E-Paper
Advertisement

Vihaan Malhotra: ఆర్సీబీకి డేంజ‌ర్‌ ఆల్ రౌండ‌ర్ దొరికేశాడోచ్‌, ఇక ఫ్యాన్స్ కు పండ‌గే..ఇంత‌కి ఎవ‌రీ విహాన్ మల్హోత్రా ?

Vihaan Malhotra: ఆర్సీబీకి డేంజ‌ర్‌ ఆల్ రౌండ‌ర్ దొరికేశాడోచ్‌, ఇక ఫ్యాన్స్ కు పండ‌గే..ఇంత‌కి ఎవ‌రీ విహాన్ మల్హోత్రా ?
Advertisement

Vihaan Malhotra:  ఐసీసీ అండర్ 19 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( U19 World cup 2026 ) నేపథ్యంలో మరో ఆణిముత్యం తెరపైకి వచ్చింది. అయితే ఈ టోర్నమెంట్ నేపథ్యంలో బ్యాటింగ్ అదే సమయంలో బౌలింగ్ రెండు విభాగాల్లో అద్భుతంగా అద్భుతంగా రాణిస్తున్నాడు టీమిండియా యంగ్ కుర్రాడు విహాన్ మనోజ్ మల్హోత్రా ( Vihaan Malhotra). అండర్ 19 టీమిండియా జట్టులో ఆల్రౌండర్ పాత్ర పోషిస్తున్నాడు. మొన్న లీగ్ దశలో బంగ్లాదేశ్ వర్సెస్ టీమ్ ఇండియా మ్యాచ్ జరగగా, అప్పుడు బౌలింగ్ లో రాణించి, నిన్న జింబాబ్వేపై సెంచరీ చేసి ఇరగదీసాడు విహాన్ మల్హోత్రా. దీంతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు శిబిరంలో నూతన ఉత్సాహం నెల‌కొంది. టీమిండియా జట్టులో అద్భుతంగా రాణిస్తున్న ఈ విహాన్ మల్హోత్రాను రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు మొన్నటి ఐపీఎల్ మినీ వేలంలో కొనుగోలు చేసింది. ఆర్సీబీ అంచనాలకు మించి విహాన్ మల్హోత్రా రాణిస్తున్న నేపథ్యంలో సంబరపడిపోతున్నారు ఓనర్లు.

Also Read: Abhishek Sharma vs Chris Gayle: అభిషేక్ శ‌ర్మ వ‌ర్సెస్ క్రిస్ గేల్..ఇందులో ఎవ‌రు రియ‌ల్ “యునివర్సల్‌ బాస్‌ “

రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ( RCB ) మరో ఆల్ రౌండ‌ర్‌

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( IPL 2026) మార్చి 26వ తేదీన ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఇలాంటి నేపథ్యంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు మరో డేంజర్ ఆల్ రౌండర్ దొరికేశాడు. కేవలం 30 లక్షలకే కొనుగోలు చేసిన విహాన్ మల్హోత్రా అండర్ 19 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ లో అద్భుతంగా రాణిస్తున్నాడు. బ్యాటింగ్ అలాగే బౌలింగ్ రెండు విభాగాల్లో కూడా ఇరగదీస్తున్నాడు. అండర్ 19 వన్డే వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో బంగ్లాదేశ్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య జనవరి 17వ తేదీన మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో విహాన్ మల్హోత్రా నాలుగు ఓవర్లు వేసి నాలుగు వికెట్లు పడగొట్టాడు. కేవలం 14 పరుగులు మాత్రమే ఇచ్చాడు. దీంతో టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఇక నిన్న జింబాబ్వే వర్సెస్ టీమ్ ఇండియా మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఇందులో 204 పరుగుల తేడాతో ఇండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది. అయితే ఈ మ్యాచ్ లో టీమిండియా తరఫున బరిలోకి దిగిన విహాన్ మల్హోత్రా 109 పరుగులతో రాణించాడు. ఈ దెబ్బకు ఇండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఇలా రెండు విభాగంలో అద్భుతంగా విహాన్ మల్హోత్రా రాణిస్తున్న నేపథ్యంలో బెంగళూరు సంబరపడిపోతుంది. తమకు మరో డేంజర్ ఆల్ రౌండర్ దొరికాడని ఖుషీ అవుతోంది. అటు ఫాన్స్ కూడా సంబరపడిపోతున్నారు.

ఇంతకి ఎవ‌రీ విహాన్ మల్హోత్రా ?

విహాన్ మల్హోత్రా ఇండియాకు చెందిన ఆల్రౌండర్. ప్రస్తుతం అండర్ 19 టీమ్ ఇండియాలో వన్డే వరల్డ్ కప్ ఆడుతున్నాడు. పంజాబ్ లో జన్మించిన విహాన్ మల్హోత్రా, అండర్ 16 పంజాబ్ జట్టుకు ఎంపికై ఆ తర్వాత టీమిండియా అండర్ 19 జట్టులో స్థానం దక్కించుకున్నాడు. ఇతను లెఫ్ట్ హ్యాండ్ బ్యాటింగ్ చేయడమే కాకుండా కుడి చేతితో ఆఫ్ బ్రేక్ బౌలింగ్ చేస్తాడు. ఇక ఇత‌న్ని రూ.30 లక్షలకు మొన్న మినీ వేలంలో బెంగళూరు కొనుగోలు చేసింది.

Advertisement

Also Read: BAN PAK – T20 World Cup: PCB తిక్క కుదిర్చిన ఐసీసీ.. టీ20 ప్ర‌పంచ క‌ప్ లో పాకిస్తాన్ స్థానంలో బంగ్లాదేశ్ ఎంట్రీ ?

 

 

Related News

లార్డ్స్ వన్డేలో బాల్ టాంపరింగ్…శ్రేయస్ అయ్యర్ పై బ్యాన్?

లార్డ్స్ నుంచి అలిగి ఇంటికి వెళ్లిపోయిన గంభీర్..?

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

Big Stories

Advertisement
×