E-Paper
Advertisement

Rowdy Janardhan: నాని సినిమాతో రౌడీ జనార్థన్‌ పోలిక.. అసలు ఈ హీరోల ఫైట్ ఏంటో?

Rowdy Janardhan: నాని సినిమాతో రౌడీ జనార్థన్‌ పోలిక.. అసలు ఈ హీరోల ఫైట్ ఏంటో?
Advertisement

Rowdy Janardhan- The Paradise: ‘పెళ్లి చూపులు‘ సినిమాతో హీరోగా మారిన విజయ్ దేవరకొండ.. మొదటి సినిమాతోనే ఫ్యామిలీ ఆడియన్స్‌ని బాగా ఆకట్టుకున్నాడు. ఈ మూవీతో అతడికి లేడీ ఫాలోయింగ్‌ కూడా విపరీతంగా పెరిగింది. ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఎంత సక్సెస్ సాధించిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత గీతా గోవిందం, డియర్‌ కామ్రేడ్‌ వంటి చిత్రాలతో మంచి హిట్‌ కొట్టాడు. ఆ టాక్సీవాలా వంటి సినిమాలు చేశాడు కానీ, అవి ఆశించిన విజయం సాధించలేదు. ఫ్యామిలీ సినిమాలతో ఇక్కడ మంచి క్రేజ్‌ సంపాదించుకున్న విజయ్‌.. లైగర్‌ పాన్‌ ఇండియా బాటపట్టాడు. కానీ, మూవీ దారుణంగా బొల్తా కొట్టింది.

రౌడీ జనార్థన్ తో బిజీ

Advertisement

ఈ మూవీ ప్లాప్‌ తర్వాత ఫ్యామిలీ స్టార్ చేశాడు. ఇది పర్వలేదనిపించింది. ఆ తర్వాత వచ్చిన ఖుషి కూడా బొత్తా కొట్టింది. ఈ ఏడాది కింగ్‌డమ్‌తో వచ్చి మంచి హిట్‌ కొట్టాడు. ప్రస్తుతం రౌడీ జనార్ధన్ అనే సినిమా చేస్తున్నాడు. రవి కిరణ్ కోలా దర్శకత్వంలో ఈ సినిమా రాబోతుంది. రాజా వారు రాణి గారు సినిమా తర్వాత ఇప్పటివరకు రవి కిరణ్ కోలా ఒక్క సినిమా కూడా చేయలేదు. రవి కిరణ్ రౌడీ జనార్దన్ సినిమాలు మాత్రం నెక్స్ట్ లెవెల్ లో తీయబోతున్నాడు అని ఇండస్ట్రీ వర్గాలు నుంచి సమాచారం. ఇక నిన్న విడుదలైన టైటిల్‌ గ్లింప్స్‌తో ఈ మూవీ హాట్‌ టాపిక్‌గా మారింది. గ్లింప్స్‌లో వైలెన్స్‌ ఎక్కువగా చూపించారు. దీంతో ఈ చిత్రాన్ని నాని ప్యారడైజ్‌తో పోలుస్తున్యనారు.

పారడైజ్ సినిమాతో పోలిక

కాగా ఈరోజుల్లో ఆడియన్స్ వైలెన్స్ కి ఎక్కువ అలవాటు పడిపోయారని ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే చాలామంది దర్శకులు కూడా ఎక్కువ వైలెన్స్ రాస్తున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఓ జి సినిమాలో రక్తపాతం సృష్టిస్తేనే బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురిసింది. ఇకపోతే ఒక శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని హీరోగా చేస్తున్న సినిమా పారడైజ్. ఈ సినిమా మార్చి 26న విడుదల కాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పటికీ ఈ సినిమా ఆ డేట్ కి వస్తుంది అనే క్లారిటీ కూడా చాలామందికి లేదు. ఇక రౌడీ జనార్ధన్ గ్లిమ్స్ వీడియోలో ఆ రక్తపాతాన్ని చూసి చాలామంది నాని సినిమా పారడైజ్ తో కంపేర్ చేయడం మొదలుపెట్టారు. అయితే రౌడీ జనార్ధన్ సినిమా 2026 డిసెంబర్లో విడుదల అవుతుంది. అప్పటివరకు ఇటువంటి పోలికలు చేయకుండా ఉంటే మంచిది అని చాలామంది అభిప్రాయం.

Advertisement

Also Read: Bigg Boss Telugu: బిగ్‌బాస్‌ కప్ గెలవడం లాభం కాదు.. శాపం!

అసలు ఫైట్ ఏంటో

విజయ్ దేవరకొండ నాని కలిసి ఎవడే సుబ్రమణ్యం అనే సినిమా చేశారు. ఆ సినిమాలో విజయ్ దేవరకొండ రిషి పాత్ర చాలా ఆసక్తికరంగా ఉంటుంది. అయితే ఫ్యాన్ వార్స్ జరగడం అనేది ఈ మధ్యకాలంలో కామన్ అయిపోయింది. ఇప్పుడు ఎక్కువగా ఫ్యాన్ వార్స్ విజయ్ దేవరకొండ మరియు నాని మధ్య జరుగుతుంటుంది. ఇప్పటికీ కూడా చాలామందికి వీరిద్దరి మధ్య ఎందుకు ఫ్యాన్ వార్స్ జరుగుతున్నాయో అర్థం కాదు. మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అని వీరిద్దరి అభిమానులు కూడా సోషల్ మీడియాలో పలు సందర్భాలలో వాదనలు చేసుకున్నారు. అయితే ఈ రెండు సినిమాలకు సంబంధించి ఒక బూతు పదం మాత్రం మళ్లీ డిస్కషన్ లోకి వచ్చింది.

Related News

జ్యోతి పూర్వజ్, పూర్వాజ్ మూవీ ‘కిల్లర్’.. ఒకేసారి రెండు అప్డేట్స్!

‘స్పిరిట్’ వాయిదా.. ఫ్యాన్స్‌కు కొత్త రిలీజ్ డేట్ ప్రకటించిన సందీప్ రెడ్డి వంగా!

గరివిడి లక్ష్మి సినిమాపై రవితేజ రివ్యూ.. ఏమన్నారంటే?

ఏడేళ్ల వయసులోనే సాఫ్ట్వేర్ సంస్థకు యజమాని.. ‘జైలర్’ బుడ్డోడు చిన్నోడు కాదండోయ్!

‘గరివిడి లక్ష్మి’లో ఆర్పీ పట్నాయక్ పాత్ర వెనుక అసలు కథ ఇదేనా?

క్యాస్టింగ్ కౌచ్‌పై ఝాన్సీ ఏమన్నారంటే.. ఇండస్ట్రీలో మహిళల పరిస్థితి ఇదేనా?

యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న ‘హైకూ’.. అక్టోబర్ 23న థియేటర్లలోకి!

మాల్దీవుల్లో ఖుషీ కపూర్ అందాల సందడి.. ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్!

Big Stories

Advertisement
×