Bigg Boss Telugu Winners: బిగ్ బాస్.. ఈ రియాలిటీ షోకి ఉన్న ఆదరణ ఇంత అంత కాదు. అన్ని భాషల్లోనూ ఈ షోకు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఏ భాషలో బిగ్ బాస్ కొత్త సీజన్ వస్తుందంటే ఆడియన్స్కి పండగే. కొంతమంది సెలబ్రిటీలను మూడు నెలల పాటు ఒక్కచోట చేర్చడమే ఈ బిగ్ బాస్ కాన్సెప్ట్. వారి ఆటపాట, ఎమోషన్స్, గొడవలు, లవ్ట్రాక్స్ అంటూ 105 రోజుల పాటు ప్రేక్షకులను టీవీలకే కట్టిపడేయడమే బిగ్ బాస్ టీం లక్ష్యం. ఇందుకోసం వారు కంటెస్టెంట్స్ని ఎంత ఎత్తుకైనా ఎక్కిస్తారు..అలాగే అంతకంతకు దిగజారుస్తారు కూడా. ప్రతి సీజన్లో ఇలాంటివి చూస్తూనే ఉంటున్నాం.
ఏ సెలబ్రిటీ అయినా ఒక్కసారి బిగ్ బాస్‌కి వెళ్లే అవకాశం వస్తే చాలు.. దానికి ద్వారా వచ్చే ఫాలోయింగ్తో కెరీర్లో సెటిలైపోవచ్చు అనుకంటారు. అలా ఎన్నో ఆశలతో హౌజ్లోకి అడుగుపెడతారు. అదే బిగ్బాస్ విన్నర్ అయితే. ఇక వారి పంట పడ్డినట్టే అనుకుంటారు. ఇది ప్రతి సీజన్లో చూస్తున్నాం. కానీ, వారి కెరీర్ చూస్తే బిగ్ బాస్ ముందు ఒక లెక్క.. బిగ్ బాస్ తర్వాత ఒక లెక్క అన్నట్టు అయిపోయింది. బిగ్ బాస్ మరిన్ని ఆఫర్స్ అందుకోవచ్చు అనుకునేవారికి.. బయటకు వచ్చాక అసలు అవకాశాలు దరిదాపుల్లోకి రావడం లేదు. ఒక కంటెస్టెంట్స్ విషయం పక్కన పెడితే.. విన్నర్ని చూద్దాం. బిగ్ బాస్ కప్ గెలవడమంటే.. ఆ కంటెస్టెంట్ స్టార్ హీరో అయినట్టే భావిస్తారు. బయట ఫాలోయింగ్ కూడా ఆ రేంజ్లో ఉంటుంది. కానీ, కప్ గెలిచి బయటకు వచ్చాక వారి పరిస్థితి ఏమైందో ఇక్కడ ఒకసారి చూద్దాం.
మొదటి సీజన్లో హీరో శివ బలాజీ కప్ గెలిచి రూ. 50 లక్షల ప్రైజ్మనీ గెలిచాడు. బిగ్ బాస్ హీరోగా బయటకు వచ్చిన అతడికి ఆ తర్వాత చెప్పుకొదగ్గ ఆఫర్స్ లేవు. బిగ్ బాస్ నుంచి వచ్చిన కొన్ని రోజుల వరకు ఇంటర్య్వూలు అంటూ నానా హడావుడి చేశారు. ఆ బజ్ తగ్గగానే అంత శివాజీ మరిచిపోయారు. అంతకు ముందు ఆడపదడప సినిమాలు చేసుకునే ఈ హీరోకి ఇప్పుడు ఆ అవకాశాలు కూడా లేవు. మా అసోసియేషన్ విష్ణు ప్యానెల్ సభ్యుడిగా ఉండి తెరవెనక కాస్తాకూస్తో హడావుడి చేస్తున్నాడంతే.
