E-Paper
Advertisement

6 నెలలు.. 23 ఉరిశిక్షలు.. సంచలన జడ్జి రవికుమార్ దివాకర్ సడన్ ట్రాన్స్‌ఫర్!

6 నెలలు.. 23 ఉరిశిక్షలు.. సంచలన జడ్జి రవికుమార్ దివాకర్ సడన్ ట్రాన్స్‌ఫర్!
Advertisement

Judge Ravi Kumar: ఆరు నెలల వ్యవధిలో 23 మందికి మరణశిక్ష విధిస్తూ సంచలన తీర్పులు వెలువరించిన ఫాస్ట్‌ట్రాక్ కోర్టు న్యాయమూర్తి రవికుమార్ దివాకర్‌ను ఊహించని షాక్ తగిలింది. అలహాబాద్ హైకోర్టు ఆయన్ను ముజఫ్ఫర్‌నగర్‌లోని ఫ్యామిలీ కోర్టు అదనపు ప్రిన్సిపల్ జడ్జిగా బదిలీ చేసింది. అదే సమయంలో ఫాస్ట్‌ట్రాక్ కోర్టు నూతన అదనపు జిల్లా, సెషన్స్ జడ్జిగా శివకుమారి బాధ్యతలు స్వీకరించనున్నట్లు హైకోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొంది.

ఫాస్ట్‌ట్రాక్ కోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వర్తించిన రవికుమార్ దివాకర్.. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో సంచలనం సృష్టించారు. కేవలం ఆరు నెలల వ్యవధిలోనే మొత్తం 11 వేర్వేరు కేసుల్లో విచారణ పూర్తి చేసి.. 23 మంది నిందితులకు ఉరిశిక్ష (మరణశిక్ష) ఖరారు చేస్తూ తీర్పునిచ్చారు. దీంతో ఆయన శైలి తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Advertisement

ఇటీవల రవికుమార్ చేసిన వ్యాఖ్యలు, జారీ చేసిన తీర్పులు న్యాయవ్యవస్థలో పెద్ద కలకలాన్నే రేపాయి. నాటి జిల్లా సెషన్స్ జడ్జి బి.కె.సింగ్ ఆగస్టు నెలలో తన కోర్టు నుంచి దాదాపు 97 కేసులను ఉపసంహరించుకోవడాన్ని దివాకర్ తీవ్రంగా ప్రశ్నించారు. ఈ కేసుల్లో హత్యలు, ఇతర తీవ్రమైన నేరాలకు సంబంధించినవి ఉన్నాయని, విచారణ సగం పూర్తయిన (part-heard) కేసులను ఇలా మార్చడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు.

Also Read: 12 ఏళ్ల ‘మన్ కీ బాత్’ ప్రయాణం.. దీన్ని ‘తీర్థయాత్ర’తో పోల్చిన ప్రధాని మోదీ!

Advertisement

సుమారు 10 ఏళ్ల క్రితం నాటి ఎన్‌డీపీఎస్ (NDPS) కేసులో నిందితుడిని విముక్తి చేస్తూ ఇచ్చిన 35 పేజీల తీర్పులో ఆయన ఈ అంశాన్ని సమగ్రంగా ప్రస్తావించారు. చట్టబద్ధమైన ప్రక్రియను పాటించకుండా కేవలం అడ్మినిస్ట్రేటివ్ ఆర్డర్ల ద్వారా విచారణ ప్రారంభమైన కేసులను వేరే కోర్టులకు బదిలీ చేయడం సాధ్యమేనా అని ఆయన నిలదీశారు. అంతేకాకుండా జిల్లా జడ్జీలకు ఉండే పరిపాలనాధికారాల పరిమితులు, న్యాయవ్యవస్థ స్వతంత్రతపై కూడా ఆయన సందేహాలను లేవనెత్తారు. ఈ వివాదం నడుస్తుండగానే తాజాగా ఆయనను ఫ్యామిలీ కోర్టుకు బదిలి చేస్తూ అలహాబాద్ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

Also Read: ‘ఆ పార్టీకి ఇక రాజకీయ భవిష్యత్తే లేదు’.. జేడీయూ వేటుపై అనంత సింగ్ ఫైర్!

Tags

Related News

12 ఏళ్ల ‘మన్ కీ బాత్’ ప్రయాణం.. దీన్ని ‘తీర్థయాత్ర’తో పోల్చిన ప్రధాని మోదీ!

‘ఆ పార్టీకి ఇక రాజకీయ భవిష్యత్తే లేదు’.. జేడీయూ వేటుపై అనంత సింగ్ ఫైర్!

ఫ్లిప్‌కార్ట్ పార్సిల్స్ చోరీ.. కస్టమర్ల ఆర్డర్లతో డెలివరీ ఏజెంట్ జంప్.. చివరికి ఎలా దొరికాడంటే!

సంచలనం రేపుతున్న సెన్సార్ బోర్డ్‌ డేటా లీక్.. 500 చిత్రాలకు రికార్డులు బయటకు

భర్త విద్యార్థి అయినా భార్యకు భరణం ఇవ్వాల్సిందే.. హై కోర్టు షాకింగ్ తీర్పు

కోపంతో మరిది ప్రైవేటు పార్ట్స్ కొరికిన వదిన, ఎన్నికుట్లు పడ్డాయంటే, యూపీలో షాకింగ్ ఘటన

ఇంటర్ విద్యార్థులకు బిగ్ అలర్ట్.. జేఈఈ మెయిన్స్-2027 రిజిస్ట్రేషన్ మొదలు, కీలక మార్పులివే

Big Stories

Advertisement
×