E-Paper
Advertisement

ఒంటరిగా ఉన్నప్పుడు అలాంటి పనులు చేస్తా – అక్కినేని సుమంత్

ఒంటరిగా ఉన్నప్పుడు అలాంటి పనులు చేస్తా – అక్కినేని సుమంత్
Advertisement

Akkineni sumanth:టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అక్కినేని హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నారు సుమంత్ (Sumanth ). విలక్షణమైన పాత్రలు ఎంచుకుంటూ తనదైన నటనతో ఆడియన్స్ను మెప్పిస్తున్నారు. అలాంటి ఈయన తాజాగా నటించిన చిత్రం మహేంద్రగిరి వారాహి. సంతోష్ జాగర్లమూడి దర్శకత్వంలో భక్తి, పురాతన నమ్మకాలు, సైన్స్ అండ్ మిస్టరీ చుట్టూ తిరిగే ఆధ్యాత్మిక సస్పెన్స్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మహేంద్రగిరి కొండల బ్యాక్ డ్రాప్ లో వరాహి మాత దివ్య శక్తి చుట్టూ అల్లిన కథతో ఈ సినిమాను రూపొందించారు. ఐశ్వర్య రాజేష్, మాళవిక నాయర్ ,వెన్నెల కిషోర్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తూ మీనాక్షి గోస్వామి హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 11వ తేదీన విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొన్న అక్కినేని సుమంత్ ఎన్నో విషయాలను పంచుకున్నారు.. అందులో ముఖ్యంగా తన తాత అక్కినేని నాగేశ్వరరావు (Akkineni Nageswara Rao) తో ఉన్న అనుబంధము గురించి , ఒంటరిగా ఉన్నప్పుడు తాను ఏం చేస్తాను? ఇలా పలు అంశాలపై స్పందించారు.

తాతయ్య అక్కినేని నాగేశ్వరరావుతో ప్రత్యేక అనుబంధం..

దివంగత నటుడు, తాతయ్య అక్కినేని నాగేశ్వరరావుతో ప్రత్యేకమైన అనుబంధం ఉంది. “మా తల్లిదండ్రులు చిన్నతనంలోనే అమెరికా వెళ్లాల్సి రావడంతో నన్ను మా తాతయ్య దత్తత తీసుకున్నారు. సొంత కొడుకులాగే పెంచారు. నాకు జీవితంలో మంచి చెడులను నేర్పిస్తూనే.. చదువు , వృత్తిపరమైన రంగాలలో సొంత నిర్ణయాలు ఎలా తీసుకోవాలి అనే విషయంపై అవగాహన కల్పించారు. ముఖ్యంగా మా తాతయ్య నాకు పూర్తి స్వేచ్ఛనిచ్చారు. నా ఆలోచనలపై, జీవితంపై ఆయన ప్రభావం ఎంతో ఉంది. ఆయన స్ఫూర్తితోనే నేను నటన రంగంలోకి అడుగు పెట్టాను. నా మేనమామ నాగార్జున గురించి నేను ప్రత్యేకంగా చెప్పుకోవాలి. కెరియర్ మొదటి నుండి డైలాగ్ డెలివరీ, నటనలోని లోటుపాట్లను సరిదిద్దుతూ నన్ను ఎంతగానో ప్రోత్సహించారు” అంటూ తన తాతయ్య తన మేనమామ గురించి సుమంత్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

ఒంటరిగా ఉన్నప్పుడు అలాంటి పనులే చేస్తాను..

Advertisement

ఇదే ఇంటర్వ్యూలో సుమంత్ మాట్లాడుతూ.. “నేను నా వ్యక్తిగత జీవితంలో చాలా రిజర్వ్డ్ గా ఉంటాను. నేను ఇంట్రోవర్ట్ ను. ముఖ్యంగా సోషల్ మీడియాలో నా వ్యక్తిగత విషయాలను పంచుకోవడం నాకు ఇష్టం ఉండదు. సినిమాలు లేని సమయంలో.. ఇంట్లో గా ఖాళీగా ఉన్నప్పుడు మొక్కల పెంపకం, పెట్స్ తో గడపడం, పాడు కాస్ట్ ఇంటర్వ్యూలు వినడం లాంటివి చేస్తూ ఉంటాను. ముఖ్యంగా నాకు సినిమాలు ఎర్లీ మార్నింగ్ చూడడం అంటే చాలా ఇష్టం. అందుకే ముఖానికి మాస్కు ధరించి ఒక సాధారణ ప్రేక్షకుడిలా నేను థియేటర్కు వెళ్లి మార్నింగ్ షోలు చూస్తూ ఉంటాను” అంటూ సుమంత్ తెలిపారు.

also read:హ్యాపీ బర్తడే మోక్షజ్ఞ.. కొత్త మూవీ అనౌన్స్మెంట్ కి ఈ రోజైనా మోక్షం లభిస్తుందా?

డైరెక్టర్లకు హింట్ సుమంత్..

Advertisement

మాస్, క్లాస్ అని తేడా లేకుండా ఎన్నో చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న సుమంత్.. డైరెక్టర్లకు తన అభిప్రాయాన్ని చెప్పేశాడు. నటుడిగా తనకు ఎలాంటి హద్దులు లేవని, సీతారామం తర్వాత విభిన్నమైన పాత్రలు వస్తాయని ఆశించినప్పటికీ, ఇప్పటికీ ఎక్కువగా హీరో పాత్రలకే అవకాశాలు వస్తున్నాయని తెలిపారు. కథ డిమాండ్ చేస్తే పూర్తిస్థాయి విలన్ పాత్రలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాను అంటూ చెప్పుకొచ్చారు సుమంత్. మరి సుమంత్ కోరిక మేరకు డైరెక్టర్లు ఒక పవర్ఫుల్ విలన్ పాత్రను ఆయన కోసం డిజైన్ చేస్తారేమో చూడాలి.

Related News

అల్లు అర్జున్ బ్లాక్ బస్టర్ సినిమా మిస్ చేసుకున్న అక్కినేని హీరో… ఇప్పటీకి బాధగా ఉందంటూ!

సూరి, సుహాస్ ‘మండాడి’ ట్రైలర్ రిలీజ్!

కళ్ళుచెదిరే రేంజ్ లో ” వారణాసి” తెలుగు థియేట్రికల్ బిజినెస్.. టాలీవుడ్ లోనే హైయెస్ట్!

సినిమా ఖర్చుల్లో బిగ్ స్కామ్?.. బోగస్ బిల్లులతో కోట్ల గోల్‌మాల్!

హ్యాపీ బర్తడే మోక్షజ్ఞ.. కొత్త మూవీ అనౌన్స్మెంట్ కి ఈ రోజైనా మోక్షం లభిస్తుందా?

తమిళ్ ఇండస్ట్రీలో మళ్లీ ‘మీటూ’ మంటలు.. బాంబు పేల్చిన సింగర్!

డిజాస్టర్ హీరోయిన్ తో మోక్షజ్ఞ డెబ్యూ మూవీ… సాహసం చేస్తున్న నందమూరి హీరో?

Big Stories

Advertisement
×