Mahesh Babu -V.K.Naresh: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన సూపర్ స్టార్ కృష్ణ (Krishna)వారసుడిగా బాలనటుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ప్రస్తుతం హీరోగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇకపోతే సీనియర్ నటుడు కృష్ణ ప్రముఖ నటి విజయ నిర్మల(Vijay Nirmala) ను రెండో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే నిర్మల కుమారుడు నరేష్, మహేష్ వరసకు అన్నదమ్ములు అవుతారు. ఇకపోతే గత కొద్దిరోజులుగా నరేష్(Naresh), మహేష్ బాబు (Mahesh Babu)మధ్య పెద్ద ఎత్తున గొడవలు వచ్చాయని వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.
ఈ నేపథ్యంలోనే నటుడు నరేష్ ఈ వార్తల పట్ల స్పందిస్తూ తాజాగా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇటీవల ఒక సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నటుడు నరేష్ కు యాంకర్ నుంచి ఇదే అంశం పట్ల ప్రశ్నలు ఎదురయ్యాయి. కృష్ణ, విజయనిర్మల మరణించిన తర్వాత మహేష్ బాబు మీకు మధ్య విభేదాలు వచ్చాయని వార్తలు వస్తున్నాయి నిజమేనా? అంటూ ప్రశ్న ఎదురయింది. ఈ ప్రశ్నకు నరేష్ సమాధానం చెబుతూ మా మధ్య ఎలాంటి విభేదాలు లేవని ఏ విధమైనటువంటి గ్యాప్ కూడా రాలేదని తెలిపారు.
విజయనిర్మల అమ్మ అలాగే కృష్ణ గారు వెళ్తూ వెళ్తూ మమ్మల్ని అందరినీ కలిపే ఉంచి వెళ్లారని తెలిపారు. కృష్ణ గారు అమ్మ బ్రతికున్న సమయంలో కూడా మేము ఎప్పుడు కలిసే ఉండాలని చెప్పేవారు మేము చిన్నప్పుడు ఏదైనా షూటింగ్ కి వెళ్తే మమ్మల్ని అందరినీ కలిపి ఒకే చోట తినడానికి కూర్చో పెట్టేవారు. ఇలా వారు వెళుతూ మమ్మల్ని కలిపే వెళ్లారని నరేష్ తెలిపారు. ఇక మా మధ్య ఎలాంటి గ్యాప్ కూడా లేదని ఏదైనా ఫంక్షన్ జరిగినా మాకు ఇన్విటేషన్ వస్తుంది. మేము కూడా వారిని ఇన్వైట్ చేస్తామని అందరూ కలుస్తుంటామని తెలిపారు. ఇలా ఫంక్షన్లు మాత్రమే కాదు ఏ సమస్య వచ్చినా తాను ముందు ఉంటానని నరేష్ తెలిపారు..
ఇటీవల ప్రతి ఒక్కరు కూడా వారి వారి కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు అందుకే తరచూ కలవడం వంటివి మాత్రమే లేవని నరేష్ ఈ సందర్భంగా మహేష్ బాబు ఫ్యామిలీతో విభేదాలు ఉన్నాయి అంటూ వచ్చిన వార్తల పట్ల స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు. ఇక ఇటీవల రమేష్ బాబు కుమారుడు జయ కృష్ణ హీరోగా నటించిన శ్రీనివాస మంగాపురం సినిమాలో నరేష్ జయకృష్ణ తండ్రి పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. ఇక మహేష్ బాబు విషయానికి వస్తే ఇటీవల ఈయన వారణాసి సినిమా(Varanasi Movie) షూటింగ్ పూర్తి చేసుకున్నారు. ఈ సినిమా తర్వాత తన తదుపరి ప్రాజెక్టు గురించి మహేష్ బాబు ఇప్పటివరకు ప్రకటించకపోవడం గమనార్హం.
Also Read: బిగ్ బాస్ హోస్ట్ గా రమ్య కృష్ణ ఒక్కరోజు రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?