మారుతుంది.

చివరికి క్రిస్‌ కు అసలు కుట్ర అర్థమవుతుంది. ఆ కుటుంబం నల్లజాతీయులను లక్ష్యంగా చేసుకుని వారి శరీరాలను వృద్ధులైన తెల్లజాతీయులకు అందించే భయంకరమైన ప్రక్రియను నిర్వహిస్తుంటుంది. క్రిస్‌ ను కూడా ఇదే కుట్రలో బలి చేయాలని చూస్తారు. అయితే చివరి క్షణంలో క్రిస్ తెలివిగా వ్యవహరించి హిప్నాటిజం నుంచి తప్పించుకుంటాడు. కుటుంబ సభ్యులతో పోరాడుతూ అక్కడి నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తాడు. చివర్లో రోజ్ కూడా అతడిని చంపేందుకు ప్రయత్నిస్తుంది. మరి చివరికి హీరో అక్కడి నుంచి ప్రాణాలతో ఎలా బయట పడ్డాడు ? అసలు హీరోయిన్ కుటుంబం ఎందుకింత దారుణానికి ఒడిగడుతుంది ? అనేది తెలియాలంటే సినిమాను చూడాల్సిందే.

ఓటీటీలో ఎక్కడ చూడొచ్చు ?

Advertisement

‘గెట్ అవుట్’ ప్రస్తుతం JioHotstarలో స్ట్రీమింగ్ అవుతోంది. జోర్డాన్ పీల్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో డేనియల్ కలుయుయా, అల్లిసన్ విలియమ్స్ కీలక పాత్రల్లో నటించారు. సాధారణ దెయ్యాల కథలా కాకుండా మనుషుల భయం, మానసిక నియంత్రణ, దాగి ఉన్న కుట్ర చుట్టూ ఈ కథ సాగుతుంది. ముఖ్యంగా సినిమా మొదలైన కొద్దిసేపటికే ప్రేక్షకుల్లో ఒక అసౌకర్యమైన ఫీలింగ్ మొదలవుతుంది.
అయితే ఈ సినిమాకు ప్రస్తుతం తెలుగు డబ్బింగ్ ఆడియో అందుబాటులో లేదు. ఇంగ్లీష్, హిందీ ఆడియోలతో పాటు సబ్‌టైటిల్స్‌లో చూడొచ్చు. హారర్ కంటే సైకాలజికల్ టెన్షన్, ట్విస్టులు, అసౌకర్యాన్ని కలిగించే వాతావరణం ఎక్కువగా ఉండే సినిమాలు ఇష్టపడేవారికి ఇది మంచి ఛాయిస్. ముఖ్యంగా చివరి వరకు అసలు కుట్ర ఏమిటో పూర్తిగా అర్థం కాకుండా కథను నడిపించిన విధానం ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ.

Read Also: ఊహకు అందని భవిష్యత్తు ప్రపంచం… విజ్ఞాన శాస్త్రం సృష్టించిన వింత వినాశనం

Tags

Related News

పెళ్లి కాకుండానే పేరెంట్స్… వియ్యంకుల మధ్య మొదలైన వింత బంధం… ఫీల్ గుడ్ కొరియన్ సిరీస్ తెలుగులో

వింత వింత జంతువులతో క్రేజీ అడ్వెంచర్… తెలుగులోనే ఈ కిడ్స్ అండ్ ఫ్యామిలీ ధమాకా

గంటకి 300 కిలోమీటర్ల వేగం… బుల్లెట్ ట్రెయిన్‌లో డెడ్లీ కిల్లర్స్ వేట… తెలుగులో స్ట్రీమింగ్

రోజుకొకరితో బ్లైండ్ డేట్… ట్రయాంగిల్ లవ్ స్టోరీ… ప్రేమలో గెలవడానికి ప్రాక్టికల్ చిట్కాలున్న కొరియన్ సిరీస్ తెలుగులో

ఓటీటీలో మలయాళం సినిమాల హవా… ఈ 3 థ్రిల్లర్స్‌లో మీరెన్ని చూశారు?

హాట్ స్టార్ లో ట్రెండ్ అవుతున్న టాప్ 5 లిస్ట్… మొత్తం సిరీస్లదే హంగామా

ఈ వారం ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమాలు… ఆ రెండూ అస్సలు మిస్ అవ్వొద్దు

Big Stories

Advertisement
×