Bigg Boss 9 Telugu Promo : ప్రస్తుతం ఎవరి నోట విన్న ఒకటే మాట బిగ్ బాస్ విన్నర్ ఎవరు?. తొమ్మిదవ సీజన్ విన్నర్ గా కామనర్స్ నిలుస్తారా? మళ్లీ సెలబ్రిటీలకే ట్రోఫీని బిగ్ బాస్ అందజేస్తాడా? అన్నది జనాల్లో వినిపిస్తున్న ప్రశ్నలు. ఇప్పటికే ఈ సీజన్ విన్నర్ ఎవరు అన్నది సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది.. 13 వారం లాగా 14వ వారం నామినేషన్ అయితే బిగ్ బాస్ నిర్వహించలేదు.. అయితే ఈ వారం ఎలిమినేషన్ ఉంటుందా లేదా అన్న ప్రశ్నలు కూడా జనాలు వినిపిస్తున్నాయి.. కానీ ఈ వారం ఎలిమినేషన్ కోసం బిగ్ బాస్ నంబర్స్ టాస్క్ లను ఇస్తున్నాడు. తక్కువ నంబర్ ఎవరి దగ్గర ఉంటుందో వాళ్లు ఎలిమినేట్ అవుతారని చెప్పాడు. హౌస్ మెట్స్ ఫైనల్ వరకు వెళ్లేందుకు కష్టపడుతున్నారు. తాజాగా ఇవాళ ఎపిసోడ్ ప్రోమోను రిలీజ్ చేశారు బిగ్ బాస్.. ఆ ప్రోమో ఎలా ఉందో ఒకసారి చూసేద్దాం..
టాప్ రియాల్టీ షో బిగ్ బాస్ 94వ ఎపిసోడ్ ప్రోమో ని తాజాగా బిగ్ బాస్ రిలీజ్ చేశారు.. ఈవారం మొదటి రోజు నుంచి ఇప్పటివరకు హౌస్ మేట్స్ నెంబర్స్ కోసం పోటీ పడుతూనే ఉన్నారు. ఇవాళ కూడా కంటెస్టెంట్ల మధ్య నంబర్స్ కోసం బిగ్ బాస్ పోటీ పెట్టాడు.. ప్రోమో విషయానికి వస్తే.. ఈ వారం నామినేషన్ నుంచి తప్పించుకోవడానికి ఇవాళ మూడో యుద్ధంలో గెలవాలి. ఈ మూడవ యుద్ధంలో గెలిచిన కంటెస్టెంట్లు ఫైనల్ కు చేరుకుంటారు.. ఎవరి దగ్గరైతే తక్కువ నెంబర్స్ ఉంటాయో వాళ్ళు హౌస్ నుంచి ఎలిమినేట్ అవ్వాల్సి వస్తుందని బిగ్ బాస్ చెబుతాడు. ఇవాళ జంభో ప్యాంట్స్ తో గేమ్ ఆడిస్తాడు.. సంచాలక్ గా ఉన్న వాళ్లు బాల్ విసురుతారు. ఆ బాలును జంభో ఫ్యాంట్స్ తో పట్టుకోవాలి. ఎవరైతే ఎక్కువ బాల్స్ ను పట్టుకుంటారో వాళ్లు సేఫ్ అని బిగ్ బాస్ చెబుతాడు. ఈ మూడో యుద్ధం కోసం కంటెస్టెంట్స్ బాగానే కష్టపడతారు..
Also Read : తండ్రికి దొరికిపోయిన మహా..సెంటిమెంట్ డైలాగుతో కన్నీళ్లు.. మహాకు పెళ్లి ఫిక్స్..?
ఈ టాస్క్ లో సంజన, డిమాన్ పవన్ సంచాలక్ గా ఉంటారు. అయితే ముందుగా సంజన బాళ్లను విసురుతుంది.. అందరూ కూడా ఆ బాలను పట్టుకునేందుకు కష్టపడతారు.. ప్రతి ఒక్కరు కూడా బాల్ కింద పడకుండా పట్టుకుంటారు. రెండో సంచాలక్ గా డిమాన్ బాల్స్ ను విసురుతాడు.. సుమన్ శెట్టి వరకు వెళ్లిన బాలుని భరణి పట్టేసుకుంటాడు.. మొత్తం బజర్ మోగేంత వరకు బాల్స్ ను పట్టుకునేందుకు హౌస్ మెట్స్ బాగానే కష్టపడతారు. ఆ టాస్క్ పూర్తయిన తర్వాత… డిమాన్ ను మీరు సుమన్ గారికి వెయ్యలేదు అని అడుగుతుంది.. నేను అందరికీ సమానంగానే వేశాను ఇందులో నన్ను అనడానికి ఏమీ లేదు అని అతను అంటాడు.. దానికి సుమన్ శెట్టికి భరణి గారి హైట్ వల్ల నా వరకే అవి రాలేకపోతున్నాయని అంటాడు.. ఇక్కడ హైట్ కాదండి ముఖ్యము పట్టుకోవడమే ముఖ్యమని భరణి అంటాడు.. సంజన మాటలు విన్న తనుజ వాడిది తప్పేముంది వాడు అందరికీ సమానంగానే వేశాడు కదా అని సీరియస్ అవుతుంది. ఆ తర్వాత భరణి సంజన ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. డిమాన్ ఈ మధ్య సంజన ఏం చెబితే అది చేస్తున్నాడు. ఆమె చేతిలో కీలు బొమ్మ అయ్యాడు అని భరణి సీరియస్ అవుతాడు. అక్కడితో ప్రోమో ఎండ్ అవుతుంది. ఇవాళ ఎపిసోడ్ తనూజ, భరణి మధ్య మరోసారి గొడవ జరిగేలా కనిపిస్తుంది. ఏం జరుగుతుందో ఎపిసోడ్ తెలియాలంటే ఎపిసోడ్ మిస్ అవ్వకుండా చూడాల్సిందే..