Mandaadi Trailer: ఒకప్పుడు కోలీవుడ్లో పలువురు స్టార్ హీరోల సినిమాలలో కమెడియన్ గా నటించి, తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న సూరి(Soori ) ఈ మధ్యకాలంలో హీరోగా మారి పలు చిత్రాలలో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇటు టాలీవుడ్ లో కలర్ ఫోటోతో భారీ పాపులారిటీ సొంతం చేసుకొని.. హిట్ 2 చిత్రంలో విలన్ గా నటించి.. విలక్షణ నటనతో మంచి గుర్తింపు సొంతం చేసుకున్న యంగ్ నటుడు సుహాస్ (Suhas) కోలీవుడ్లో విలన్ గా అడుగుపెడుతున్న చిత్రం.. అలా తమిళ నటుడు సూరి హీరోగా, టాలీవుడ్ విలక్షణ నటుడు సుహాస్ విలన్ గా సెప్టెంబర్ 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం మండాడి.
విడుదలకు కేవలం నాలుగు రోజులు మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో తాజాగా సినిమా నుండి ట్రైలర్ విడుదల చేశారు. తమిళనాడు తీర ప్రాంతంలో జరిగే సాంప్రదాయ పడవ పందేల నేపథ్యంలో ఈ సినిమాను హై వోల్టేజ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిస్తున్నారు. సెల్ఫీ మూవీ ఫేమ్ మతిమారన్ పుగళేంది దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రానికి ప్రముఖ డైరెక్టర్ వెట్రిమారన్ క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. సూరి సరసన మహిమా నంబియార్ (Mahima Nambiar) హీరోయిన్గా నటిస్తుండగా.. రవీంద్ర విజయ్, సత్యరాజ్ వంటి ప్రముఖ నటులు ఇందులో కీలకపాత్రలు పోషిస్తున్నారు. జీవి ప్రకాష్ కుమార్ (GV Prakash Kumar) అందిస్తున్న సంగీతం ట్రైలర్లో ఆయన అందించిన సంగీత నేపథ్యం సినిమాపై అంచనాలు పెంచేస్తోంది.
ఇకపోతే సెప్టెంబర్ 5వ తేదీన తమిళంలో ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేయగా.. ఒకరోజు ఆలస్యంగా తెలుగులో ఈ ట్రైలర్ ను విడుదల చేశారు.. ట్రైలర్ మొదలవగానే సముద్రంలో ప్రయాణిస్తున్న పడవలను చూపిస్తూ..” ఈ సముద్రం ఎంత పెద్దదో.. అందులో ఉన్న ప్రమాదాలు అంత పెద్దవి” అనే డైలాగ్ తో ట్రైలర్ ప్రారంభించారు. పందెం అంటే ఎవరు తెలివైన వాళ్ళు చూపించుకోవడం కాదు పందెం అంటే తెలివి అంటూ సత్యరాజ్ చెప్పే డైలాగ్ ఆకట్టుకుంది. పడవ ప్రయాణంలో గెలుపొందడానికి హీరో ,విలన్ మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకి హైలెట్గా నిలవనున్నాయి.
ముఖ్యంగా ఈ సముద్రంలో ఎటువంటి బాడీ డబుల్స్ లేకుండా సూరితో పాటు నటుడు సుహాస్ కూడా రిస్కీ యాక్షన్ సన్నివేశాలు, బోటు రేస్ సీక్వెన్స్ లలో చాలా కష్టపడి నటించినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా భారీ కష్టంతో భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మండాడి సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందని ఆడియన్స్ ట్రైలర్ చూశాక కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా మరో మంచి మూవీలో సుహాస్ అవకాశం కొట్టేశారు అంటూ కామెంట్స్ చేస్తూ ఉండడం గమనార్హం.
also read:ఒంటరిగా ఉన్నప్పుడు అలాంటి పనులు చేస్తా – అక్కినేని సుమంత్