Varanasi Movie: టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ మూవీ వారణాసి కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. కేవలం తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాకుండా పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా కోసం అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. రాజమౌళి దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఒకానొక సమయంలో తెలుగు చిత్ర పరిశ్రమకు మాత్రమే రాజమౌళి సినిమాలు పరిమితమయ్యాయి కానీ ఇప్పుడు రాజమౌళి సినిమా అంటే హాలీవుడ్ సైతం ఆసక్తిగా ఎదురు చూస్తుంది.
మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్లో మొట్టమొదటి సినిమా కావడంతో మహేష్ అభిమానులు మాత్రం ఈ సినిమా కోసం ఎదురుచూస్తూ ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ పనులు దాదాపు పూర్తి కావచ్చాయని తెలుస్తుంది. ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించి టైటిల్ గ్లింప్స్ మినహా ఎలాంటి అప్డేట్స్ లేకపోవడంతో మహేష్ అభిమానులు ఈ సినిమా అప్డేట్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాని 2027 ఏప్రిల్ 7 వ తేదీ ప్రేక్షకులు ముందుకు తీసుకురాబోతున్న సంగతి తెలిసిందే.
ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాకు సంబంధించిన బిజినెస్ లెక్కలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.. వారణాసి సినిమా సుమారు 1300 కోట్ల బడ్జెట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా బిజినెస్ కూడా అదే రేంజ్ లో జరుగుతుందని తెలుస్తుంది. కేవలం రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమా థియేట్రికల్ హక్కుల కోసం భారీ స్థాయిలో నిర్మాతలు పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. ఇండస్ట్రీ సమాచారం ప్రకారం ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ హక్కుల కోసం 325 కోట్ల రూపాయల బిజినెస్ జరుపుకోబోతుందని తెలుస్తోంది.
ఇప్పటివరకు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ స్థాయిలో ఏ సినిమా కూడా బిజినెస్ జరుపుకోలేదు. ఇలా వారణాసి సినిమా భారీ స్థాయిలో బిజినెస్ జరుపుకోబోతున్న నేపథ్యంలో ఈ సినిమా ముందు భారీ టార్గెట్ ఉందని చెప్పాలి. ఇక ఈ చిత్రాన్ని ‘శ్రీ దుర్గా ఆర్ట్స్’ మరియు ‘షోయింగ్ బిజినెస్’ బ్యానర్లపై ఎస్ ఎస్ కార్తికేయ, కే ఎల్ నారాయణ సంయుక్తంగా
నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం ఏకంగా 1300 కోట్లు బడ్జెట్ కేటాయించగా ప్రమోషన్ల కోసం అదనంగా 200 కోట్ల రూపాయలను కేటాయించినట్టు తెలుస్తుంది. ఇక ఈ సినిమా పాన్ వరల్డ్ స్థాయిలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇందులో మహేష్ బాబు రుద్ర పాత్రలో నటిస్తుండగా గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా మందాకినిగా ఈ సినిమాలో సందడి చేయబోతున్నారు. ఇక ఈ సినిమాకు ఇప్పటికే పాన్ వరల్డ్ స్థాయిలో భారీ బజ్ ఏర్పడిందని చెప్పాలి.
Also Read: బిగ్ బాస్10 హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న కంటెస్టెంట్ తనేనా?