E-Paper
Advertisement

AKhil – Jr NTR : ఎన్టీఆర్ ఇంట్లో అఖిల్ సీక్రెట్ మీటింగ్… ఇద్దరు కలిసి పెద్ద ప్లానే చేస్తున్నారే

AKhil – Jr NTR : ఎన్టీఆర్ ఇంట్లో అఖిల్ సీక్రెట్ మీటింగ్… ఇద్దరు కలిసి పెద్ద ప్లానే చేస్తున్నారే
Advertisement

NTR -Prashanth Neel: యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR)ప్రస్తుతం డైరెక్టర్ ప్రశాంత్ నీల్(Prashanth Neel) దర్శకత్వంలో డ్రాగన్ (Dragon)సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. ఇటీవల ఎన్టీఆర్ వరుస పాన్ ఇండియా సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో భారీ బడ్జెట్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా హై వోల్టేజ్ యాక్షన్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తోంది.

ఎన్టీఆర్ ఇంటికి అఖిల్, ప్రశాంత్ నీల్..

ఈ సినిమాలో ఎన్టీర్ కు జోడిగా రుక్మిణి వసంత్ హీరోయిన్ గా సందడి చేయబోతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. నిన్న డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో కలిసి అక్కినేని యువ హీరో అఖిల్ ఎన్టీఆర్ ఇంటికి వెళ్లి కలిసారని తెలుస్తోంది. అయితే ఇలా ఉన్నఫలంగా అఖిల్ (Akhil)ప్రశాంత్ నీల్ తో కలిసి ఎన్టీఆర్ ఇంటికి వెళ్లడంతో ఈ భేటీ పై పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి బహుశా ఎన్టీఆర్ డ్రాగన్ సినిమాలో అఖిల్ నటించబోతున్నారా అంటూ సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. ఇలా ఈ ముగ్గురు కలవడంతో ఈ భేటీ వెనుక ఏదైనా సర్ప్రైజ్ న్యూస్ రాబోతోందా? లేకుంటే నార్మల్గానే కలిసారా? అని పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి.

ఎన్టీఆర్ సినిమాలో అఖిల్?

Advertisement

ఇక ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అక్కినేని అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఎన్టీఆర్ సినిమాలో అఖిల్ బాగమవ్వడం నిజంగా చాలా మంచి విషయమేనని తన కెరీర్ కు మరింత ప్లస్ పాయింట్ అవుతుంది అంటూ అభిమానులు కూడా భావిస్తున్నారు. మరి ఈ భేటీ వెనుక ఉన్న కారణమేంటో తెలియాలి అంటే మరి కొన్ని రోజులు వేచి ఉండాల్సిందే. ఇక అఖిల్ ప్రస్తుతం లెనిన్(Lenin) సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

లెనిన్ సినిమా పైనే ఆశలు..

Advertisement

ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతోంది నిజానికి ఈ సినిమాలో మొదట హీరోయిన్ గా శ్రీ లీలను ఎంపిక చేశారు. ఈమెపై కొంత భాగం షూటింగ్ చేసిన తర్వాత కొన్ని కారణాల వల్ల ఈ సినిమా నుంచి తప్పుకోవడంతో భాగ్యశ్రీ ఈ సినిమాలో భాగమయ్యారు శ్రీ లీలపై షూట్ చేస్తున్న సన్నివేశాలను తిరిగి భాగ్యశ్రీపై షూట్ చేస్తున్నారు. డిసెంబర్ చివరి కలర్ షూటింగ్ పనులను పూర్తి చేసుకొని ఫిబ్రవరి 14,2026వ తేదీ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్టు తెలుస్తుంది. ఇక ఈ సినిమా రాయలసీమ బ్యాక్ డ్రాప్ లవ్ స్టోరీగా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తోంది. ఇక అఖిల్ అభిమానులు కూడా లెనిన్ సినిమాపైనే ఆశలు పెట్టుకున్నారు.

Also Read: Suresh Babu -Akhanda 2: అఖండ 2 ఫైనాన్స్ ఇష్యూ.. స్పందించిన సురేష్ బాబు.. అనవసరమంటూ !

Related News

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

Big Stories

Advertisement
×