ఇక సీజన్ 2 విన్నర్ కౌశల్ మండ.. అతడు ఒక మోడల్. అదే క్రేజ్ సీరియల్లో విలన్ రోల్స్.. సినిమాల్లో హీరో స్నేహితుడి క్యారెక్టర్లు చేస్తూ కెరీర్ని నెట్టుకొచ్చాడు. ఆ గుర్తింపుతో బిగ్బాస్ సీజన్ 2లో వచ్చి.. విన్నర్ అయ్యాడు. హౌజ్ మిగతా కంటెస్టెంట్స్ ఫుల్ వ్యతిరేకత తెచ్చుకున్న అతడికి బయటక ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. కౌశల్ ఆర్మీ ఫ్యాన్ గ్రూప్ కూడా పుట్టుకొచ్చింది. అలా అభిమానుల సపోర్టు టైటిల్ గెలిచి బిగ్బాస్ హీరో అయ్యాడు. అలా బయటకు వచ్చిన కౌశల్కి ఇక ఆఫర్స్ ఏ రేంజ్ ఉంటాయో అని అంత అనుకున్నారు. కానీ, అందరి ఊహలకు భిన్నంగా అయ్యింది.
ఒకప్పుడు కనీసం సీరియల్లో అయినా కనిపించే కౌశల్.. ఇప్పుడు పూర్తి సినీ, టీవీ ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. ప్రస్తుతం మోడలింగ్ ట్రైయినింగ్ సెంటర్ పెట్టుకుని శిక్షణ ఇస్తున్నాడు. బిగ్బాస్ సీజన్ 3లో రాహుల్ సిప్లిగంజ్ విన్నర్ అయ్యాడు. అంతకుముందు ప్లే బ్యాక్ సింగర్‌గా రాణించిన అతడు హౌజ్ నుంచి బయటకు వచ్చాక ఆయన కెరీర్లో ఏమాత్రం మార్పు లేదు. కానీ, కొన్ని రోజుల తర్వాత ఆర్ఆర్ఆర్ మూవీలో అతడు పాడిన నాటు నాటు పాటకు ఆస్కార్ రావడంతో రాహుల్ పేరు మారుమ్రోగింది. కానీ, దీనికి బిగ్బాస్కు సంబంధం లేదు. అతడు గెలిచిన కూడా బయటకు వచ్చాక రాహుల్కి కెరీర్కి పెద్దగా యూజ్ ఏం లేదనే చెప్పాలి.
అభిజిత్.. బిగ్ బాస్ సీజన్ 4 టైటిల్ గెలిచాడు. లైఫ్ ఈజ్ బ్యూటీఫిల్ చిత్రంతో హీరోగా పరిచయం అయ్యాడు. దీని తర్వాత చిన్న చిన్న సినిమాల్లో కనిపించిన అతడు బిగ్ బాస్ తర్వాత పూర్తిగా ఇండస్ట్రీకి దూరమయ్యాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు.. ఎక్కడ ఉన్నాడని కూడా తెలియదు. బిగ్ బాస్ సీజన్ 4 తర్వాత బిగ్ బాస్ అగ్నీ పరీక్షలో కనిపించాడు.
వీజే సన్నీ.. బిగ్ బాస్ సీజన్ 5 టైటిల్ విన్నర్. అప్పటి వరకు టీవీ షోలకు యాంకర్గా రాణించాడు. ఆ తర్వాత సీరియల్లో హీరోగా నటించాడు. అదే టైంలో బిగ్బాస్కి వచ్చాడు. టైటిల్తో బయటకు వచ్చాడు. ఆ తర్వాత ఒకటి రెండు సినిమాల్లో హీరోగా చేశాడు. కానీ, అవి పెద్దగా ఆదరణ పొందలేదు. హీరోగా కొనసాగుతాడనుకుంటే ప్రస్తుతం అతడి చేతిలో ఆఫర్స్ ఉన్నట్టు కనిపించడం లేదు. కనీసం బుల్లితెరపై కూడా వీజే సన్నీ సందడి లేకుండ పోయింది. పూర్తిగా తెరపై కనుమరుగయ్యాడు.
సింగర్ రేవంత్… బిగ్బాస్ సీజన్ 6 టైటిల్ గెలిచాడు. పేరుకే బిగ్ బాస్ విన్నర్. దీనివల్ల రేవంత్ కెరీర్కి పెద్దగా ప్లస్ అయ్యిందేమి లేదు. ఎలా హౌజ్లోకి వచ్చాడో.. అలాగే బయటకు వచ్చాడు. బయట రేవంత్కి పెద్దగా సపోర్టుగా కనిపించలేదు. ఇండియన్ ఐడల్ గెలిచాడనే ఒక్క కారణం వల్లే ఈ టైటిల్ అతడికి ఇచ్చారనే టాక్ కూడా వినిపించింది.
