E-Paper
Advertisement

Action Thriller OTT : ప్రతీకారం తీర్చుకునే ఆత్మ… అమ్మాయి శరీరంలోకి గ్యాంగ్‌స్టర్… మెంటల్ మాస్ మూవీ

Action Thriller OTT : ప్రతీకారం తీర్చుకునే ఆత్మ… అమ్మాయి శరీరంలోకి గ్యాంగ్‌స్టర్… మెంటల్ మాస్ మూవీ
Advertisement

Action Thriller OTT : మార్షల్ ఆర్ట్స్, కామెడీ కలగలిపి ఉన్న ఒక జపనీస్ హారర్ సినిమా ఆడియన్స్ ని ఆకట్టుకుంటోంది. ఇందులో ఒక గ్యాంగ్ స్టర్ ఆత్మ, ఒక అమ్మాయి బాడీలోకి ఎంట్రీ ఇవ్వడంతో యాక్షన్స్ మరో లెవెల్ లో కి వెళ్తాయి. ఇందులో హీరోయిన్ అకారి టకైషికి జపాన్‌లో మంచి గుర్తింపు ఉంది. ఈ సినిమాలో ఆమ అమాయక కాలేజీ అమ్మాయిగా, ఒంట్లోకి దెయ్యం దూరినప్పుడు భయంకరమైన కిల్లర్ గా, రెండు రకాల షేడ్స్ చూపించాలి. అయితే ఈ రెండు వేరియేషన్లను ఆమె చాలా బాగా పండించింది. ఈ సినిమా జపాన్ లో సూపర్ హిట్ కూడా అయింది.

ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అంటే

ఈ జపనీస్ యాక్షన్ హారర్ కామెడీ సినిమా పేరు ‘ఘోస్ట్ కిల్లర్’ (Ghost Killer). 2024లో వచ్చిన ఈ సినిమాను ప్రముఖ యాక్షన్ దర్శకుడు కెన్సుకే సోనోమురా తెరకెక్కించారు. ఈ దర్శకుడు జపాన్‌లో సూపర్ హిట్ అయిన ‘బేబీ అస్సాసిన్స్’ (Baby Assassins) సిరీస్‌ను తీశాడు. అందుకే ఈ సినిమాలో కూడా యాక్షన్ సీన్లు చాలా స్టైలిష్‌గా, ఫాస్ట్‌గా ఉంటాయి. ఇందులో అకారి టకైషి (ఫుమికా), మసనోరి మిమోటో (కుడో) లీడ్ రోల్స్ లో నటించారు. ఈ సినిమాలో గ్రాఫిక్స్ కంటే ఎక్కువగా మార్షల్ ఆర్ట్స్, గన్ ఫైట్స్ మీద ఫోకస్ పెట్టారు. దర్శకుడు సోనోమురా స్వతహాగా యాక్షన్ కొరియోగ్రాఫర్ కావడంతో, ఫైట్లు చాలా అద్భుతంగా అనిపిస్తాయి. ముఖ్యంగా అమ్మాయి బాడీతో ఒక ప్రొఫెషనల్ కిల్లర్ చేసే ఫైట్లు హైలైట్‌గా నిలుస్తాయి. 105 నిమిషాలు ఈ సినిమా prime video, apple tv లలో అందుబాటులో ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

ఫుమికా అనే ఒక కాలేజీ అమ్మాయి, తన పని తను చేసుకునే ఒక అమాయకపు అమ్మాయి. ఒకరోజు ఆమెకు అనుకోకుండా ఒక పాత బుల్లెట్ దొరుకుతుంది.. కానీ ఆ బుల్లెట్‌లో ‘కుడో’ అనే ఒక గన్ షూటర్ ఆత్మ దాక్కుని ఉందని ఆ అమ్మాయికి తెలియదు. ఆ కుడో మామూలోడు కాదు, ఒకప్పుడు పెద్ద గ్యాంగ్‌స్టర్ల దగ్గర కిరాయి హంతకుడిగా పని చేసిన వ్యక్తి. సొంత మనుషుల చేతిలోనే దారుణంగా చచ్చిపోయినోడు. ఇప్పుడు ఆ పాత పగ తీర్చుకోవడానికి ఆ పిల్లే వాడికి దిక్కవుతుంది. ఆ బుల్లెట్ పట్టుకోగానే కుడో ఆత్మ ఫుమికా ఒంట్లోకి దూరేస్తుంది. ఇక అప్పటినుంచి ఆ పిల్లి లాంటి అమ్మాయి పులిలా మారిపోతుంది.

ఇప్పుడు కుడో ఆత్మ ఆమె బాడీని కంట్రోల్ చేస్తూ, తనని చంపిన పాత గ్యాంగ్ మనుషుల్ని వెతికి వెతికి కొట్టడం మొదలెడతాడు. తుపాకులు పేల్చడం, కత్తులతో నరకడం, మార్షల్ ఆర్ట్స్ ఫైట్లు.. ఇవన్నీ ఆ అమ్మాయి బాడీతోనే కుడో చేసేస్తుంటాడు. పాపం ఆ అమ్మాయికి ఏం జరుగుతుందో అర్థం కాక అల్లాడిపోతూ ఉంటుంది. ఆ పాత గ్యాంగ్ వాళ్ళు కూడా తక్కువోళ్లేం కాదు, వాళ్ల దగ్గర కూడా పెద్ద పెద్ద గూండాలు ఉంటారు. కానీ ఈ దెయ్యం పట్టిన అమ్మాయిని తట్టుకోవడం వాళ్ల వల్ల కూడా కాదు. ఫుమికా అమాయకత్వం, కుడో పగ.. ఈ రెండిటి మధ్య జరిగే ఈ వింత పోరాటంలో ఆ గ్యాంగ్‌ని ఎలా మట్టి కరిపించారు అనేదే క్లైమాక్స్.

Advertisement

Read Also :  హిట్ అండ్ రన్ కేసు వెనుక హీట్ ఎక్కించే బయో వార్ మిస్టరీ… ఫ్యూజులు అవుటయ్యే ఇన్వెస్టిగేషన్

Related News

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

పిల్లల కోసం అండర్‌వరల్డ్‌ను షేక్ చేసిన తల్లి… క్షణక్షణం నెయిల్ బైటింగ్ థ్రిల్లర్

యానిమే ప్రేమికులకు పండగే పండగ… ఓటీటీలోకి అడుగు పెట్టిన భారీ మిలిటరీ సై-ఫై అడ్వెంచర్

Big Stories

Advertisement
×