E-Paper
Advertisement

ఉత్తరాంధ్రలో ‘పెద్ది’ ఊచకోత షురూ.. 23 కోట్లతో చరణ్ రేంజ్ మామూలుగా లేదుగా!

ఉత్తరాంధ్రలో ‘పెద్ది’ ఊచకోత షురూ.. 23 కోట్లతో చరణ్ రేంజ్ మామూలుగా లేదుగా!
Advertisement

Peddi Movie:ఈ సినిమా రిలీజ్ లేట్ అవుతున్నా సినిమా పలుకుతున్న రేట్ విషయంలో లేటెస్ట్ గా వినిపిస్తున్న వార్తలు మాత్రం ఫ్యాన్స్ కి మాంచి కిక్కిస్తున్నాయ్. అవును.. విషయానికి వస్తే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో రూపొందుతున్న రా అండ్ రస్టిక్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’. అయితే ప్రస్తుతం సెట్స్ మీద జోరుగా పరుగులు పెడుతున్న ఈ సినిమా బిజినెస్ పరంగా క్రియేట్ చేస్తున్న సునామీ మామూలుగా లేదు.

సుమారు 23 కోట్ల రూపాయల భారీ ధర

Advertisement

ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తున్న టాక్స్ ప్రకారం ఈ సినిమా ఉత్తరాంధ్ర (వైజాగ్) థియేట్రికల్ రైట్స్ విషయంలో సరికొత్త రికార్డులు సెట్ చేస్తుంది. వైజాగ్ ఏరియా రైట్స్ ని విఘ్నేశ్వర ఫిల్మ్స్ సతీష్ సుమారు 23 కోట్ల రూపాయల భారీ ధరకు (NRA పద్ధతిలో) దక్కించుకోవడం ఇండస్ట్రీ వర్గాల్లో సంచలనం కలిగిస్తుంది. కేవలం ఒక్క ఏరియానే ఇంత రేట్ పలకడం బట్టి చూస్తే ముందు ముందు సినిమా బిజినెస్ ఏ రేంజ్ లో జరగబోతుందో ఊహించుకోవచ్చు. పైగా గేమ్ చేంజర్ వంటి ప్లాప్ తర్వాత వస్తున్న సినిమా అయినప్పటికీ సినిమా బజ్ ఈ రేంజ్ లో ఉండటం చూస్తుంటే పెద్దిపై అంచనాలు ఎలా ఉన్నాయో అర్థమైపోతుంది.

also read :సీతమ్మ గెటప్ నుంచి ఐటమ్ బాంబుగా.. ఊర మాస్ డెసిషన్ తీసుకున్న బాలీవుడ్ బ్యూటీ

Advertisement

స్పెషల్ సాంగ్ చేయనున్న సంయుక్త మీనన్

ఇక సినిమా బిజినెస్ లెక్కలు ఇలా ఉంటే ఈ సినిమాలో ఒక క్రేజీ స్పెషల్ సాంగ్ ఉండబోతోందనే వార్త గత కొన్ని రోజులుగా నెట్టింట వైరల్ అవుతోంది. ఇక ఈ పాటలో స్టెప్పులేసే సుందరి ఎవరా అంటూ గత కొన్ని రోజులుగా ఫ్యాన్స్ ఆరా తీస్తూనే ఉన్నారు. అలా మృణాల్ ఠాకూర్ అని, కాదు కాదు పూజా హెగ్డే అని, వాళ్ళెవరూ కాదు మానస వారణాసి అని.. ఇలా గత కొన్ని రోజులుగా ఒకో పేరు మీడియాలో వైరల్ అవుతూనే ఉంది. అయితే తాజాగా వాళ్ళందరిని పక్కన నెట్టేసి ఆ స్థానంలోకి ‘గోల్డెన్ లెగ్’ సంయుక్త మీనన్ వచ్చి చేరిందన్న వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హైలెట్ అవుతుంది.ఇప్పటికే ‘అఖండ 2’లో ‘జాజికాయ’ పాటతో మెప్పించిన సంయుక్త, ఇప్పుడు రామ్ చరణ్ సరసన ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సిద్ధం చేసిన మాస్ ట్యూన్ కు స్టెప్పులు వేయబోతోందన్న మాట. అయితే మేకర్స్ నుండి క్లారిటీ రావాల్సి ఉంది.

జూన్ 4 లేదా జూన్ 25న పెద్ది బయటికి వస్తాడా

ఇక నిజానికి సినిమా ఏప్రిల్ 30న రిలీజ్ చేస్తామంటూ మేకర్స్ గతంలోనే అనౌన్స్ చేసినప్పటికీ షూటింగ్ డిలే తో సినిమా జూన్ కు వాయిదా పడినట్టు తెలుస్తుంది. షూట్ ఇంకా బ్యాలెన్స్ ఉందని, ముఖ్యంగా స్పెషల్ సాంగ్ తో పాటు ప్యాచ్ వర్క్ బ్యాలెన్స్ ఉందని, దీనికి తోడు కొన్ని సీన్స్ రీ షూట్ చేస్తున్నారని.. ఇలా వినిపిస్తున్న ఒక్కో వార్త మెగా ఫ్యాన్స్ కి నిద్రల్లేకుండా చేస్తుంది. చూడాలి మరి వినిపిస్తున్నట్టుగా జూన్ 4 లేదా జూన్ 25న పెద్ది బయటికి వస్తాడా లేక మరో డేట్ వెతుక్కుంటాడా అనేది.

అయితే ఏది ఏమైనా సినిమా ఎప్పుడొచ్చినా కలెక్షన్ల పరంగా ఊచకోత ఖాయమని సినిమా పలుకుతున్న రేట్లే చెబుతున్నాయ్!

also read :సోషల్ మీడియాలో రెచ్చిపోతే జైలుకే.. అనసూయపై అసభ్య కామెంట్స్ చేసిన వ్యక్తి అరెస్ట్.. పూర్తి వివరాలివే!

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×