E-Paper
Advertisement

Rajya Sabha Elections: రాజ్యసభ రెండు సీట్లు గెలవడం ఎలా..? కాంగ్రెస్‌కు వర్కౌట్ అయ్యేనా..!

Rajya Sabha Elections: రాజ్యసభ రెండు సీట్లు గెలవడం ఎలా..? కాంగ్రెస్‌కు వర్కౌట్ అయ్యేనా..!
Advertisement

Rajya Sabha Elections: స్వేచ్ఛ బ్యూరో: రాజ్యసభ రెండు సీట్లనూ కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నాలు చేయడం పొలిటికల్ సర్కిళ్లలో చర్చంశనీయమైంది. ప్రస్తుతం ఉన్న అసెంబ్లీ సభ్యుల సంఖ్య ప్రకారం కాంగ్రెస్ పార్టీకి టెక్నికల్ గా ఒక సీటు మాత్రమే కన్ఫామ్ గా దక్కుతుంది. అయితే అనూహ్యంగా రెండో స్థానాన్ని కూడా కైవసం చేసుకోవాలని అధికార పార్టీ భావిస్తుండటం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ మేరకు రెండో స్థానానికి పేరును కూడా గురువారం ప్రకటిస్తారనే చర్చ పార్టీ వర్గాల్లో మొదలైంది. కానీ రెండు సీటును కూడా దక్కించుకోవాలంటే ఇతర పార్టీల మద్ధతు తప్పనిసరిగా కావాల్సిన అవసరం ఉన్నది. దీంతో ఏ పార్టీలు ఇప్పుడు మద్ధతు ఇస్తాయనేది? సస్పెన్స్ గా మారింది. ఇప్పటికే రాజ్యసభ సభ్యుడిగా ఉన్న అభిషేక్ మను సింఘ్వీకి మరోసారి రాజ్యసభను ఇవ్వనున్నట్లు తెలిసింది. మరో స్థానానికి ప్రభుత్వ సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి పేరు బలంగా వినిపిస్తున్నది. రెండు రోజుల క్రితం వరకు దాదాపు 16 మంది నేతల పేర్లు రేసులో నిలవగా, చివరికి వేం నరేందర్ రెడ్డి పేరు ప్రధానంగా వినిపించడం గమనార్హం. కానీ కాంగ్రెస్ లో ఏ క్షణంలో ఏం జరుగుతుందో? స్పష్టంగా చెప్పలేమని, చివరి నిమిషంలోనూ పేర్లు మారిన సందర్భాలు ఉన్నట్లు గాంధీభవన్ కు చెందిన ఓ సీనియర్ నేత వెల్లడించారు. ఏఐసీసీ నుంచి అధికారికంగా వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందేనని ఆయన చెప్పడం విశేషం.

ఒక సీటుకు బలం ఎక్కడ..?

రాష్ట్రంలో 119 మంది అసెంబ్లీ సభ్యులు ఉండగా, ఒక్కో రాజ్యసభ స్థానానికి దాదాపు 40 మంది సభ్యుల మద్ధతు అవసరం. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కు కేవలం ఒక సీటుకు మాత్రమే సంపూర్ణమైన మెజార్టీ ఉన్నది. అయితే రెండో సీటును గెలవాలంటే తప్పనిసరిగా అదనపు ఓట్లు కావాల్సిందే. ఈ నేపథ్యంలో ఎంఐఎం , ఇతర పార్టీల మద్దతు పక్కగా అవసరం .లేకుంటే రెండో స్థానాన్ని దక్కించుకోవడం పార్టీకి సవాల్ గా మారనున్న ది. వాస్తవానికి ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ నుండి సుమారు పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నట్లు గతంలో ఆ పార్టీ వర్గాలు ప్రచారం చేశాయి. ఇప్పటికే ఆయా ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తోనే సన్నిహితంగా ఉంటున్నారు. బీఆర్ ఎస్ పార్టీ కార్యాలయాలు, పార్టీ యాక్టివిటీస్ కు దూరంగానే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయా ఎమ్మెల్యేలు ఎవరికి ఓటు వేస్తారనేది? హాట్ టాఫిక్ గా మారింది. ఓటింగ్ సమయంలో కాంగ్రెస్ అభ్యర్ధికే ఓటేస్తే కాంగ్రెస్ రెండు సీట్లు గెలుచుకునే ఛాన్స్ ఉంటుంది. తెలంగాణ శాసనసభ నుంచి రాజ్యసభకు ఎన్నికైన అభిషేక్‌ మను సింఘ్వీ (కాంగ్రెస్‌), సురేశ్‌రెడ్డి (బీఆర్ ఎస్ ) ల పదవీకాలం ఏప్రిల్‌లో ముగియనుంది.దీంతోనే మళ్లీ రెండు స్థానాల భర్తీ ప్రాసెస్ జరుగుతుంది.

