Ind vs Sa Odi Series: భారత్ – సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న మూడు వన్డేల సిరీస్ ఉత్కంఠ భరితమైన దశకు చేరుకుంది. ఈ సిరీస్ లో ఇప్పటికే రెండు వన్డేలు పూర్తయ్యాయి. ఇరుజట్లు ఒక్కో మ్యాచ్ లో విజయం సాధించడంతో.. డిసెంబర్ 6న విశాఖపట్నంలోని డాక్టర్ వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి {ఏసీఏ-వీడీసీఏ} క్రికెట్ మైదానంలో జరగనున్న చివరి మ్యాచ్ నిర్ణయాత్మకం కానుంది.
Also Read: Travis Head: ఐపీఎల్ ఇక చాలు..PSLలో ఆడతా, కాటేరమ్మ కొడుకు హెడ్ ప్రకటన !
ఈ మ్యాచ్ లో విజయం సాధించడమే లక్ష్యంగా భారత్ – దక్షిణాఫ్రికా జట్లు గురువారం విశాఖ చేరుకున్నాయి. రాయిపూర్ వేదికగా జరిగిన రెండవ వన్డే అనంతరం.. ప్రత్యేక విమానంలో క్రికెటర్లు విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ క్రమంలో ఇరుజట్ల ఆటగాళ్లకు అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఇక ఎయిర్ పోర్ట్ నుండి క్రికెటర్లు కట్టుదిట్టమైన భద్రత మధ్య ప్రత్యేక బస్సులో రాడిసన్ బ్లూ హోటల్ కి వెళ్లారు.
విశాఖపట్నం బయలుదేరే క్రమంలో రాయిపూర్ ఎయిర్ పోర్ట్ లో టీమిండియా ప్లేయర్లకు ఘోర అవమానం జరిగింది. దేశంలో ప్రముఖంగా అభివృద్ధి చెందుతున్న ఆధునిక సదుపాయాలు కలిగిన ఎయిర్ పోర్టులలో రాయిపూర్ ఒకటి. అయితే రాయిపూర్ విమానాశ్రయంలో పని చేయకుండా ఉన్న ఎస్కలేటర్ భారత క్రికెట్ జట్టుకు పెద్ద ఇబ్బందిగా మారింది. భారత ఆటగాళ్లు అక్కడికి చేరుకున్న సందర్భంగా ఎస్కలేటర్ పనిచేయకపోవడంతో.. ఆటగాళ్లు తమ భారీ లగేజ్ లను చేతులతో మోస్తూ మెట్ల పై నడవాల్సి వచ్చింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో విమానాశ్రయ నిర్వహణపై పెద్ద ఎత్తున విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి.
ఇంత పెద్ద సదుపాయాలు ఉన్నప్పటికీ.. ఓకే ఎస్కలేటర్ ని కూడా సమయానికి మరమ్మత్తులు చేయకపోవడం ప్రశ్నర్ధకంగా మారింది. టీమిండియా ఆటగాళ్ల రాక గురించి ముందుగానే సమాచారం ఉన్నప్పటికీ.. ఎస్కలేటర్ ని రిపేర్ చేయించే ప్రయత్నం కూడా చేయకపోవడం విమర్శలకు దారితీసింది. అంతర్జాతీయ క్రీడాకారులు వస్తున్న సందర్భంలో కనీస సదుపాయాలకైనా ప్రాధాన్యం ఇవ్వకపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు క్రీడాభిమానులు. అయితే ఈ ఘటనపై విమానాశ్రయ అధికారులు ఇప్పటికీ స్పష్టమైన వివరణ ఇవ్వలేదు. ఇలాంటి సమస్యల కారణంగానే విరాట్ కోహ్లీ లాంటి ఆటగాళ్లు లండన్ కి వెళ్ళిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు క్రీడాభిమానులు.
విశాఖపట్నంలోని వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి { ఏసీఏ-వీడిసిఏ} మైదానం భారత జట్టుకు ఎప్పుడూ కలిసి వచ్చే వేదికగా నిలిచింది. ఇక్కడ టీమిండియా రికార్డులు చాలా బలంగా ఉన్నాయి. ఈ మైదానంలో టీమ్ ఇండియా ఇప్పటివరకు 10 వన్డే మ్యాచ్ లు ఆడింది. ఇందులో ఏడు మ్యాచ్లలో ఘనవిజయం సాధించింది. మరో రెండు మ్యాచ్లలో ఓడిపోగా.. ఒక మ్యాచ్ టై గా ముగిసింది. దీంతో ఈ మైదానంలో టీమిండియా విజయాల శాతం 70% కంటే ఎక్కువగా ఉంది.
Also Read: Sunil Gavaskar: హర్షిత్ రాణా, ప్రసిద్ లను ఆడిస్తే, 500ల టార్గెట్ పెట్టినా ఓడిపోతాం
ఈ మైదానంలో భారత్ చివరిగా 2019లో వన్డే విజయాన్ని రుచి చూసింది. ఆ తర్వాత 2023లో జరిగిన మ్యాచ్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. ఇక ఇప్పుడు ఆరు సంవత్సరాల తర్వాత మళ్లీ ఇక్కడ గెలిచి సిరీస్ ని కైవసం చేసుకోవాలని పట్టుదలగా ఉంది. ఇక సౌత్ ఆఫ్రికా ఈ మైదానంలో ఇప్పటివరకు ఒక్క వన్డే మ్యాచ్ కూడా ఆడలేదు. ఈ మైదానంలో సౌత్ ఆఫ్రికా ఒక టెస్ట్, ఒక టి-20 మ్యాచ్ ఆడింది. కానీ ఈ రెండింటిలోనూ ఓడిపోయింది.
That's why Virat Kohli moved to London 🏴 https://t.co/JEUSXUZSgS
— Richard Kettleborough (@RichKettle07) December 5, 2025