E-Paper
Advertisement

అఖిల్ అక్కినేని ‘లెనిన్’ టీజర్ వచ్చేసింది.. ఈ సారి ‘లెనిన్’ అయినా కాపాడుతుందా అఖిల్‌ని!..

అఖిల్ అక్కినేని ‘లెనిన్’ టీజర్ వచ్చేసింది.. ఈ సారి ‘లెనిన్’ అయినా కాపాడుతుందా అఖిల్‌ని!..
Advertisement

Lenin Teaser out: అక్కినేని యువ హీరో అఖిల్ సరికొత్త మాస్ అవతారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. మురళి కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కు “లెనిన్ – మనోడు వస్తున్నాడు” చిత్ర యూనిట్ అధికారిక టీజర్‌ను కింగ్ నాగార్జున విడుదల చేశారు. అన్నపూర్ణ స్టూడియోస్ వేదికగా విడుదలైన ఈ సరికొత్త టీజర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. ఇప్పటికే కింగ్ నాగార్జున సినిమా ప్రస్థానం ప్రారంభించి నలభై ఏళ్లు అయిన సందర్భంగా కింగ్ ఈ టీజర్ ను విడుదల చేశారు.

Read also-చిత్రపురి హౌసింగ్ సొసైటీలో భారీ కుంభకోణం.. నిబంధనలకు విరుద్ధంగా రో-హౌస్ రిజిస్ట్రేషన్..

ఊరమాస్ లుక్‌లో అఖిల్..

Advertisement

టీజర్ ప్రారంభం నుండి ముగింపు వరకు హై-వోల్టేజ్ యాక్షన్ ఎలిమెంట్స్‌తో కట్ చేశారు. ఈ సినిమాలో అఖిల్ గత చిత్రాలకు భిన్నంగా రగ్గడ్ అండ్ రా లుక్‌లో కనిపిస్తున్నారు. ఊరి జాతర నేపథ్యం, పల్లెటూరి వాతావరణం, అలాగే పవర్‌ఫుల్ విజువల్స్ ఈ టీజర్‌లో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ‘భారతం మిఠా ఆర్గనైజర్’గా హీరో పాత్రను పరిచయం చేసిన తీరు సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది.

భాగ్యశ్రీ బోర్సేతో లవ్ ట్రాక్..

ఈ చిత్రంలో క్రేజీ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తోంది. టీజర్‌లో ఆమె లుక్స్, స్క్రీన్ ప్రెజెన్స్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయి. అఖిల్ – భాగ్యశ్రీ జంట వెండితెరపై సరికొత్త మ్యాజిక్ సృష్టించబోతున్నట్లు స్పష్టమవుతోంది. ఇక ఈ చిత్రానికి టాలీవుడ్ స్టార్ కంపోజర్ థమన్ ఎస్ సంగీతాన్ని అందిస్తున్నారు. టీజర్‌లో ఆయన అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ (BGM) ఊరమాస్ రేంజ్‌లో ఉండి, ప్రతి ఫ్రేమ్‌ను ఎలివేట్ చేసింది.

Advertisement

Read also-Illu Illaalu pillalu prema : భర్తతో నాలుగేళ్ల ప్రయాణం.. ప్రేమ బేబీ బంప్స్ పిక్స్ వైరల్..

ప్రముఖ నిర్మాణ సంస్థలు అన్నపూర్ణ స్టూడియోస్ మరియు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా ఈ ప్రాజెక్ట్‌ను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాయి. అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ నిర్మాణంలో రూపొందుతున్న ఈ సినిమా విజువల్స్, ప్రొడక్షన్ వాల్యూస్ అత్యున్నత స్థాయిలో ఉన్నాయి. టెక్నికల్ పరంగా సినిమా చాలా రిచ్‌గా ఉండబోతోందని టీజర్ చూస్తేనే అర్థమవుతోంది.

Related News

హాస్పిటల్ పాలైన మమితా బైజు.. వీడియో వైరల్!

హరికృష్ణ 70వ జయంతి..ఎన్టీఆర్ ఎమోషనల్ పోస్ట్!

ఐదుసార్లు చావును దగ్గరగా చూశాను.. అదే నాకు ఇంపార్టెంట్.. హీరో కామెంట్స్..

“ప్రజలు మెచ్చిన నాయకుడు”.. పవన్ కళ్యాణ్ కు చిరంజీవి స్పెషల్ బర్త్‌డే విషెస్!

Poojitha Ponnada : గార్జీయస్ లుక్ లో మెరిసిపోతున్న పూజిత.. కుర్రాళ్ళు ఏమైపోతారమ్మా..!

HBD Pawan Kalyan : బర్త్ డే స్పెషల్.. ఆ ఒక్కటే పవర్ స్టార్ ను చేసిందా..?

కృష్ణుడిగా రామ్ చరణ్.. సూపర్ హిట్ సినిమా రీమేక్ చేయనున్నారా?

టాక్సిక్ సినిమాకు రేటింగ్ మహేష్ బాబు కొడుకు గౌతమ్ రేటింగ్.. ఇంత రారుణమా?

Big Stories

Advertisement
×