YSRCP vs Chandrababu: ఆంధ్రప్రదేశ్‌లో ఎస్సీ, ఎస్టీ సంక్షేమంపై రాజకీయ చర్చ మరలా ఉదృతమైంది. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు దళిత సమాజాన్ని అవమానించాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎస్సీలుగా ఎవరు పుట్టాలని కోరుకుంటారు? అన్న వ్యాఖ్యలు తీవ్ర రాజకీయ దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలు దళిత సమాజాన్ని అవమానించేవిగా, హేళనగా ఉన్నాయంటూ వైసీపీ పార్టీ మండిపడింది. సమాజంలోని అత్యంత వెనుకబడిన వర్గాలపై ఇలాంటి అసభ్యమైన వ్యాఖ్యలు చేసే వ్యక్తికి ఎస్సీ, ఎస్టీల గురించి మాట్లాడే నైతిక హక్కే లేదని వైసీపీ ధ్వజమెత్తింది.
వైసీపీ ఆరోపణల ప్రకారం.. ఇళ్లు లేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఇతర బడుగు బలహీనవర్గాలకు వైసీపీ ప్రభుత్వం గృహస్థలాలు ఇవ్వడానికి ప్రయత్నిస్తుంటే, ఆ పథకాలను అడ్డుకోవడానికి కోర్టుల్లో కేసులు వేసింది టీడీపీ. అమరావతి పరిధిలో బడుగు వర్గాలు ఉంటే సామాజిక సమతౌల్యం దెబ్బతింటుంది అని చెప్పినవారు కూడా టీడీపీ నాయకులేనని వైసీపీ గుర్తు చేసింది.
వైసీపీ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అసైన్డ్ భూములపై యాజమాన్య హక్కులు కల్పిస్తూ బడుగు, బలహీనవర్గాలకు మేలు చేసింది వాస్తవం కాదా? మీరు ఏరోజైనా అలాంటి ఆలోచన చేశారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైసీపీ పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళల అభ్యున్నతికి ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చింది. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ ఏటా రూ.18,750 నేరుగా ఇవ్వడం ద్వారా వారికి ఆర్థిక స్థైర్యం కల్పించామని వైసీపీ చెబుతోంది. మరోవైపు, చంద్రబాబు తన పాలనలో ఇలాంటి చర్య ఏదైనా తీసుకుందా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది.
వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం సమయంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచినట్లు వైసీపీ తెలిపింది. దేశంలోని 20 రాష్ట్రాలు చేసిన మొత్తం ఖర్చు కంటే ఎక్కువగా ఒకే రాష్ట్రంలో.. ఆంధ్రప్రదేశ్‌లో ఎస్సీ కాంపొనెంట్ కింద ఖర్చు చేసిన దాఖలాలు వారి వాదన.
దేశవ్యాప్తంగా రూ.12.41 లక్షల స్వయంసహాయక సంఘాలు ఏర్పడగా, అందులో రూ.8.54 లక్షలు ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే, వైసీపీ పాలనలో ఏర్పడ్డాయని గుర్తుచేస్తోంది.
దశాబ్దాల క్రితం భూమి కొనుగోలు కోసం ఎస్సీ కార్పొరేషన్ల నుంచి.. రుణాలు తీసుకున్న ఎస్సీల భూమి తనఖాలో ఉండిపోతే వైసీపీ ప్రభుత్వం అలాంటి రుణాలన్నింటినీ రద్దుచేసి, వారికి ఆ భూములపై పూర్తి యాజమాన్య హక్కులు కల్పించిందని తెలిపారు.
వైసీపీ ప్రభుత్వ హయాంలో 14,223 మంది దళిత మహిళలకు 16,213 ఎకరాలపై పూర్తి యాజమాన్య హక్కులు, మరో 3,57,085 మంది ఎస్సీలకు, 1,20,477 మంది ఎస్టీలకు సైతం అసైన్డ్ భూములపై పూర్తి హక్కులు లభించింది వాస్తవం కాదా? మీ ప్రభుత్వ హయాంలో వారికి ఒక్క సెంటు అయినా ఇచ్చారా బాబూ? అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
పేదలందరికీ ఇళ్లు పథకం కింద ఎస్సీ, ఎస్టీలకు బాసటగా నిలిచింది మా ప్రభుత్వం కాదా? రాష్ట్రవ్యాప్తంగా మా ప్రభుత్వం సుమారు 31 లక్షలకుపైగా ఇళ్లపట్టాలు ఇస్తే అందులో 6,36,732 మంది లబ్ధిదారులు ఎస్సీ అక్కచెల్లెమ్మలే. అంటే లబ్ధిదారుల్లో 20.7 శాతం అన్నమాట.
ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి చంద్రబాబూ. మీరు ఎప్పుడూ కూడా ఎస్సీ, ఎస్టీలను చిన్నచూపే చూశారు. ఇప్పటికీ చూస్తూనే ఉన్నారు అంటూ వైసీపీ ఆరోపించింది.
`ఎస్సీలుగా ఎవరు పుట్టాలని కోరుకుంటారు` అంటూ దళితులను హేళనగా మాట్లాడిన మీకు ఎస్సీ, ఎస్టీల గురించి మాట్లాడే నైతిక హక్కు ఉందా @ncbn? అసలు పేదల్ని వారి పేదరికం నుంచి బయటపడేసేందుకు మీరు ఒక్క అడుగైనా ముందుకు వేశారా?
ఇళ్లు లేని బడుగు, బలహీనవర్గాలకు మా ప్రభుత్వ హ… https://t.co/i1nRSDKlW1 pic.twitter.com/S1NOXJT7yq
— YSR Congress Party (@YSRCParty) December 10, 2025