Peddi Collections: పెద్ది…సినిమా 500 కోట్లు కొల్లగొడుతుందా లేదా …?ఇప్పుడిదే మెగా ఫ్యాన్స్ ని వేదిస్తున్న ప్రశ్న.జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ ఓపెనింగ్స్‌ను సాధించింది. సినిమా విడుదలైన మొదటి వారం రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 345 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్లు మేకర్స్ అధికారికంగా ఒక పవర్‌ఫుల్ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు.అయితే, ఇదే ఫ్లో రెండో వారంలో కూడా కొనసాగుతుందా లేదా అనే ప్రశ్న ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. చిత్ర యూనిట్ చెబుతున్న దాని ప్రకారం కొన్ని ఏరియాల్లో సినిమా బ్రేక్ ఈవెన్‌కు చేరువలో ఉందని అంటున్నా, మెజారిటీ ప్రాంతాల్లో బయ్యర్లు ఇంకా భారీ నష్టాల్లోనే ఉన్నట్లు ఇన్సైడ్ టాక్.
నిజానికి బాక్సాఫీస్ వద్ద పెద్ది సినిమాకు అసలైన సవాల్ ఇప్పుడే మొదలైంది. రెండో వారంలో థియేటర్లకు ప్రేక్షకులను రప్పించేందుకు మేకర్స్ ఒకరకంగా సర్కస్ చేస్తున్నారు. సినిమాపై వస్తున్న తీవ్రమైన నెగెటివిటీని తగ్గించడానికి మరియు కలెక్షన్ల డ్రాప్‌ను అడ్డుకోవడానికి ఏకంగా సినిమా ఎడిటింగ్ వెర్షన్‌ను మార్చడం ఇండస్ట్రీలో డిబేటబుల్ అయ్యింది. హీరోయిన్ జాన్వీ కపూర్ క్యారెక్టరైజేషన్, ఆమెపై షూట్కొ చేసిన కొన్ని సీన్స్ కాంట్రవర్సీకి దారి తీయడంతో, ఆ సీన్లను తొలగిస్తున్నట్లు అఫీషియల్ గా ప్రకటించారు.
also read :పూరి మార్క్ యాక్షన్ థ్రిల్లర్.. ఉత్కంఠ రేపుతోన్న ‘స్లమ్‌డాగ్’ టీజర్ మేకింగ్ విజువల్స్
అంతేకాకుండా, ఇప్పటికే చూసిన ప్రేక్షకులను మళ్లీ థియేటర్లకు రప్పించే ప్రయత్నంలో భాగంగా కొన్ని కొత్త షాట్స్ యాడ్ చేసి, కొత్త పెద్ది పేరుతో ప్రదర్శిస్తున్నారు. ఒక సినిమాకు విడుదలైన కొద్దిరోజులకే ఇలాంటి మార్పులు చేర్పులు చేయాల్సి రావడం సినిమా స్క్రిప్ట్ లోని లోపాలను ఎత్తిచూపుతుంది అనడంలో సందేహం లేదు.
మరోవైపు, ఈ చిత్రం 500 కోట్ల క్లబ్‌లో చేరుతుందని అభిమానులు ఆశలు పెట్టుకున్నప్పటికీ, ప్రెసెంట్ బాక్సాఫీస్ ట్రెండ్స్ చూస్తుంటే అది అత్యాశే అవుతుందనే డౌట్స్ రైజ్ అవుతున్నాయి. మొదటి వారంలో వచ్చిన వసూళ్లు వీకెండ్ బజ్ వల్ల మాత్రమే వచ్చాయని, క్రమ క్రమంగా కలెక్షన్లలో భారీ డ్రాప్ కనిపిస్తుందని అంచనా వేస్తున్నారు ట్రేడ్ పండిట్స్.ఇక మైత్రి మూవీ మేకర్స్ వంటి పెద్ద నిర్మాణ సంస్థ వెనకుండి ఎంత పబ్లిసిటీ చేస్తున్నా, కంటెంట్ లోని లోపాల వల్ల రిపీట్ ఆడియన్స్ కరువయినట్టే కనిపిస్తుంది.
సెకండాఫ్ లో వచ్చే క్రికెట్ మ్యాచ్‌లు, ఎమోషనల్ సీన్స్ కొంతవరకు వర్కవుట్ అయినా, ఫస్లోట్ హాఫ్ లో వచ్చే లవ్ ట్రాక్ సినిమా సోల్ ని దెబ్బతీసిందనే విమర్శలు గట్టిగానే వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో కొంతమంది సెలబ్రిటీలు సినిమాను పొగిడేస్తూ రివ్యూలు ఇచ్చినప్పటికీ, సాధారణ ప్రేక్షకుడు మాత్రం థియేటర్లకు వెళ్లడానికి అంతగా ఆసక్తి చూపించడం లేదనే చెప్పాలి
పోటీ విషయానికి వస్తే, తెలుగు బాక్సాఫీస్ వద్ద రెండో వారంలో కూడా పెద్ద సినిమాలేవీ లేకపోవడం పెద్దికి కలిసివచ్చే అంశమే అయినప్పటికీ, కొత్తగా విడుదలైన చిన్న సినిమా సింగ్ గీతం వల్ల థియేటర్ల సంఖ్య కొంత తగ్గే అవకాశం ఉంది. సింగ్ గీతం మాస్ ఆడియన్స్‌ను ఏ మేరకు ఆకట్టుకుంటుందో పక్కన పెడితే, పెద్ది సినిమాకు ఉన్న నెగెటివ్ టాక్ వల్ల ప్రేక్షకులు వేరే సినిమాల వైపు చూసే ప్రమాదం ఉంది. బయ్యర్లు సేఫ్ జోన్‌లోకి రావాలంటే మాత్రం ఈ రెండో వారం కలెక్షన్స్ చాలా ముఖ్యం.
also read :కోలీవుడ్‌లో మరో మైండ్ బ్లోయింగ్ కాంబో.. ఆ స్టార్ డైరెక్టర్‌కు ధనుష్ గ్రీన్ సిగ్నల్!
కానీ ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే మెజారిటీ ఏరియాల్లో సినిమా బ్రేక్ ఈవెన్ సాధించడం కాస్త కష్టమనే టాక్ వినిపిస్తుంది.దీనికి తోడు. విదేశాల్లో మరియు ఓవర్సీస్ మార్కెట్ లో కూడా అనుకున్న స్థాయిలో హోల్డ్ కనిపించడం లేదు. ఎంత లాగినా ఈ సినిమా లాంగ్ రన్‌లో 500 కోట్ల మార్కును అందుకోవడం కష్టమనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరి మేకర్స్ చేస్తున్న కొత్త ప్రమోషన్స్ మరియు ఎడిటింగ్ కట్స్ సినిమాను ఈ 500 కోట్ల క్లబ్ లో కూర్చోబెడతాయో లేదో చూడాలి.!