E-Paper
Advertisement

విజయ్ ‘టీవీకే’ టార్గెట్‌గా చిన్మయి సంచలన పోస్ట్.. దళపతికి ఊహించని షాక్!

విజయ్ ‘టీవీకే’ టార్గెట్‌గా చిన్మయి సంచలన పోస్ట్..  దళపతికి ఊహించని షాక్!
Advertisement

Chinmayi Vedanచిన్మయి శ్రీపాద… ప్రముఖ సింగర్ గా , డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఎంత పాపులరో అయ్యారో మీటూ కి వ్యతిరేఖంగా గొంతువిప్పిన ఫైటర్ గా అంతే పేరు  తెచ్చుకున్నారు.అలాంటి ఈ ఫైర్ బ్రాండ్ తాజాగా మరోసారి మీడియాలో హైలెట్ అయ్యారు.అవును ..లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న వివాదాస్పద ర్యాపర్ వేదన్‌కు రాజకీయంగా రెడ్ కార్పెట్ పరుస్తున్నారంటూ మరోసారి సోషల్ మీడియా వేదికగా నిప్పులు చెరిగారు. తమిళనాడు రాజకీయాల్లో కీ రోల్ పోషిస్తున్న అధికార ద్రవిడ మున్నేట్ర కళగం (DMK) తో పాటు దళపతి విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీలు వేదన్‌ను తమ అధికారిక కార్యక్రమాల్లో ప్రోత్సహించడాన్ని ఆమె తీవ్రస్థాయిలో తప్పుబట్టారు.

బాధితులను తీవ్రంగా అవమానించడమే

గతంలో మీటూ (#MeToo) ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిన సమయంలో ర్యాపర్ వేదన్‌పై పలువురు బాధితులు ధైర్యంగా ముందుకు వచ్చి తమకు జరిగిన అన్యాయాన్ని, లైంగిక వేధింపులను సాక్ష్యాలతో సహా బయటపెట్టారు. ఆ సమయంలో తీవ్ర విమర్శలు రావడంతో వేదన్ తన తప్పును ఒప్పుకుంటూ సోషల్ మీడియాలో క్షమాపణలు కూడా చెప్పారు.

Advertisement

also read :ప్రకాష్ రాజ్ సంచలన ట్వీట్.. రెండు రోజుల్లో మీడియా ముందుకు ..అసలు కథ ఏంటంటే?

అయితే కాలక్రమేణా ఆ ఆరోపణలను, బాధితుల ఆవేదనను పక్కనబెట్టి బాధ్యతాయుతమైన రాజకీయ పార్టీలు అతనికి వేదికలు కల్పించడం బాధితులను తీవ్రంగా అవమానించడమేనని చిన్మయి ఆవేదన వ్యక్తం చేశారు. సమాజంలో మార్పు తీసుకురావాల్సిన పార్టీలే ఇలాంటి వ్యక్తులకు అండగా నిలబడితే సమాజానికి ఎలాంటి తప్పుడు సంకేతాలు వెళ్తాయని ఆమె ప్రశ్నించారు.

డీఎంకే, టీవీకే వైఖరిని ఎండగట్టిన చిన్మయి 

Advertisement

సరిగ్గా ఇలా చేయడం వల్లే పరిశ్రమల్లో మహిళలకు రక్షణ కరువవుతోందని ఆమె ఆరోపించారు. గతంలో తమిళ సినీ పరిశ్రమలో ప్రముఖ గీత రచయిత వైరముత్తుపై చిన్మయి లైంగిక వేధింపుల ఆరోపణలు చేసినప్పుడు కూడా ఆమెకు సరైన మద్దతు లభించలేదు సరే కదా, డబ్బింగ్ యూనియన్ నుండి ఆమెను తొలగించి పరోక్షంగా ఇబ్బందులకు గురిచేశారు. అయినా సరే వెనకడుగు వేయకుండా బాధితుల పక్షాన ఒంటరి పోరాటం చేస్తున్న చిన్మయి, ఇప్పుడు వేదన్ వ్యవహారంలో డీఎంకే, టీవీకే వైఖరిని ఎండగట్టడం విశేషం.

ఈసారైనా న్యాయం జరుగుతుందో !

ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులను ఇలా మీడియాలోకి తీసుకువచ్చి వారికి గౌరవ మర్యాదలు కల్పించడం ద్వారా బాధితుల గొంతుకలను నొక్కేస్తున్నారని ఆమె మండిపడ్డారు. ఈ విషయంలో సదరు రాజకీయ పార్టీలు వెంటనే స్పందించి తమ వైఖరి ఏంటో స్పష్టం చేయాలని, బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం చిన్మయి చేసిన ఈ సంచలన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు కూడా ఆమె పోరాటానికి మద్దతుగా నిలుస్తూ, రాజకీయ పార్టీల ద్వంద్వ నీతిని ప్రశ్నిస్తున్నారు.చూడాలి మరి గొంతెత్తిన చిన్మయికి ఈసారైనా న్యాయం జరుగుతుందో !

also read :మ్యూజిక్ డైరెక్టర్‌ను ఇసుకలో పాతిపెట్టిన టాలీవుడ్ స్టార్ డైరెక్టర్.. షాకింగ్ వీడియో వైరల్!

Related News

సాంప్రదాయబద్ధంగా సమంత  సీమంతపు వేడుక వైరల్ అవుతున్న ఫోటోలు!

నటుడిగా మెప్పించి ‘నాగపూర్ పవిత్ర తేక్డి గణపతి’ పుస్తకంతో రచయితగా మారుతున్న హీరో సూర్య తేజ్

పావలా శ్యామల కుమార్తె విషయంలో ‘మా’ కీలక నిర్ణయం!

నా ముందే ఆటిట్యూడ్‌తో తిరుగుతున్నావ్.. శోభితపై చైతూ ఓపెన్ కామెంట్స్.. వీడియో చూశారా?

ఆకట్టుకుంటున్న రాగ్ మయూర్ ‘అనుమాన పక్షి’ ట్రైలర్!

హీరో అజిత్ కు  కారు గిఫ్ట్ గా ఇచ్చిన సీఎం విజయ్.. లవ్లీ బ్రదర్ అంటూ!

తరుణ్ నీలో ఈ టాలెంట్ కూడా ఉందా.. ‘ENE రిపీట్’ కోసం భలే కాకా పడుతున్నావే!

డైరెక్టర్ ఇంట్లో వినాయక చవితి చేసుకున్న నటి.. ఆ రిలేషన్ ఎదో కన్ఫర్మ్ చేసేయండయ్యా?

Big Stories

Advertisement
×