E-Paper
Advertisement

Hyderabad News: పులి గోర్లు, దంతాల అక్రమ వ్యాపారం.. ఏడు పులి గోర్లు, మూడు దంతాలు స్వాధీనం!

Hyderabad News: పులి గోర్లు, దంతాల అక్రమ వ్యాపారం..  ఏడు పులి గోర్లు, మూడు దంతాలు స్వాధీనం!
Advertisement

Hyderabad News:  పులి గోర్లు దంతాలను అమ్మటానికి యత్నించిన ఇద్దరిని డైరెక్టరేట్ ఆఫ్​ రెవెన్యూ ఇంటెలిజెన్స్​ (డీఆర్​ఐ) అధికారులు వలపన్ని అరెస్ట్​ చేశారు. నిందితుల నుంచి ఏడు పులి గోర్లు, మూడు కేనైన్​ దంతాలను స్వాధీనం చేసుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. నాంపల్లిలోని హోటల్ ఏషియన్​ ఇంటర్నేషనల్ లో ఉంటూ ఇద్దరు వ్యక్తులు పులి గోర్లు, దంతాలను అమ్మటానికి ప్రయత్నిస్తున్నట్టుగా డీఆర్ఐ అధికారులకు సమాచారం అందింది. ఈ నేపథ్యంలో అధికారులు ఇద్దరు కొనుగోలుదారుల్లా ఆ హోటల్ కు వెళ్లారు. నిందితులతో బేరసారాలు సాగించి పులి గోర్లు, దంతాలను చూపించమన్నారు. ఓ ప్లాస్టిక్​ కవర్​ లో ఉన్న వాటిని నిందితులు బయటకు తీయగానే బయట ఉన్న సహచరులకు సమాచారం ఇచ్చారు.

Also Read: GHMC: జీహెచ్ఎంసీలో స్పెషలాఫీసర్ పాలన షురూ.. 13 తర్వాతే మూడు కార్పొరేషన్లపై క్లారిటీ!

పులి గోర్లు, దంతాలను స్వాధీనం

Advertisement

ఆ వెంటనే మిగితా అధికారులు దాడి చేసి నిందితులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి పులి గోర్లు, దంతాలను స్వాధీనం చేసుకున్నారు. అదుపులోకి తీసుకున్న ఇద్దరు నిందితులను తదుపరి దర్యాప్తు నిమిత్తం హైదరాబాద్ సెంట్రల్ ఫారెస్ట్​ రేంజ్ అధికారికి అప్పగించారు. విచారణలో ఇద్దరు నిందితులు కేరళ రాష్ట్రానికి చెందిన వారని వెల్లడైంది. తమ సన్నిహిత మిత్రుడైన జకరియా అనే వ్యక్తి నుంచి పులి గోర్లు, దంతాలు తీసుకుని అమ్మటానికి హైదరాబాద్ వచ్చినట్టుగా స్పష్టమైంది. నిందితులు ఇద్దరిపై వన్యప్రాణి సంరక్షణా చట్టం ప్రకారం కేసులు నమోదు చేశారు. మంగళవారం ఇద్దరిని కోర్టులో హాజరు పరిచారు. న్యాయస్థానం రిమాండ్ విధించటంతో చెంచల్​ గూడ జైలుకు తరలించారు.

షెడ్యూల్ 1 జంతువు

జాతీయ జంతువైనపులి సెడ్యూల్​ 1 కేటగిరీలోకి వస్తుందని అటవీశాఖ అధికారులు తెలిపారు. దీని ప్రకారం పులి అత్యంత రక్షిత జాతి అని పేర్కొన్నారు. పులి శరీర భాగాలను కలిగి ఉండటం, వాటి వ్యాపారం చేయటం చట్టరీత్యా నేరమని తెలిపారు. ఈ కేసుల్లో శిక్షలు కఠినంగా ఉంటాయన్నారు.

Advertisement

Also Read: GHMC: జీహెచ్ఎంసీలో స్పెషలాఫీసర్ పాలన షురూ.. 13 తర్వాతే మూడు కార్పొరేషన్లపై క్లారిటీ!

Related News

హైదరాబాద్ MVSR కాలేజీ దాండియా వేడుకల్లో ఘోర ప్రమాదం.. ఇద్దరు మృతి!

క్యూనెట్ రూ.10,000 కోట్ల కుంభకోణం.. మరో కీలక నిందుతుడు అరెస్ట్?

వాహన ఫిట్‌నెస్ టెస్ట్ విధానంలో.. తెలంగాణ సర్కార్ కీలక మార్పులు..?

మూసీ తరహాలోనే హుస్సేన్ సాగర్ ప్రక్షాళన.. సర్కార్ సంచలన నిర్ణయం!

తెలంగాణ ప్రభుత్వ ఆఫీసుల్లో.. ఏసీల వాడకం పై కొత్త రూల్స్ ఇవే..?

విద్యాసంస్థల్లో దాడులా.. కాంగ్రెస్ అనుబంధ సంఘాలకు పీసీసీ మాస్ వార్నింగ్!

గత ఏడాది కంటే భారీగా పెరిగిన విద్యుత్ వాడకం.. ఓక్కరోజులోనే ఇంత వాడేసారా..?

తెలంగాణ నిరుద్యోగులకు భారీ గుడ్ న్యూస్.. రానున్న 2, 3 రోజుల్లో నోటిఫికేషన్!

Big Stories

Advertisement
×