E-Paper
Advertisement

ప్రకటనల కోసం కోట్లు వృథా చేయం.. విద్యా ప్రమాణాలే మా బలం.. ఉపాధ్యాయులకు లోకేష్ సెల్యూట్

ప్రకటనల కోసం కోట్లు వృథా చేయం.. విద్యా ప్రమాణాలే మా బలం.. ఉపాధ్యాయులకు లోకేష్ సెల్యూట్
Advertisement

Nara Lokesh: ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలను పెంచడానికి ఉపాధ్యాయులు చేస్తున్న కృషినీ అభినందిస్తూ సామాజిక మాధ్యమం ఎక్స్‌ (X) వేదికగా ఒక పోస్ట్‌ చేశారు. ప్రభుత్వ బడుల్లో పిల్లలను చేర్పించాలంటూ పత్రికల్లో కోట్లు ఖర్చు చేసి ప్రకటనలు ఇవ్వడం లేదా టీవీ ఛానళ్లలో భారీగా యాడ్స్ వేయించుకోవడం వంటి ఆడంబరాలకు తాము వెళ్లడం లేదని ఆయన స్పష్టం చేశారు. కేవలం ప్రభుత్వ బడుల్లో అందుబాటులో ఉన్న మెరుగైన సౌకర్యాలు, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, ప్రతిభావంతులైన ఉపాధ్యాయులనే తమ బలంగా నమ్ముతున్నామని ఆయన పేర్కొన్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలకు కల్పించే భద్రత, వారి సమగ్ర విద్యా వికాసం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, విద్యార్థుల భవిష్యత్తుకు తాము కల్పిస్తున్న భరోసా గురించి మాత్రమే ప్రజలకు వివరిస్తున్నామని లోకేష్ వెల్లడించారు. ఈ క్రమంలో ఉపాధ్యాయులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి, వినూత్న రీతిలో ప్రచారం చేస్తూ పిల్లలను ప్రభుత్వ బడుల్లో చేర్పించేలా తల్లిదండ్రులను ప్రోత్సహిస్తుండటం విశేషమని ఆయన ప్రశంసించారు. క్షేత్రస్థాయిలో ఉపాధ్యాయులు చేస్తున్న ఈ వినూత్న ప్రచారానికి ఆయన తన అభినందనలు తెలియజేశారు.

Advertisement

మంత్రి లోకేష్ చేసిన ఈ వ్యాఖ్యలు గత ప్రభుత్వ హయాంలో విద్యారంగ ప్రచారం కోసం చేసిన భారీ ఖర్చును పరోక్షంగా విమర్శించేలా ఉన్నాయి. కేవలం ప్రకటనల మీద కాకుండా, పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను పెంచడం, ఉపాధ్యాయులను భాగస్వామ్యం చేయడం ద్వారానే ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేయగలమని ఆయన మాటల ద్వారా స్పష్టమవుతోంది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలను పెంచడానికి, వారిని ప్రోత్సహించడానికి పలు వినూత్న పథకాలను అమలు చేస్తోంది. తల్లికి వందనం ప‌థ‌కం ద్వారా తల్లుల ఖాతాల్లో రూ. 15,000 జమ చేస్తోంది. సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర పథకం ద్వారా ప్రభుత్వ బడుల్లో చేరే విద్యార్థులకు అవసరమైన అన్ని విద్యా సామాగ్రిని ప్రభుత్వం ఉచితంగా అందిస్తుంది. ఇందులో మూడు జతల యూనిఫాంలు, పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్, స్కూల్ బ్యాగ్, బూట్లు, సాక్స్, బెల్ట్, డిక్షనరీ ఉంటాయి.

Advertisement

Read Also: మహిళా బిల్లును అడ్డుకున్న వారు క్షమాపణ చెప్పాలి.. కాంగ్రెస్, డీఎంకేలపై చంద్ర‌బాబు ఫైర్

Related News

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

తిరుమల ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం.. బోల్తా పడ్డ కారు.. స్పాట్‌లో!

ఎట్టకేలకు ముహూర్తం ఖరారు.. భోగాపురం ఎయిర్ పోర్ట్ ఓపెన్, ప్రధాని మోదీ చేతుల మీదుగా, కాకపోతే

ఏపీలో కరోనా కేసుల కలకలం.. కొత్త రకం వేరియంట్ గుర్తింపు, ఆగ్నేయాసియాలో ఎక్కువగా..

తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ అలర్ట్.. ఆ జిల్లాల్లో కుండపోత వర్షాలు.. ఐదు రోజులు ఇంతే!

లారీని ఢీ కొట్టిన కారు.. స్పాట్‌లో నలుగురు మృతి, విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం

ఆడవాళ్లకు రక్షణేది?.. గుంటూరు దారుణంపై మండిపడ్డ జగన్!

Big Stories

Advertisement
×