పల్లవి ప్రశాంత్.. బిగ్ బాస్ సీజన్ 7 కప్ గెలిచి అందరికి షాకిచ్చాడు. సోషల్ మీడియా ఇన్ప్లూయేన్సర్గా హౌజ్ లోకి వచ్చి రైతుబిడ్డ అనే సింపతి ట్యాగ్ వాడాడు. అదే ట్యాగ్తో కప్ గెలిచాడు. ఈ షో ఎంతో ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. బయట అతడిపేరుపై కుప్పులు కుప్పలుగా సోషల్ మీడియా అకౌంట్స్ పుట్టుకొచ్చాయి. బయటకు వచ్చాక కాస్తా సందడి కనిపించింది. ఇక ఇప్పుడు పల్లవి ప్రశాంత్ పేరు కేవలం బిగ్ బాస్ టైటిల్‌కే అంకితమైంది. ప్రస్తుతం అతడి పేరు కూడా ఎక్కడ వినిపించడం లేదు.. కనిపించడం లేదు.
అఖిల్.. బిగ్ బాస్ సీజన్ 8 టైటిల్ గెలిచాడు. సీరియల్గా హీరోగా వచ్చిన అతడు తనదైన ఆట, బ్యాలెన్సింగ్తో హౌజ్ లో రాణించాడు. సీరియల్తో ఉన్న ఆదరణనే అతడికి బిగ్ బాస్ టైటిల్ వచ్చేలా చేసింది. ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ కప్ గెలిచిన పేరుకే అఖిల్ పేరు పరిమితమైంది. బయటకు వచ్చాక అసలు అఖిల్ సందడి ఎక్కడ కనిపించడం లేదు వినిపించడం లేదు. అప్పటి సీరియల్ హీరోగా ఉన్న ఆ గుర్తింపు కూడా ఇప్పుడు లేకుండ పోయింది.
ఇక బిగ్ బాస్ ఓటీటీ సీజన్ గెలిచిన బింధుమాధవి పరిస్థితి కూడా ఇలాగే ఉంది. ఈ సీజన్ విన్నర్ తర్వాత ఆమెకి ఇక ఆఫర్స్ క్యూ కడతాయని అనుకున్నారు. కానీ, ఆమె పరిస్థితి కూడా ఏం మారలేదు. ఇంక చెప్పాలంటే ఈ సీజన్ కప్ అందుకున్న తర్వాత ఆమె తెరపై కనిపించడానికి చాలా కాలం పట్టింది. ఇప్పుడిప్పుడే ఆఫర్స్ అందుకుంటు మెల్లిగా రీఎంట్రీ ప్లాన్ చేసుకుంటుంది.
కళ్యాణ్ పడాల.. లేటెస్ట్ బిగ్ బాస్ సీజన్ 9 టైటిల్ గెలిచి హాట్ టాపిక్ అయ్యాడు. సోల్జర్గా ఆర్మీలో పని చేస్తున్న అతడు కామనర్గా హౌజ్ లో అడుగుపెట్టాడు. మొదట పెద్దగా ఆట కనబర్చని అతడు చివరిలో కాస్తా పుంజుకున్నాడు. సోల్జర్ అనే ట్యాగ్ తప్ప కళ్యాణ్ పడాల బిగ్ బాస్ టైటిల్ గెలిచేందుకు అతడి పెట్టిన ఎఫర్ట్స్ తక్కువే. కేవలం సింపతి కార్డు, సోల్జర్ అనే ట్యాగ్ అతడిని ఈ సీజన్ విన్నర్‌గా నిలబెట్టింది. దీనిబట్టి చూస్తే బిగ్ బాస్ టైటిల్ గెలవడం అనేది కేవలం పేరుకు మాత్రమే. వారి కెరీర్కి పెద్దగా ప్లస్ అయ్యిందేమి లేదు. ఇంకా చెప్పాలంటే గెలుపు తర్వాత విన్నర్స్ అంత కనుమరుగైనవాళ్లే. ఇలా చూస్తే బిగ్ బాస్ టైటిల్ గెలవడం వల్ల లాభం పడినవాళ్లు ఎవరూ కనిపించడం లేదు. చూస్తుంటే టైటిల్ గెలవడం కంటెస్టెంట్స్కి శాపమా అన్నట్టుగానే ఉంది.