E-Paper
Advertisement

యూట్యూబర్ నందన కేసులో బాధితుడు చెప్పిన నిజాలు!

యూట్యూబర్ నందన కేసులో బాధితుడు చెప్పిన నిజాలు!
Advertisement

YouTuber Nandana:ప్రముఖ యూట్యూబర్ గా ‘నందూస్ వరల్డ్’ అనే ఛానల్ తో తనకంటూ ఒక పాపులారిటీ సంపాదించుకున్నారు నందన (Youtuber Nandana). తన భర్త, ఇద్దరు పిల్లలతో ఈమె చేసే వీడియోలు ఫాలోవర్స్ ను తెచ్చిపెట్టాయి. ముఖ్యంగా సింపుల్గా ఉంటూనే తన పిల్లలతో చుట్టుపక్కల వాళ్లతో చేసే వీడియోలు భారీ ఆదరణ సంతరించుకున్నాయి. ఆ పాపులారిటీ కారణంగానే ఈమె బిగ్ బాస్ సీజన్ 10 లోకి అడుగుపెడుతోందని కామెంట్లు రాగా.. ఈమె కామెడీ టైమింగ్ మెచ్చిన అనిల్ రావిపూడి (Anil Ravipudi) తన దర్శకత్వంలో.. మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) హీరోగా నటించిన ‘మన శంకర్ వరప్రసాద్ గారు’ సినిమాలో అవకాశం కల్పించారు.ఏకంగా మెగాస్టార్ చిరంజీవి తోనే కొన్ని సన్నివేశాలు చేసి మరింత క్రేజ్ అందుకుంది.

నందన కేసులో ప్రత్యక్ష సాక్షి..

అలాంటి ఈమెను శంషాబాద్ ఎయిర్పోర్టులో పోలీసులు అరెస్టు చేసి, ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ కి తీసుకురావడం సోషల్ మీడియాలో కలకలం రేపుతోంది. ముఖ్యంగా విదేశాలలో ఉద్యోగాల పేరిట భారీ మోసాలకు పాల్పడ్డారంటూ నందన , ఆమె భర్త పై ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఆమెను పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఇప్పుడు ఈమె ఉద్యోగం ఇప్పిస్తానని.. తమ వద్ద రూ.20 లక్షలు తీసుకొని, మోసం చేసింది అంటూ ఒక సాక్షి మీడియా ముందు తన బాధను వెల్లబుచ్చారు.

ఉద్యోగం ఇప్పిస్తానని.. నందన రూ.20 లక్షలు మోసం చేసింది..

Advertisement

సదరు వ్యక్తి మాట్లాడుతూ.. “యూట్యూబర్ నందన వీడియోలు చూసిన తర్వాత నా కొడుకు, కోడలు వచ్చి.. నాన్న.. ఉద్యోగం చేసి బాగా సంపాదిస్తాం అని చెప్పడంతో.. నా దగ్గర ఉన్న రెండు ఎకరాల భూమిని అమ్మి రూ.16 లక్షలు ఇచ్చాను. నా కొడుకు తన దగ్గరున్న మరో రూ.4లక్షలు కలిపి రూ.20 లక్షలు ఇచ్చాడు. నందన ఆ డబ్బులు తీసుకొని మమ్మల్ని మోసం చేసింది. నేనే ఈమె, ఈమె భర్త అకౌంట్ కి 7 లక్షల వరకు ట్రాన్స్ఫర్ చేశాను. మిగతా డబ్బులను మా అబ్బాయి అకౌంట్ కి కొడితే.. మా అబ్బాయి ఆమె చెప్పిన అకౌంట్లకు ట్రాన్స్ఫర్ చేశాడు. మొత్తం 18 లక్షలు కొట్టాక ఫోన్ చేస్తే ఎవరు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. మధుకరన్ (నందన భర్త) ఫోన్ ఎత్తడం లేదు. ఇక మేము ఎన్నో తిప్పలు పడ్డాము ఆ డబ్బు కోసం.. ఇక వీరు ఇలా మోసం చేస్తారు అనుకోలేదు. దాంతో నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను” అంటూ ఒక అద్దంకికి చెందిన బాధితుడు వీరిపై ఆరోపణలు గుప్పించారు.

అసలేం జరిగిందంటే?

ఉద్యోగం పేరిట భారీ మొత్తంలో డబ్బు వసూలు చేసి తర్వాత మోసం చేశారు అంటూ.. పలువురు బాధితులు ఫిర్యాదు చేయడంతోనే ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో గతంలోనే ఈ దంపతులపై కేసు నమోదు అయింది.. ఇకపోతే ఈ ఘటన వెలుగులోకి రావడంతో నందన దంపతులు అజ్ఞాతంలోకి వెళ్లారు. దీంతో ఏపీ పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు.

Advertisement

అయితే లుక్ అవుట్ నోటీసులు ఉన్న విషయం తెలిసి కూడా బ్రిటిష్ ఎయిర్ లైన్స్ విమానంలో స్వదేశానికి ఒంటరిగా బయలుదేరిన నందన.. శంషాబాద్ లో సోమవారం దిగారు. ఆమె పాస్ పోర్ట్ , వీసా పత్రాలు తనిఖీ చేసిన ఇమిగ్రేషన్ అధికారులు.. ఎల్ఓసి ఆధారంగా అదుపులోకి తీసుకొని ఆమెను ఇబ్రహీం పోలీసులకు అప్పగించారు. విచారణ నిమిత్తం ఆమెను పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చిన విషయం తెలిసిందే.

మీడియాపై నందన ఫైర్..

అయితే కాసేపటి క్రితం మీడియా ఆమెను ప్రశ్నిస్తూ .. ఒక బాధితుడు రూ.20 లక్షలు తీసుకున్నారని ప్రత్యక్షంగా మీ పేరు చెబుతున్నారు.. దీనికి మీ సమాధానం ఏంటి ? అని అడగగా.. దానికి నందన” మొత్తం మీ మీడియానే చేసింది.. నేను ఎవరిని మోసం చేయలేదు” అంటూ తనదైన శైలిలో మండిపడ్డారు.

Related News

యాంకర్ గా తొక్కేయడంతోనే ఉదయభాను నిర్మాత అయ్యారా?

సామాన్యుడిపై సెలబ్రిటీస్ ప్రతాపం.. కప్పు కొట్టేస్తాడని భయమా?

నందనను బిగ్ బాస్ లోకి తీసుకుంటే మర్యాద ఉండదు .. నాగార్జునకు బిగ్ వార్నింగ్!

మగపిల్లలే కాదు.. ఆడపిల్లలు కూడా…బిగ్ బాస్ ఝాన్సీ ఎమోషనల్!

‘వీసా స్కామ్ ‘.. మీడియాతో నందన కీలక వ్యాఖ్యలు..ఏమన్నారంటే?

స్టేజ్ పై గొడవపడ్డ కృష్ణ భగవాన్, యమునా?

దిష్టి పెట్టకండి.. లావైపోతా.. అనసూయ వీడియో వైరల్!

Big Stories

Advertisement
×