E-Paper
Advertisement

నాలుగేళ్లు ఆగినా అఖిల్‌కు తప్పని తిప్పలు.. ‘లెనిన్’ వాయిదా టాక్‌తో అక్కినేని ఫ్యాన్స్ ఫైర్!

నాలుగేళ్లు ఆగినా అఖిల్‌కు తప్పని తిప్పలు.. ‘లెనిన్’ వాయిదా టాక్‌తో అక్కినేని ఫ్యాన్స్ ఫైర్!
Advertisement

Akhil Lenin: అక్కినేని  అఖిల్ ఖాతాలో ఒక సాలిడ్, పక్కా కమర్షియల్ బ్లాక్ బస్టర్ పడాలంటూ కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్.గతంలో వచ్చిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమా పూజా హెగ్డే పుణ్యమా అని బాక్సాఫీస్ వద్ద ఒక డీసెంట్ హిట్ గా నిలిచినా, అఖిల్ రేంజ్ ను పెంచే కమర్షియల్ సక్సెస్ మాత్రం కాలేకపోయింది. దాని తర్వాత. ఆ తర్వాత సురేందర్ రెడ్డి దర్శకత్వంలో భారీ అంచనాలు, వంద కోట్ల బడ్జెట్ తో వచ్చిన ‘ఏజెంట్’ మూవీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగలడంతో అఖిల్ కెరీర్ ఒక్కసారిగా స్లో అయిపోయింది.

‘లెనిన్’ తో పవర్ ఫుల్ కంబ్యాక్.. రూట్ మార్చిన అయ్యగారు!

ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ‘లెనిన్’ అనే పవర్ ఫుల్ విలేజ్ బ్యాక్‌డ్రాప్‌ మూవీతో బిగ్గెస్ట్ కంబ్యాక్ ఇవ్వడానికి అఖిల్ రెడీ అయ్యాడు. ఎప్పుడూ లవర్ బాయ్ గా, స్టైలిష్ యాక్షన్ హీరోగా క్లాస్ లుక్ లో కనిపించే అఖిల్, ఈసారి పూర్తిగా రూట్ మార్చాడు. దర్శకుడు అబ్బూరి మురళీకృష్ణ (మురళీ కిషోర్) తెరకెక్కిస్తున్న ఈ ప్రాజెక్ట్ ఒక పక్కా రా అండ్ రస్టిక్ విలేజ్ పొలిటికల్ డ్రామా అని తెలుస్తోంది. ప్రస్తుతం టాలీవుడ్ లో ‘రంగస్థలం’, ‘దసరా’ లాంటి రూరల్ బ్యాక్ డ్రాప్ సినిమాల ట్రెండ్ నడుస్తుండటంతో, సరిగ్గా ఇదే పాయింట్ ను నమ్ముకుని అఖిల్ ఈ ప్రయోగానికి శ్రీకారం చుట్టాడు.

Advertisement

ఫస్ట్ టైమ్ ఒక పక్కా లోకల్ కుర్రాడిగా, ఊర మాస్ గెటప్ లో అఖిల్ కనిపించబోతుండటంతో ఫ్యాన్స్ లో అంచనాలు ఆకాశాన్ని తాకాయి. దానికి తగ్గట్టుగానే ఇప్పటివరకు రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ ఈ విలేజ్ డ్రామా చాలా ప్రామిసింగ్ గా ఉండబోతుందని హింట్ ఇచ్చింది. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తుండటం సినిమాకు మరింత గ్లామర్ అండ్ క్రేజ్ తీసుకొచ్చింది. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ తో కలిసి మనం ఎంటర్ టైన్ మెంట్స్ ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుండగా, అన్నపూర్ణ స్టుడియోస్ సమర్పిస్తోంది. మ్యూజికల్ సెన్సేషన్ థమన్ ఈ చిత్రానికి ఊరమాస్ సాంగ్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు.

Also read :రామ్ చరణ్ ‘పెద్ది’ 500 కోట్ల మార్కును అందుకోవడం కష్టమేనా?

Advertisement

కింగ్ నాగార్జున రీసెంట్ గా ఈ సినిమా ఫస్ట్ కట్ చూసి, తన ఎక్సైట్ మెంట్ ను ఆపుకోలేక సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో ట్వీట్ చేశారు. “ఒక సరికొత్త అఖిల్ ను చూడబోతున్నారు” అంటూ ఆయన వేసిన పోస్ట్ నెట్టింట వైరల్ అయింది. గతంలో ట్రెండ్ సెట్టర్ ‘శివ’ సినిమా టైంలో నాగ్ ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నారో, ఇప్పుడు అఖిల్ సినిమాపై అంత నమ్మకం చూపిస్తుండటంతో కంటెంట్ లో దమ్ము ఉందని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు.

