E-Paper
Advertisement

Dacoit: ‘డెకాయిట్’ ఫస్ట్ సింగిల్‌కు వేళాయెరా.. ‘రుబరూ’ వచ్చేస్తోంది

Dacoit: ‘డెకాయిట్’ ఫస్ట్ సింగిల్‌కు వేళాయెరా.. ‘రుబరూ’ వచ్చేస్తోంది
Advertisement

Dacoit: వరుస బ్లాక్‌బస్టర్‌లతో దూసుకుపోతున్న అడివి శేష్ (Adivi Sesh) హీరోగా, ఈ మధ్యకాలంలో నిత్యం వార్తలలో ఉంటున్న మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) హీరోయిన్‌గా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘డెకాయిట్’. ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై ఎలాంటి అంచనాలను క్రియేట్ చేశాయో తెలియంది కాదు. మొదటి శృతి హాసన్ కొంతమేర షూటింగ్ చేసి, తప్పుకున్న ఈ చిత్రంలోకి మృణాల్ ఎంటరైంది. శృతిపై చేసిన చిత్రీకరణ మొత్తం మరోసారి మృణాల్‌‌తో చేయాల్సి రావడంతో.. ఈ సినిమా అనుకున్న టైమ్ కంటే ఎక్కువ తీసుకుందనేలా టాక్ నడుస్తోంది. మార్చి 19న చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలో చిత్ర ప్రమోషన్స్‌పై మేకర్స్ దృష్టి పెట్టారు. ఫస్ట్ సింగిల్‌ (Dacoit First Single) ‘రుబరూ’ని విడుదల చేయబోతున్నట్లుగా అధికారిక ప్రకటనను విడుదల చేశారు. ఆ వివరాల్లోకి వెళితే..

Also Read- Aaya Sher Song: బాబోయ్, బక్కోడు ఆ సాంగ్‌ని దించేశాడుగా.. అడ్డంగా దొరికేశాడు!

రొమాంటిక్ ట్రాక్ రిలీజ్‌కు డేట్ ఫిక్స్

Advertisement

ఇప్పటివరకు హై వోల్టేజ్ యాక్షన్‌తో అలరించిన ‘డెకాయిట్‌’ మేకర్స్‌, ఇప్పుడు హార్ట్‌ఫెల్ట్ రొమాన్స్‌తో సినిమా మ్యూజికల్ జర్నీని స్టార్ట్ చేస్తున్నారు. ‘డెకాయిట్‌’ ఫస్ట్ సింగిల్ ‘రుబరూ’ను ఫిబ్రవరి 27న విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ విడుదల చేశారు. ఈ పోస్టర్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ సాంగ్ అనౌన్స్‌మెంట్ పోస్టర్‌ని గమనిస్తే.. శేష్ ప్రశాంతమైన, ఇంటెన్స్ లుక్‌లో ఉండగా, మృణాల్ సున్నితమైన నవ్వుతో కనిపిస్తోంది. ఈ పోస్టర్ చూస్తే సినిమాలోని యాక్షన్ నేపథ్యానికి సమాంతరంగా ఓ టెండర్ రొమాంటిక్ ట్రాక్ నడుస్తుందనే విషయం స్పష్టమవుతోంది. ‘డెకాయిట్‌’ కథ ‘డేంజర్‌, రా, యాక్షన్’ చుట్టూ తిరిగినా.. ఈ ‘రుబరూ’ (Rubaroo) మాత్రం ఎమోషనల్ టచ్‌తో కొత్త ఫీల్ ఇవ్వబోతుందని తెలుస్తోంది. లీడ్ పెయిర్ మధ్య కెమిస్ట్రీని హైలైట్ చేస్తూ, వారి ప్రయాణాన్ని ఈ పాట ప్రజెంట్ చేయబోతుంది. భీమ్స్ సిసిరోలియో సంగీతాన్ని అందిస్తున్న ఈ ఆల్బమ్‌పై ఇప్పటికే మంచి అంచనాలున్న విషయం తెలిసిందే.

Also Read- Rashmika -Vijay: రష్మిక విజయ్ పెళ్లి .. సంచలన పోస్ట్ చేసిన నటి మాజీ ప్రియుడు…ఇలా ట్విస్ట్ ఇచ్చాడేంటీ?

అనురాగ్ కశ్యప్ కీలక పాత్రలో

Advertisement

ఈ తెలుగు-హిందీ ద్విభాషా చిత్రంతో షానియల్ డియో సినీ ఇండస్ట్రీకి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సుప్రియా యార్లగడ్డ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సునీల్ నారంగ్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో రూపొందుతున్న ఈ సినిమాలో అడివి శేష్‌, మృణాల్ ఠాకూర్‌తో పాటు అనురాగ్ కశ్యప్ కీలక పాత్రలో కనిపించనున్నారు. తెలుగు, హిందీలో ఒకేసారి తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని పాన్-ఇండియా స్థాయిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Also Read- Lavanya Tripathi: సెకండ్ ప్రెగ్నెన్సీ పై లావణ్య త్రిపాఠి కామెంట్స్.. మరో గుడ్ న్యూస్ రాబోతోందా?

Related News

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

హైదరాబాద్‌లో ‘వైఫ్ ఎక్స్ఛేంజ్’ కల్చర్ ఉందంటూ హీరోయిన్ మాధవీలత సంచలన వ్యాఖ్యలు!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

Big Stories

Advertisement
×