E-Paper
Advertisement

CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డితో మేనకా గాంధీ భేటీ!

CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డితో మేనకా గాంధీ భేటీ!
Advertisement

CM Revanth Reddy: తెలంగాణలో గోవుల సంరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పక్కా ప్రణాళికలు రూపొందించిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఎన్కేపల్లిలో అత్యాధునిక సౌకర్యాలతో విశాలమైన ప్రదేశంలో గోశాల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన విషయాన్ని సీఎం గుర్తు చేశారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు ముఖ్యమైన ఆలయాల సమీపంలో కూడా గోశాలల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిపారు.

క్యూర్ పరిధిలోని..

శాసనసభ సమావేశ హాలులో ముఖ్యమంత్రి తో ప్రముఖ జంతు హక్కుల కార్యకర్త, పీపుల్ ఫర్ యానిమల్స్ అధ్యక్షురాలు మేనకా గాంధీ బృందం భేటీ అయ్యారు. ఈ సమావేశంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు తో పాటు క్యూర్ పరిధిలోని మూడు మున్సిపల్ కార్పొరేషన్ల కమిషనర్లు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలోని మున్సిపాలిటీల పరిధిలో వీధికుక్కల నిర్వహణ, గోసంరక్షణ కోసం చేపట్టిన చర్యలను అధికారులు మేనకా గాంధీకి వివరించారు. మున్సిపాలిటీల వ్యాప్తంగా వీధి కుక్కలకు నిర్వహిస్తున్న స్టెరిలైజేషన్ ప్రక్రియ వివరాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.

Advertisement

Also read: సత్తుపల్లిలో దారుణం.. ఇద్దరి ప్రాణం తీసిన ఈత సరదా..!

జంతు సంరక్షణ

జంతువుల సంరక్షణ కోసం తీసుకుంటున్న క్షేత్రస్థాయి చర్యలను అధికారులు మేనకా గాంధీ బృందానికి తెలియజేశారు. జంతు సంరక్షణ విషయంలో తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న వివిధ కార్యక్రమాలపై మేనకా గాంధీ సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వ యంత్రాంగం చూపిస్తున్న చొరవను ఆమె అభినందించారు. రాష్ట్ర ప్రభుత్వ కృషిని ప్రశంసించడంతో పాటు జంతువుల సంక్షేమం పట్ల చూపుతున్న నిబద్ధతను ఈ సందర్భంగా మేనకా గాంధీ కొనియాడారు.

Advertisement

Also read: హీటెక్కిన పాలిటిక్స్.. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి వొడితల ప్రణవ్ సవాల్..!

Related News

తెలంగాణ మహిళపై జమ్మూకశ్మీర్‌లో కేసు నమోదు..!

ఎంవీఎస్ఆర్ కాలేజీ దాండియా ప్రమాదంపై.. ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక ప్రకటన!

ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగే సదస్సులకు.. సర్కార్ కొత్త నిబంధనలు!

సోషల్ మీడియాలో వైరల్ వీడియోపై.. నిజామాబాద్ పోలీసులు యాక్షన్..!

కేసీఆర్‌ కుటుంబ ఆస్తులు స్వాధీనం చేసుకోవాలి! – మాజీ మంత్రి రవీంద్ర నాయక్

సాలార్ జంగ్ మ్యూజియంకు సరికొత్త రూపు.. ఓయూ విద్యార్థులకు కీలక పిలుపు!

దేశంలో అలజడులు సృష్టించే కుట్రలు సాగనివ్వం: రాంచందర్ రావు

కేజీబీవీ కాంట్రాక్ట్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్.. త్వరలో మళ్లీ ఆర్డర్లు?

Big Stories

Advertisement
×