E-Paper
Advertisement

సర్కార్‌కు ఎంప్లాయీస్ టెన్షన్.. తగ్గేదే లే అంటున్న తెలంగాణ ఉద్యోగులు!

సర్కార్‌కు ఎంప్లాయీస్ టెన్షన్.. తగ్గేదే లే అంటున్న తెలంగాణ ఉద్యోగులు!
Advertisement

Telangana Employees: స్వేచ్ఛ బ్యూరో: రాష్ట్ర సర్కార్ పై ఉద్యోగులు రగిలిపోతున్నారు. తెలంగాణ పాలనా యంత్రాంగంలో కీలకమైన ఉద్యోగ లోకం తీవ్ర అసంతృప్తితో ఉన్నది. ఇన్నాళ్లూ వినతిపత్రాలు, విజ్ఞప్తులకే పరిమితమైన నిరసన స్వరాలు..ఇప్పుడు ప్రత్యక్ష పోరాటానికి తెరలేపాయి.”మా హక్కులు మాకు ఇవ్వాల్సిందే.. బకాయిలు చెల్లించాల్సిందే”అంటూ సర్కార్‌పై ఒత్తిడి పెంచుతున్నారు.ఇటీవల ప్రభుత్వం నిర్వహించిన ప్రాథమిక చర్చలు ఫలించకపోవడంతో ఉద్యోగ సంఘాలు ‘నో కాంప్రమైజ్’అంటూ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో సచివాలయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.ప్రభుత్వ పెద్దలతో ఉద్యోగ సంఘాల ప్రతినిధులు జరిపిన ప్రాథమిక చర్చల్లో ఎలాంటి పురోగతి కనిపించలేదు.ఆర్థిక భారం సాకుగా చూపిస్తూ కాలయాపన చేసే ధోరణిని ఉద్యోగులు తీవ్రంగా ఖండించారు.”కేవలం హామీలతో సరిపెడితే ఒప్పుకునేది లేదు..కచ్చితమైన టైమ్‌లైన్ ఇచ్చి, ఉత్తర్వులు జారీ చేయాల్సిందే”అని ఉద్యోగ సంఘాలు నాయకులు ఈ మీటింగ్ లో హెచ్చరించారు.ఈ చర్చల్లో ప్రభుత్వం వైపు నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతో ఆందోళన బాట పట్టడమే ఏకైక మార్గమని ఉద్యోగ సంఘాలు నిర్ణయించాయి.

5ప్రధాన డిమాండ్లతో సమరభేరి..?

ఉద్యోగులు,ఉపాధ్యాయులు,పెన్షనర్లు ఐక్యంగా 5 ప్రధాన అంశాలను అజెండాగా నిర్దేశించుకొని పోరుబాటకు సిద్ధమయ్యారు.పెరిగిన నిత్యావసర ధరలు,ద్రవ్యోల్బణానికి అనుగుణంగా నూతన పే రివిజన్ కమిషన్ సిఫార్సులను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కొత్త పీఆర్ సీ అమలు చేసే వరకు తమ పోరాటం ఆగదని, ప్రభుత్వానికి దాదాపు రెండున్నర ఏళ్ల సమయం ఇచ్చామని ఉద్యోగ సంఘాలు చెప్తున్నాయి.51 శాతం ఫిట్‌మెంట్‌తో 2వ పీఆర్సీని వెంటనే విడుదల చేయాలని నొక్కి చెప్పారు.దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కరువు భత్యం (డీఏ) 6 బకాయిలను ఒకే విడతలో ఖాతాల్లో జమ చేయాలని ఒత్తిడి తెస్తున్నారు. భాగస్వామ్య పెన్షన్ విధానాన్ని( సీపీఎస్) రద్దు చేసి,ఉద్యోగుల సామాజిక భద్రత కోసం పాత పెన్షన్ విధానాన్ని (ఓపీఎస్)ను పునరుద్ధరించాలని కోరుతున్నారు.పేరుకే హెల్త్ కార్డులు తప్పా.. ఆసుపత్రుల్లో వైద్యం అందడం లేదని, ఉద్యోగులు ,రిటైర్డ్ సిబ్బందికి మెరుగైన ఈహెచ్‌ఎస్ సేవలు అందించాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.మరోవైపు ఉద్యోగులకు సంబంధించిన రూ.10 వేల కోట్ల పెండింగ్ బిల్లులను తక్షణమే విడుదల చేయాలని ఉద్యోగ సంఘాలు సర్కార్ ముందు ప్రతిపాదనలు ఉంచాయి.