Advertisement

Also Read: The Taj Story OTT : ఓటీటీలోకి వచ్చేస్తున్న పరేష్ రావల్ వివాదాస్పద కోర్టు రూమ్ డ్రామా… ఎప్పుడు ఎక్కడ చూడచ్చో తెలుసా ?

క్రాస్ ఓటింగ్ వేసినా..అనర్హత వర్తించదు..

ప్రస్తుతం కాంగ్రెస్‌కు మిత్రపక్షం సీపీఐతో కలిపి 67 మంది ఎమ్మెల్యేలున్నారు.బీఆర్ ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ వైపు వచ్చిన ఎమ్మెల్యేలు కలిస్తే, ఈ సంఖ్య 77 కు పెరుగుతుంది. ఇదే క్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బలం కేవలం 27 మంది మాత్రమే ఉంటారు. ఒక సీటుకు 40 ఓట్లు గా భావిస్తే, మరో 13 మంది మద్ధతు తప్పనిసరి.మరోవైపు ఎంఐఎం కూడా కాంగ్రెస్ తో ప్రెండ్లీ రిలేషన్ మెయింటెన్ చేస్తున్నది. ఈ నేపథ్యంలో రెండు సీట్లు కాంగ్రెస్ కైవసం చేసుకోవడం చాలా సులువనే టాక్ పొలిటికల్ సర్కిళ్లలో వినిపిస్తున్నది. ఒక వేళ బీజేపీ, ఎంఐఎం ఓటింగ్‌కు దూరంగా ఉండాలని భావిస్తే, అభ్యర్ధులు గెలవడానికి అవసరమైన ఓట్ల సంఖ్య 35కు తగ్గుతుంది. ఈ క్రమంలో 77 మంది తో కాంగ్రెస్ రెండు సీట్లు కైవసం చేసుకోనున్నది. ఈ రెండు పార్టీల్లో ఏదో ఒక పార్టీ దూరంగా ఉన్నా..విజయానికి 38 మంది మద్ధతు అవసరం అవుతుంది. ఈ రెండు పార్టీలతో పాటు ఫిరాయింపు ఎమ్మెల్యేగా భావిస్తున్న వాళ్​లు కూడా ఓటింగ్ కు దూరంగా ఉంటే, ఒక్కో సీటుకు కేవలం 32 మంది మద్ధతు అవసరం అవుతుంది. ఇలా ఏ రూపంలో సమీకరించినా..కాంగ్రెస్ రెండు సీట్లను కైవసం చేసుకునే ఛాన్స్ ఎక్కువగా ఉన్నదని పొలిటికల్ అనాలసిస్టులు చెబుతున్నారు. రాజ్యసభ ఎన్నికల్లో ఎమ్మెల్యేలు విప్‌ను ధిక్కరించి క్రాస్‌ ఓటింగ్‌కు పాల్పడినా అనర్హత నిబంధన వర్తించదని కాంగ్రెస్ పార్టీ నేతలు చెబుతున్నారు. ఇది అధికార పార్టీకి ప్లస్ పాయింట్ గా నిలవనున్నది.

Advertisement

Also Read: Gadwal District: గద్వాల జిల్లా తహసిల్దార్ కార్యాలయాల్లో రాజ్యమేలుతున్న అవినీతి..!

Related News

Contract Teachers: ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. రూ.21.99 కోట్ల నిధులు విడుదల!

Voter Revision: హైదరాబాద్‌లో ఓట్ల తొలగింపు కుట్ర?.. విజిలెన్స్ డేగ కన్ను..!

Banjara Ekta: బంజారా ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ నెల 27న ఢిల్లీలో భారీ బహిరంగ సభ!

కానిస్టేబుల్ పై ఫోక్సో కేసు నమోదు.. ఎక్కడంటే..?

నీట్ అక్రమాలపై పార్లమెంట్‌లో చర్చ జరగాల్సిందే.. బీజేపీపై ఎంపీ చామల ఫైర్!

హైదరాబాద్‌లో ఆ ఓట్లపై కాంగ్రెస్, MIM కన్ను.. రంగంలోకి దిగిన బీజేపీ!

కాంగ్రెస్ నడిచే పడవ కాదు.. మునిగే పడవ.. ప్రభుత్వంపై కేటీఆర్ సెటైర్లు!

కేవలం రూ. 6 లక్షలకే హైదరాబాద్‌లో ఇల్లు.. ప్రభుత్వం బంపరాఫర్!

Big Stories

Advertisement
×