E-Paper
Advertisement

Film industry: బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడ్డ ‘సేక్రేడ్ గేమ్స్’ బ్యూటీ.. ఎమోషనల్ పోస్ట్ వైరల్!

Film industry: బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడ్డ ‘సేక్రేడ్ గేమ్స్’ బ్యూటీ.. ఎమోషనల్ పోస్ట్ వైరల్!
Advertisement

Film industry: సినిమా ప్రపంచంలో సెలబ్రిటీలు ముఖానికి రంగు పూసుకొని తెరపై అందంగా ఆనందంగా కనిపించినప్పటికీ.. తెర వెనుక వారు పడే కష్టం వర్ణనాతీతం. ఏకంగా ప్రాణాలతో పోటీపడి కొంతమంది గెలిస్తే.. మరి కొంతమంది ఆ పోరాటం లో నెగ్గలేక ప్రాణాలు విడిచిన వారు కూడా ఉన్నారు. సినిమా కోసం తన ప్రాణాలను కూడా లెక్కచేయకుండా ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకోకుండా సెలబ్రిటీలు ప్రవర్తిస్తున్న తీరుకి.. ఆఖరికి వారికే మృత్యువు దరిచేరుతుంది. అందుకే ఎంత బిజీ షెడ్యూల్లో ఉన్నా కూడా ఆరోగ్యానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి అని నిపుణులు చెబుతున్నారు.

బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడ్డ ప్రముఖ హీరోయిన్..

ఇదిలా ఉండగా ఈ మధ్యకాలంలో కొంతమంది ప్రత్యేకించి సెలబ్రిటీలు క్యాన్సర్ బారిన పడగా.. అందులో నుండీ కొంతమంది దిగ్విజయంగా బయటపడితే.. మరికొంతమంది ఆ పోరాటాన్ని తట్టుకోలేక తుది శ్వాస విడుస్తున్నారు. ఇదిలా ఉండగా ఇప్పుడు మరో హీరోయిన్ బ్రెస్ట్ క్యాన్సర్ తో బాధపడుతూ అభిమానులతో ఒక ఎమోషనల్ పోస్ట్ పంచుకుంది. ఆమె ఎవరో కాదు ‘సేక్రేడ్ గేమ్స్’ రాజశ్రీ దేశ్ పాండే. తనకు బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయిందని ఈ విషయాన్ని అభిమానులతో పంచుకుంటూ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ప్రస్తుతం తాను కోలుకుంటున్నాను అని తెలిపిన ఆమె, హాస్పిటల్ బెడ్ పై తీసిన ఫోటోని షేర్ చేస్తూ తనకు గ్రేడ్ వన్ ఇన్ ఫిల్ట్రేటింగ్ డక్టల్ కార్సినోమా(NOS) ఉన్నట్లు డాక్టర్లు నిర్ధారించారని తెలిపింది. సాధారణ ఆరోగ్య పరీక్షల సమయంలోనే ఈ సమస్య బయటపడిందని, ముందుగానే గుర్తించడం వల్ల చికిత్స మరింత సులభం అయింది అని ఆమె తెలిపింది.. ఈ మేరకు ఒక ఎమోషనల్ నోట్ కూడా పంచుకుంది.

సాధారణ చికిత్సలోనే తేలిందంటూ…

Advertisement

అందులో రాజశ్రీ.. “నాకు గ్రేడ్ వన్ బ్రెస్ట్ క్యాన్సర్ ఉందని నా తల్లిదండ్రులకు చెప్పడానికి కూడా నా దగ్గర ధైర్యం లేదు.. కానీ అదృష్టవశాత్తు సాధారణ చెకప్ సమయంలోనే ఇది బయటపడింది. ఇప్పుడు ధైర్యంగా నేను నా సమస్యను నా కుటుంబ సభ్యులతో చెప్పగలిగాను. అనేక పరీక్షలు, శస్త్ర చికిత్సలు జరిగినప్పటికీ కుటుంబ సభ్యుల ప్రేమ, అభిమానుల మద్దతు నాకు మరింత బలాన్ని ఇచ్చాయి. ప్రస్తుతం నేను బాగా కోలుకుంటున్నాను. త్వరలోనే హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అవుతాను ” అంటే ఆమె తెలిపింది.. మొత్తానికైతే తనకు బ్రెస్ట్ క్యాన్సర్ ఉందని అభిమానులతో చెప్పడంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ధైర్యంగా ఉండాలని మానసిక ధైర్యమే వ్యాధి నిరోధకతకు తొలిమెట్టు అంటూ సలహాలు ఇస్తున్నారు.

ALSO READ:Anand deverakonda: అన్న బాటలోనే విజయ్ తమ్ముడు.. కోడలిగా మరో హీరోయిన్!

రాజశ్రీ దేశ్ పాండే సినిమా కెరియర్:

Advertisement

ఇక ఆమె సినిమా కెరియర్ విషయానికి వస్తే.. 2012లో వచ్చిన ‘తలాష్’ అనే చిత్రం ద్వారా తన సినీ జీవితాన్ని మొదలుపెట్టిన ఈమె.. ఆ తర్వాత కిక్, మామ్, మాంటో, ది స్కై ఈజ్ పింక్ వంటి చిత్రాలలో నటించింది. అలాగే అటు టెలివిజన్ సిరీస్ లో కూడా కనిపించింది . ఇక అంతేకాదు కమలహాసన్ థగ్ లైఫ్ చిత్రంలో కూడా నటించింది.

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×