Advertisement

Also read: డీఎస్సీలో అక్రమాలే కాదు పేపర్ కూడా లీక్.. మాజీ మంత్రి సాకే శైలజానాథ్ సంచలనం

పొరుగు రాష్ట్రంలో ‘వరాల జల్లు’..ఇక్కడ ఎందుకు జాప్యం..?

పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ తాజాగా ఉద్యోగులకు సంబంధించి వరుసగా సానుకూల ప్రకటనలు చేయడం,కొన్ని పెండింగ్ అంశాలను పరిష్కరించడం తెలంగాణ ఉద్యోగ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది.ఏపీ ప్రభుత్వం డీఏలపై కూడా క్లారిటీ ఇచ్చింది. అంతేగాక 70 ఏళ్ల దాటిన రిటైర్డ్ ఉద్యోగులకు అదనపు ఫించన్ ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించిందని టీజీ ఎంప్లాయిస్ అసోసియేషన్ లు వివరిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆస్తులు, రాబడి విషయంలో మెరుగైన స్థితిలో ఉన్న తెలంగాణలో ఎందుకు జాప్యం జరుగుతోందన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఏపీలో అడుగులు పడుతున్నప్పుడు టీజీ సర్కార్ స్పందించకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇది తెలంగాణ ప్రభుత్వానికి సామాజికంగానే కాకుండా రాజకీయంగానూ పెద్ద సవాలుగా మారింది.

ఈ నెల 10న ‘చలో హైదరాబాద్’..33 జిల్లాల నుంచి కవాతు..

Advertisement

ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ఈ నెల 10వ తేదీన నిర్వహించ తలపెట్టిన ‘చలో హైదరాబాద్’ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోనున్నారు.33 జిల్లాల నుంచి వేలాదిగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్లు రాజధానికి తరలిరానున్నారు. ఇప్పటికే మండల, జిల్లా స్థాయిలో సన్నాహక సమావేశాలు, బైక్ ర్యాలీలు, నిరసన ప్రదర్శనలు పూర్తయ్యాయి.రాజధాని నడిబొడ్డున తమ నిరసన గళాన్ని వినిపించి ప్రభుత్వం మెడలు వంచాలనే పట్టుదలతో ఉద్యోగ సంఘాల నాయకులు ఉన్నారు. అయితే ‘చలో హైదరాబాద్’ దిగ్విజయం కాకుండా అడ్డుకునేందుకు పోలీస్ యంత్రాంగాన్ని మోహరిస్తారా, లేక అంతకంటే ముందే మంత్రుల కమిటీతో చర్చలు జరిపి సర్దిచెబుతారా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.ఉద్యోగుల ఆందోళన తీవ్రతరమైతే పాలనా యంత్రాంగం స్తంభించిపోయే ప్రమాదం ఉన్నది.ఇలాంటి పరిస్థితుల్లో సర్కార్ ఎలాంటి స్టెఫ్​ తీసుకుంటుందనేది హాట్ టాఫిక్ గా మారింది.

Also read: కళ్ళుచెదిరే రేంజ్ లో ” వారణాసి” తెలుగు థియేట్రికల్ బిజినెస్.. టాలీవుడ్ లోనే హైయెస్ట్!

Tags

Related News

తెలంగాణ శాసనసభ సమావేశాల వేళ గులాబీ దళంలో ఉత్కంఠ.. కేసీఆర్ అసెంబ్లీకి వస్తారా లేదా..?

కేసీఆర్ అసెంబ్లీకి వస్తాడా? రాడా? ఇది కాదు అసలు సమస్య..! ఏం చర్చిస్తున్నారు.. ఏం చట్టాలు చేస్తున్నారు? అనేదే ముఖ్యం..

శ్రీకాకుళం జిల్లా డీఎస్సీలో మరో బిగ్ స్కామ్ బట్టబయలు.. టాప్ మార్కులు వచ్చినా రాని టీచర్ ఉద్యోగం!

తెలంగాణ కేబినెట్ ప్రక్షాళనలో ఊహించని ట్విస్ట్.. సీనియర్లకు బిగ్ షాక్!

కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరికిందుకు బీఆర్ఎస్ బిగ్ స్కెచ్.. ప్లాన్ వర్కౌట్ అయ్యేనా..!

డిప్యూటీ సీఎం ఇస్తేనే కేబినెట్‌లోకి వెళ్తా.. ఏఐసీసీకి మహేష్ కుమార్ గౌడ్ డిమాండ్‌!

కాంగ్రెస్ పార్టీకి ఉహించని షాక్.. ఆ విషయంలో ఇక అన్ని పార్టీలు అటువైపే..?

Big Stories

Advertisement
×