Pakistan Richest Cricketers: పాకిస్తాన్ క్రికెట్ గురించి నిత్యం సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతూనే ఉంది. వాళ్లు చేసే చేష్టలు.. చేసే ప్రదర్శన నేపథ్యంలో సోషల్ మీడియాలో నిత్యం ట్రోలింగుకు గురి అవుతూ ఉంటారు. మొన్న ఇంగ్లాండ్ గడ్డపై రెండు టెస్టులు ఓడిపోయిన పాకిస్తాన్.. జట్టును ఉద్దేశించి ఇప్పటికీ మాజీలు విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఇది మరువక ముందే నిన్న ఆసియా కప్ 2026 టోర్నమెంటులో భాగంగా మహిళల పాకిస్తాన్… టీమిండియాలో మరో ఓటమిని చవి చూసింది. దీంతో సోషల్ మీడియాలో మళ్లీ పాకిస్తాన్ క్రికెట్ జట్టు అందరికీ టార్గెట్ అయింది. ఇది ఇలా ఉండగా… పాకిస్తాన్ క్రికెటర్ల ఆస్తుల వివరాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇందులో జైల్లో చిప్పకూడు తింటున్న ఇమ్రాన్ ఖాన్ అగ్రస్థానంలో ఉన్నాడు. అతని ఆస్తులు రూ.433 కోట్లుగా నివేదికలు చెబుతున్నాయి.
పాకిస్తాన్ క్రికెట్ జట్టు ( PAK) కెప్టెన్ గా అలాగే ప్రధానిగా ఎన్నో సేవలు అందించారు ఇమ్రాన్ ఖాన్. వరల్డ్ కప్ కూడా పాకిస్తాన్ కు అందించిన ఆటగాడిగా అతడికి గుర్తింపు దక్కింది. ఈ క్రమంలోనే అతని ఆస్తులు కూడా భారీగానే పెరిగాయి. ప్రస్తుతానికైతే రూ.433 కోట్లతో పాకిస్తాన్ జట్టులోనే అత్యధిక ఆస్తులు కలిగిన ఆటగాడిగా మొదటి స్థానంలో నిలిచాడు. ఆ తర్వాత షాహిద్ ఆఫ్రిది రూ. 390 కోట్లతో రెండవ స్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత హైదరాబాద్ అల్లుడు షోయబ్ మాలిక్ రూ. 211 కోట్లతో మూడో స్థానంలో నిలిచాడు. మహమ్మద్ హఫీజ్ రూ.179 కోట్లతో నాలుగో స్థానంలో నిలవడం గమనార్హం. ఆ తర్వాత రావల్ పిండి ఎక్స్ ప్రెస్ షోయబ్ అక్తర్ రూ.173 కోట్లతో ఐదో స్థానంలో నిలిచాడు.
ప్రీమియర్ బౌలర్ గా చెప్పుకునే షాహీన్ అఫ్రిది ఆస్తులు రూ.75.59 కోట్లుగా ఉన్నాయి. ఓవరాక్షన్ కింగ్ మహమ్మద్ రిజ్వాన్ ఆస్తులు రూ.56 కోట్లుగా ఉన్నాయి. ఆ తర్వాత కెప్టెన్ బాబర్ ఆజం ఆస్తులు రూ.47.24 కోట్లుగా ఉన్నాయి. షాబాద్ ఖాన్ ఆస్తులు కూడా దాదాపుగా రూ.47 కోట్లుగా ఉంటాయి. హారిస్ రవూఫ్ ఆస్తులు రూ.40 కోట్ల వరకు ఉంటాయని నివేదికలు చెబుతున్నాయి. ఫకర్ జమాన్ ఆస్తులు కూడా రూ. 35 నుంచి రూ. 40 కోట్ల మధ్య ఉంటాయని స్పష్టం చేస్తున్నారు. నసీం షా ఆస్తులు కూడా రూ.37.94 కోట్లుగా ఉన్నట్లు చెబుతున్నారు. ఇమద్ వసీం ఆస్తులు కూడా రూ. 35 కోట్లకు పైగా ఉంటాయి. పాకిస్తాన్ సూపర్ లీగ్ తో ( PSL) పాటు, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) నుంచి డబ్బులు సంపాదిస్తున్న క్రికెటర్లు…తమ ఆస్తులను పెంచుకుంటున్నారు.