E-Paper
Advertisement

మంగ్లీ అనుచరుల నుంచి ప్రాణహాని.. ఆవేదన చెందిన అడ్వకేట్ సుబ్బారావు!

మంగ్లీ అనుచరుల నుంచి ప్రాణహాని.. ఆవేదన చెందిన అడ్వకేట్ సుబ్బారావు!
Advertisement

Advocate Subbarao: మైక్రో ఫైనాన్స్ కేసులో భాగంగా మంగ్లీ వర్సెస్ అడ్వకేట్ సుబ్బారావు అనే విధంగా వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. మైక్రో ఫైనాన్స్ పేరిట సింగర్ మంగ్లీ(Singer Mangli) ఎంతో మంది నుంచి వందల కోట్ల రూపాయలు సొమ్ము చేసుకున్నారు అంటూ బాధితులు అతనిని కలవడంతో అడ్వకేట్ సుబ్బారావు ఈ అంశం గురించి మాట్లాడారు దీంతో ఈ విషయం కాస్త సంచలనంగా మారింది. తన తప్పు ఏమాత్రం లేదని సుబ్బారావు ఉద్దేశపూర్వకంగానే ఇలా చేస్తున్నారని ఆయన ఫేమస్ అవడం కోసమే నాపై నిందలు వేస్తున్నారు అంటూ వివరణ ఇచ్చుకున్నారు అయితే తాజాగా అడ్వకేట్ సుబ్బారావు డీజీపీని కలిసి తనుకు ప్రాణహాని ఉండే అంటూ ఫిర్యాదులు చేసినట్టు తెలుస్తుంది.

ఫోన్ కాల్స్ ద్వారా బెదిరింపులు..

ఈ నేపథ్యంలోనే సుబ్బారావు బిగ్ టీవీతో మాట్లాడుతూ.. తనకు మంగ్లీ అనుచరుల నుంచి ప్రాణహాన్ని ఉంది అందుకే నేను డీజీపీని కలిసి ఫిర్యాదు చేశానని సుబ్బారావు తెలిపారు. సింగర్ మంగ్లీ అనుచరులు నాకు ఫోన్ కాల్స్ చేసి బెదిరింపులకు పాల్పడుతున్నారు అదేవిధంగా సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా కూడా బెదిరిస్తున్నారని మేము ఎక్కడికైనా బయటకు వెళ్తుంటే మమ్మల్ని ఫాలో అవుతూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని సుబ్బారావు తెలిపారు. అదేవిధంగా పంజాగుట్ట సిఐ నుంచి కూడా ప్రాణహానే ఉంది అంటూ ఈయన తెలిపారు. మంగ్లీను టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నారు. నిజంగానే ఈ మోసం జరిగిందా అంటూ ప్రశ్న ఎదురవడంతో సుబ్బారావు మాట్లాడుతూ..

మంగ్లీ పేరును ఎక్కడ ప్రస్తావించలేదు..

Advertisement

మైక్రో ఫైనాన్స్ విషయంలో మంగ్లీ అక్రమాలకు పాల్పడినట్లు స్వయంగా బాధితులే తన వద్దకు వచ్చి చెప్పారని అందుకు సంబంధించిన ఆధారాలు కూడా బాధితులు బయటపెట్టినట్లు ఈయన తెలిపారు. మంగ్లీ మోసం చేసిందని బాధితులు ఆధారాలను చూపించారు అయితే తన ప్రమేయం లేదని మంగ్లీ కూడా ఆధారాలు చూపిస్తే సరిపోతుంది కదా అంటూ సుబ్బారావు మాట్లాడారు. ఈ కేసు విషయంలో తాను మంగ్లీ పేరు ఎక్కడ ప్రస్తావించలేదని, సింగర్ మంగ్లీ తన పేరును తెరపైకి తీసుకు వచ్చారని తెలిపారు.

Advertisement

ఇదివరకు నాకు మంగ్లీతో ఎక్కడ పరిచయం లేదు బాధితులు తన వద్దకు వచ్చి వారి బాధను బయటపెట్టుకున్నప్పుడు మంగ్లీ స్వయంగా ఈ కేసు విషయంలో నన్ను బెదిరించింది అంటూ సుబ్బారావు తెలిపారు. సినిమాల పరంగా మీకు మంగ్లీ గారితో పరిచయం ఉందా అనే ప్రశ్న కూడా ఎదురవడంతో తనకు మంగ్లీతో ఏమాత్రం సంబంధం లేదని ,అసలు ఆమెను నేనెప్పుడూ నేరుగా కూడా కలవలేదని తెలిపారు. ఇక ఆమె అనుచరులు మాత్రం నాతో ఫోన్లో మాట్లాడుతూ బెదిరింపులకు పాల్పడ్డారని సుబ్బారావు తెలిపారు. మంగ్లీ అనుచరుల నుంచి తనకు ప్రాణహాని ఉంది అంటూ ఈయన చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. మరి ఈ వ్యాఖ్యలపై మంగ్లీ స్పందన ఏంటి అనేది తెలియాల్సి ఉంది.

Also Read: మెగాఫోన్ పట్టబోతున్న రామ్ పోతినేని… సాహసం చేస్తున్న హీరో..ఇప్పుడు అవసరమా అంటూ!

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×