E-Paper
Advertisement

నిన్న ధురంధర్.. నేడు మహాకాళి.. అక్షయ్ ఖన్నా ప్లాన్ అదుర్స్!

నిన్న ధురంధర్.. నేడు మహాకాళి.. అక్షయ్ ఖన్నా ప్లాన్ అదుర్స్!
Advertisement

Akshay Khanna: ప్రముఖ బాలీవుడ్ నటుడు అక్షయ్ ఖన్నా (Akshay Khanna)గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. విలక్షణమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ తనదైన రీతిలో అందరి దృష్టిని ఆకట్టుకుంటున్న అక్షయ్ ఖన్నా ఇటీవల ఆదిత్యధర్ (Adityadhar) దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ మూవీ ధురంధర్ సినిమాలో విలన్ పాత్ర పోషించి గట్టి కం బ్యాక్ ఇచ్చారు. రీ ఎంట్రీలో అదిరిపోయిన సక్సెస్ ఆయన ఖాతాలో చేరింది. ఈ ఒక్క సినిమా ఇచ్చిన విజయంతో ఈయన ఇప్పుడు వరుస పెట్టి అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతున్నారు.

బాలీవుడ్లో గ్రాండ్ రీ ఎంట్రీ..

ఇకపోతే నిన్న మొన్నటి వరకు బాలీవుడ్ చిత్రాలతో కూడా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న అక్షయ్ ఖన్నా ఇప్పుడు నేరుగా తెలుగు చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించబోతున్నారు. అసలు విషయంలోకి వెళ్తే హనుమాన్ సినిమాతో ఓవర్ నైట్ లోనే పాన్ ఇండియా డైరెక్టర్గా పేరు దక్కించుకున్న కుర్ర దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్న మహాకాళి సినిమాలో అక్షయ్ ఖన్నా కీలకపాత్ర పోషిస్తున్నారు. ఈ విషయాన్ని ప్రశాంత్ వర్మ అధికారికంగా ప్రకటించారు. అసలు విషయంలోకి వెళ్తే.. మార్చి 28వ తేదీన అక్షయ్ ఖన్నా పుట్టినరోజు కావడంతో ఆయనకు సంబంధించి మహాకాళి చిత్రంలోని అక్షయ్ ఖన్నా పాత్ర గురించి ఒక అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు ప్రశాంత్ వర్మ. అక్షయ్ కుమార్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ.. తన సోషల్ మీడియా వేదికగా అక్షయ్ ఖన్నా పాత్రకు సంబంధించిన ఫోటోని కూడా షేర్ చేశారు.

Advertisement

also read:స్పిరిట్ సినిమాపై వివేక్ ఒబెరాయ్ భారీ హైప్.. పిక్చర్స్ అభీ బాకీ హై!

అక్షయ్ ఖన్నా ప్లాన్ అదుర్స్..

ఈ మేరకు” మహాకాళి చిత్రంలో అక్షయ్ ఖన్నా శుక్రాచార్యుడి పాత్రలో కనిపిస్తారు. నిజమైన ప్రతిభకు హంగు ఆర్భాటాలు అవసరం లేదు అని నిరూపించే నటుడు అక్షయ్ ఖన్నా మాత్రమే.. మీతో కలిసి పని చేయడం నాకు దక్కిన గౌరవంగా నేను భావిస్తున్నాను. మన కాంబినేషన్లో వస్తున్న ఈ అద్భుతమైన చిత్రాన్ని నేను ప్రపంచానికి చూపించడానికి చాలా ఆసక్తిగా ఉన్నాను” అంటూ ప్రశాంత్ వర్మ కామెంట్లు చేశారు. ఇక ప్రస్తుతం ప్రశాంత్ వర్మ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మొత్తానికైతే ధురంధర్ సినిమాతో బాలీవుడ్లో రీ ఎంట్రీ ఇచ్చి మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న అక్షయ్ ఖన్నా ఇప్పుడు మహాకాళి సినిమాతో తెలుగు ప్రేక్షకులను నేరుగా పలకరించి మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకోబోతున్నారు. మొత్తానికైతే ఆయన ప్లాన్ అదుర్స్ అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. మరి మహాకాళి సినిమాతో అక్షయ్ ఖన్నా ఎలాంటి సక్సెస్ అందుకుంటారో చూడాలి.

Advertisement

Related News

నాగార్జున ‘కింగ్ 100’ నుంచి దసరా సర్‌ప్రైజ్.. అదేంటో తెలుసా ?

బాలీవుడ్‌లో కాల్పుల కలకలం.. టైగర్ ష్రాఫ్‌కు ఏమైంది?

40 ఏళ్ల తర్వాత కాశీకి వెళ్లిన రేణు దేశాయ్.. అక్కడ ఏం జరిగిందంటే?

విజయ్ యాక్షన్‌కు ఫిదా అయిన సందీప్ వంగా.. ఆర్జీవీ రియాక్షన్ మామూలుగా లేదుగా!

బాలు సినిమాలో పవన్ వేసుకున్న ప్యాంట్స్ వెనుక ఇంత కథ ఉందా?

పవన్ కళ్యాణ్‌తో విడిపోయాక నా పరిస్థితి ఇదే.. రేణు దేశాయ్ కామెంట్స్!

నవరాత్రుల వేళ హెబ్బా పటేల్ స్పెషల్ ట్రీట్..ఫ్యాన్స్‌కు కనువిందే!

జ్యోతి పూర్వజ్, పూర్వాజ్ మూవీ ‘కిల్లర్’.. ఒకేసారి రెండు అప్డేట్స్!

Big Stories

Advertisement
×