మళ్లీ వాయిదాల పర్వం.. ఫ్యాన్స్‌కు తప్పని షాక్?

కానీ, అక్కినేని హీరోల సినిమాలకు చివరి నిమిషంలో షాక్‌లు తగలడం అలవాటే కదా, ఇప్పుడు ఈ సినిమా విషయంలోనూ అసలు ట్విస్ట్ మొదలైంది. నిజానికి మే నెలలోనే ‘లెనిన్’ వస్తుందని అంతా అనుకున్నారు. కానీ ‘పెద్ది’ సినిమా కోసం తమ సినిమాను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. ఆ తర్వాత ‘పెద్ది’ కూడా జూన్ 4 కి వాయిదా పడటంతో, ‘లెనిన్’ ను జూన్ 26న గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతున్నట్టు స్వయంగా కింగ్ నాగార్జున డేట్ అనౌన్స్ చేశారు. డేట్ మార్క్ చేసుకోమని నాగ్ చెప్పడంతో ఫ్యాన్స్ సంబరాలు మొదలుపెట్టారు.

Also read :విజయ్ ‘టీవీకే’ టార్గెట్‌గా చిన్మయి సంచలన పోస్ట్.. దళపతికి ఊహించని షాక్!

తీరా చూస్తే, ఇప్పుడు అనూహ్యంగా ‘లెనిన్’ రిలీజ్ మళ్లీ వాయిదా పడిందనే నెగెటివ్ టాక్ ఇండస్ట్రీ సర్కిల్స్ లో బలంగా వినిపిస్తోంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు, ముఖ్యంగా విజువల్ ఎఫెక్ట్స్ (VFX) మరియు ప్యాచ్ వర్క్ ఇంకా బ్యాలెన్స్ ఉండటంతో.. క్వాలిటీ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకూడదని మేకర్స్ భావిస్తున్నారట. అందుకే జూన్ 26 నుంచి ఈ సినిమాను జూలై 10 కి షిఫ్ట్ చేశారని సమాచారం.

సోలో రిలీజ్ దొరికేనా?

ఈ వాయిదా వార్త బయటకు రావడంతో అక్కినేని అభిమానులు తీవ్ర అసహనానికి, నిరాశకు గురవుతున్నారు. అంతేకాదు, జూలై మొదటి వారంలో ఇతర క్రేజీ ప్రాజెక్టులు కూడా లైన్ లో ఉండటంతో, ఒకవేళ సినిమా జూలై 10 కి వెళ్తే థియేటర్ల కొరత ఎదురవుతుందా, సోలో రిలీజ్ దొరుకుతుందా లేదా అన్నది కూడా పెద్ద డౌటే. అయితే ట్రేడ్ వర్గాల ప్రకారం.. క్వాలిటీ కోసం కొంచెం లేటైనా పర్లేదు కానీ, అవుట్‌పుట్ సాలిడ్‌గా వస్తే అఖిల్ రేంజ్ మార్కెట్ ఊపందుకోవడం ఖాయం. మరి ఏ న్యూస్ పై మేకర్స్ ఎప్పుడు వదులుతారో చూడాలి.

Related News

ఆగస్టు 9న వైజాగ్‌లో బన్నీ హంగామా.. అభిమానులకు గుడ్ న్యూస్!

మృణాల్ ఠాకూర్ ఫైర్.. ఇక షేర్ చేసినా కేసులే!

నిఖిల్ ‘స్వయంభు’లో శక్తిమాన్.. టాప్ సీక్రెట్ రివీల్ చేసిన హీరో!

ఎన్టీఆర్ లేకుండానే ‘డ్రాగన్’ షూటింగ్.. ప్రశాంత్ నీల్ మాస్టర్ ప్లాన్!

శూర్పణఖ పాత్రపై రకుల్ షాకింగ్ కామెంట్స్!

ఆటా సందీప్ దూకుడు.. జానీ, శేఖర్ మాస్టర్లకి ఇక కష్టమేనా ?

జయం రవి విడాకుల కేస్.. సంచలన నిజాలు బయటపెట్టిన ఆర్తి తల్లి!

త్రిషపై ఉదయనిధి అసభ్యకర వ్యాఖ్యలు.. కుష్బూ సంచలన ట్వీట్!

Big Stories

Advertisement
×