E-Paper
Advertisement

HP HyperX Omen 15: గేమర్స్ కోసం HP కొత్త అస్త్రం.. AI ఫీచర్లతో ‘ఒమెన్ 15’ విడుదల!

HP HyperX Omen 15: గేమర్స్ కోసం HP కొత్త అస్త్రం.. AI ఫీచర్లతో ‘ఒమెన్ 15’ విడుదల!
Advertisement

HP HyperX Omen 15: గేమింగ్ లవర్స్ కోసం ప్రముఖ HP సంస్థ అత్యాధునిక టెక్నాలజీతో HyperX Omen 15 సిరీస్‌ను భారత్ మార్కెట్లో లాంచ్ చేసింది. శక్తివంతమైన ప్రాసెసర్, అదిరిపోయే గ్రాఫిక్స్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ ల్యాప్‌టాప్.. అటు ప్రొఫెషనల్ గేమర్లకు, ఇటు క్రియేటర్లకు ఒక అద్భుతమైన ఛాయిస్ అనే చెప్పాలి. ముఖ్యంగా ఈ ల్యాప్‌టాప్‌లో ఉన్న AI ఫీచర్లు గేమింగ్ అనుభవాన్ని మరో స్థాయికి తీసుకెళ్తాయని కంపెనీ చెబుతోంది. ఇప్పుడీ HP HyperX Omen 15 ల్యాప్‌టాప్ పూర్తి వివరాళ్లోకి వెళ్లిపోదాం..

500 పీక్ బ్రైట్‌నెస్:

ఈ ల్యాప్‌టాప్ లోపల అత్యంత వేగవంతమైన ఇంటెల్ కోర్ i7-14650HX ప్రాసెసర్‌ను అమర్చారు. అలాగా ఎన్విడియా జీఫోర్స్ RTX 50 సిరీస్ గ్రాఫిక్ కార్డ్ కూడా ఉంది. 170W గ్రాఫిక్స్ పవర్‌తో పనిచేసే ఈ సిస్టమ్.. భారీ గేమ్‌లను కూడా ఆటంకం లేకుండా రన్ చేస్తుంది. 180Hz రిఫ్రెష్ రేట్, 500 నిట్స్ బ్రైట్‌నెస్‌తో కూడిన స్క్రీన్ దృశ్యాలను చాలా స్పష్టంగా చూపిస్తుంది. ఇది 0.125ms రెస్పాన్స్ టైమ్ కలిగి ఉండటం వలన గేమింగ్‌లో ప్రతి కదలిక మెరుపు వేగంతో చూపిస్తుంది.

Advertisement

Also Read: ఒక్కసారి ఛార్జ్ చేస్తే 25 రోజులు వాడొచ్చు.. అమాజ్‌ఫిట్ యాక్టివ్ మాక్స్ స్మార్ట్‌వాచ్ భారత్‌లో లాంచ్!

ఆటోమేటిక్ సెట్టింగ్స్:

ఈ HP HyperX Omen 15 సిరీస్‌లో వన్ టచ్ ఒమెన్ AI ఫీచర్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఇది ల్యాప్‌టాప్ పనితీరును ఎప్పటికప్పుడు గమనిస్తూ.. అవసరానికి తగ్గట్టుగా సిస్టమ్ సెట్టింగ్‌లను ఆటోమేటిక్‌గా మార్చేస్తుంది. ఇక వేడెక్కకుండా ఉండేందుకు ఒమెన్ టెంపెస్ట్ కూలింగ్ వ్యవస్థను వాడారు. అలాగే ధూళి వల్ల ఫ్యాన్లు పాడవకుండా సెల్ఫ్ క్లీనింగ్ ఫీచర్‌ను కూడా ఇందులో చేర్చడం విశేషం.

లాంచ్ ఆఫర్ల వివరాలు:

Advertisement

భారత మార్కెట్లో హైపర్‌ఎక్స్ ఒమెన్ 15 ప్రారంభ ధర రూ.1,49,999. అయితే దీనిపై HP లాంచ్ ఆఫర్లను కూడా ప్రకటించింది. పాత ల్యాప్‌టాప్‌లపై ఎక్స్ఛేంజ్ బోనస్‌తో పాటు, ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై డిస్కౌంట్లు కలిపి దాదాపు రూ.50,000 వరకు ఆదా చేసుకునే అవకాశం ఉంది. ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఈ ల్యాప్‌టాప్‌ను 18 నెలల EMI ద్వారా కూడా సొంతం చేసుకోవచ్చు.

Also Read: వివో నుంచి మరో సంచలనం.. 6,200mAh బ్యాటరీ, 50MP ట్రిపుల్ కెమెరాతో కొత్త ఫోన్ లాంచ్!

 

Related News

సినిమా లవర్స్‌కు పండగే.. పాకెట్ మనీ ధరకు.. 4K కంటెంట్ స్ట్రీమింగ్ ప్రొజెక్టర్!

భూమి తిరగడం ఒక్క సెకను ఆగితే ఏమవుతుంది? అసలు మానవజాతి మిగులుతుందా?

ల్యాప్‌టాప్ కావాలా? మార్కెట్లో అదరగొడుతున్న.. టాప్-5 టచ్‌స్క్రీన్ మోడల్స్ ఇవే!

ఇంత పెద్ద బ్యాటరీ ఉన్నా ఫోన్ సన్నగానే ఉందా? ఒప్పో మ్యాజిక్ అంటే ఇదేనేమో!

ఆస్ట్రేలియా బాటలోనే భారత్.. 16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియాపై ఆంక్షలు నిజమేనా?

మోటరోలా కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్ సేల్ మొదలైంది.. ఆఫర్లతో ఏకంగా రూ.10,000 ఆదా!

ఏకకాలంలో 10 గాడ్జెట్లు చార్జ్.. బ్లూయెట్టి మ్యాజిక్ పవర్ స్టేషన్.. అడవుల్లోనూ ఇంట్లో ఉన్నట్లే!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

Big Stories

Advertisement
×