E-Paper
Advertisement

బిగ్ బాస్ హోస్ట్ గా రమ్య కృష్ణ ఒక్కరోజు రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

బిగ్ బాస్ హోస్ట్ గా రమ్య కృష్ణ ఒక్కరోజు రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
Advertisement

Bigg Boss Host Ramya Krishnan: బుల్లితెరపై ప్రసారం అవుతున్న అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమానికి చాలా మంచి ఆదరణ లభిస్తుంది. ఈ కార్యక్రమం కేవలం హిందీలో మాత్రమే కాకుండా సౌత్ లో కూడా మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషలలో కూడా పదవ సీజన్ ప్రసారమవుతున్న సంగతి తెలిసిందే. ఇకపోతే తెలుగులో ఈ కార్యక్రమానికి నాగార్జున హోస్ట్ గా వ్యవహరించగా తమిళంలో విజయ్ సేతుపతి(Vijay Sethupathi) వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్నారు. గత సీజన్ వరకు కూడా ఈ కార్యక్రమానికి తమిళ స్టార్ హీరో కమల్ హాసన్ (Kamal Hassan)వ్యాఖ్యతగా వ్యవహరించగా కొన్ని కారణాల వల్ల ఆయన తప్పుకోవడంతో విజయ్ సేతుపతి బాధ్యతలు తీసుకున్నారు.

విజయ్ సేతుపతి స్థానంలో రమ్యకృష్ణ..

ఇక విజయ్ సేతుపతి సైతం ఈ కార్యక్రమాన్ని ఎంతో విజయవంతంగా ముందుకు నడిపిస్తున్నారు. ఇదిలా ఉండగా విజయ్ సేతుపతి గత కొద్ది రోజులుగా గొంతునొప్పి సమస్యతో బాధపడుతున్న నేపథ్యంలో డాక్టర్ల సలహా మేరకు కొంత విశ్రాంతి తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ వీకెండ్ బిగ్ బాస్ హోస్ట్ గా శివగామి రమ్యకృష్ణ(Ramyakrishna) వేదిక పైకి వచ్చారు. ఈమె తనదైన శైలిలోనే వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్లకు చుక్కలు చూపించారు.

రమ్యకృష్ణ హోస్ట్ గా మొదటిసారి కాదు..

Advertisement

రమ్య కృష్ణ బిగ్ బాస్ హోస్ట్ గా కొనసాగడం ఇది మొదటిసారి కాదు గతంలో తెలుగులో సీజన్-3 కార్యక్రమంలో భాగంగా ఒక వారం ఈమె హోస్ట్ గా బాధ్యతలు తీసుకున్నారు అలాగే తమిళంలో సీజన్ 5 లో భాగంగా కమల్ హాసన్ గారి ఆరోగ్యం బాగా లేకపోతే అప్పుడు కూడా ఈమె హోస్ట్ గా వ్యవహరించారు. ఇక తమిళ బిగ్ బాస్ వేదిక పైకి రమ్యకృష్ణ రావడం ఇది రెండోసారి. ఇలా బిగ్ బాస్ హోస్ట్ గా రమ్యకృష్ణ కొనసాగుతున్న నేపథ్యంలో ఈమె రెమ్యూనరేషన్(Remuneration) కి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఒక్క రోజుకు 15 లక్షలు..

బిగ్ బాస్ హోస్టుగా రమ్యకృష్ణ ఎంత మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారనే విషయానికి వస్తే.. రమ్యకృష్ణ సాధారణంగా ఏదైనా సినిమా షూటింగ్ లో పాల్గొంటే ఒక రోజుకు 10 నుంచి 15 లక్షల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే బిగ్ బాస్ హోస్ట్ గా కొనసాగడం కోసం ఈమె ఒక్క రోజుకు 15 లక్షల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇలా ఒక వారానికి 30 లక్షలు అని సమాచారం. ఇక ఈమె ఎన్ని వారాలపాటు హోస్ట్ గా కొనసాగిన ఒక వారానికి 30 లక్షల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటారని తెలుస్తుంది. ఇలా వారానికి 30 లక్షల రెమ్యూనరేషన్ అంటే మామూలు విషయం కాదు. ఇక రమ్యకృష్ణ కెరియర్ విషయానికి వస్తే ప్రస్తుతం ఈమె వరస పాన్ ఇండియా సినిమాలకు కమిట్ అవుతూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.

Advertisement

Also Read: రష్మికను అన్ ఫాలో చేసిన విజయ్ దేవరకొండ…తెర పైకి విడాకుల వార్తలు?

Related News

బిగ్ బాస్ 10 సర్ప్రైజ్ ఎలిమినేషన్.. షాలిని అవుట్!

బిగ్ బాస్ పర్ఫెక్ట్ హోస్ట్ గా రమ్యకృష్ణ.. ఒక్క ఎపిసోడ్ తోనే దడదడలాడించిందిగా!

దక్షి ఎలిమినేటెడ్.. వైల్డ్ కార్డు ద్వారా వచ్చిన ఈమె ఎంత సంపాదించిందంటే?

బ్రాండ్ అంబాసిడర్ గా షాలిని.. ఇదెక్కడి ట్విస్ట్ నాగ్ సార్!

రోహిత్ కి ఊహించని షాక్.. హౌస్ లో ఉన్నంతకాలం అలాగే ఉండాల్సిందేనా?

Nindu Noorella Saavasam Serial Today Episode October 25th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరే హంతకురాలు అన్న విషయం వైజయంతికి తెలిసిపోతుందా..?    

ఒక్క పాటతో ఓవర్‌నైట్ క్రేజ్.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోక్ సాంగ్స్!

Big Stories

Advertisement
×