E-Paper
Advertisement

Andhra Pradesh: దారుణం.. సీనియర్ల భూతానికి ట్రిపుల్ ఐటీ విద్యార్థి ఆత్మహత్మ

Andhra Pradesh: దారుణం.. సీనియర్ల భూతానికి ట్రిపుల్ ఐటీ విద్యార్థి ఆత్మహత్మ
Advertisement

Andhra Pradesh: శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలోని IIITలో బీటెక్ ఇంజనీరింగ్ విద్యార్థి ప్రత్తిపాటి సృజన్ ఆత్మహత్య చేసుకోవడంతో తీవ్ర కలకలం రేపుతోంది. ఈ ఘటన బుధవారం ఉదయం జరిగింది. సృజన్ (20), గుంటూరు జిల్లకు చెందినవాడు, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ (EEE) మూడవ సంవత్సరం చదువుతున్నాడు. అయితే హాస్టల్ గదిలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తోటి విద్యార్థులు, హాస్టల్ సిబ్బంది చూసి అతని గది తలుపు పగలగొట్టి లోపలికి ప్రవేశించేలోపే అతను మృతి చెందాడు.

దీంతో కాలేజీ అధికారులు వెంటనే ఎచ్చెర్ల పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించారు. పోలీసులు స్థలానికి చేరుకుని పరిశీలించి, మృతదేహాన్ని శ్రీకాకుళం సర్వజనిక ఆసుపత్రికి తరలించారు. అక్కడ పోస్ట్‌మార్టం నిమిత్తం అప్పగించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. .

Advertisement

ఈ ఘటనపై కాలేజీ విద్యార్థులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. నవంబర్ 12న సాయంత్రం క్యాంపస్ గేటు వద్ద భైఠాయించి నిరసన చేశారు. సృజన్ ఆత్మహత్యకు సీనియర్ల ర్యాగింగ్ ప్రధాన కారణం అని చెబుతున్నారు. కొంతమంది సీనియర్ విద్యార్థులు అతనిపై దాడి చేసి, మానసికంగా హింసించారని ఆరోపణలు ఉన్నాయి. “ర్యాగింగ్ వల్లే సృజన్ ఆత్మహత్య చేసుకున్నాడు” అని విద్యార్థులు డిమాండ్ చేస్తూ, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని, కాలేజీలో ర్యాగింగ్ నిర్మూలన చర్యలు పెంచాలని కోరారు.

Also Read: దేవుడా.. భారీగా పెరిగిన బంగారం ధరలు.. తులం ఎంతో తెలిస్తే షాక్..

Advertisement

శ్రీకాకుళం డీఎస్పీ వి. వివేకానంద ఈ ఘటనపై మాట్లాడుతూ, “పక్షపాతం లేకుండా కేసును విచారిస్తాము. స్టూడెంట్స్ నుంచి సృజన్‌కు పూర్తి మద్దతు లభిస్తుంది. కొంతమంది విద్యార్థుల దాడి, మానసిక హింస వల్లే ఆత్మహత్య జరిగినట్టు ప్రాథమిక సమాచారం” అని చెప్పారు. అదనంగా, “ఘటనపై లోతైన దర్యాప్తు చేసి, బాధితులకు పూర్తి న్యాయం చేస్తామన్నారు. ర్యాగింగ్ అనేది తీవ్ర అవేర్‌నెస్ కేసు, అందుకే సీనియర్లు, కాలేజీ మేనేజ్‌మెంట్‌పై కఠిన చర్యలు తీసుకుంటాము” అని హామీ ఇచ్చారు.

Related News

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

ఆదిభట్ల గౌరా ఎయిరోస్పేస్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడిన మంటలు, రంగంలోకి ఫైర్ ఫైటర్స్!

Big Stories

Advertisement
×