E-Paper
Advertisement

తలైవా ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్.. జైలర్ 2 రిలీజ్ అప్పుడేనా?

తలైవా ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్.. జైలర్ 2 రిలీజ్ అప్పుడేనా?
Advertisement

Jailar 2 : తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ వరుస హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటున్నాడు.. ప్రస్తుతం తమిళ స్టార్ డైరెక్టర్ నెల్సన్ కాంబోలో జైలర్ 2 మూవీలో నటిస్తున్నాడు.. గతంలో వచ్చిన జైలర్ కి సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది.. గత కొన్ని రోజులుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అని తలైవా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ మూవీని జూన్ 12న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర యూనిట్ అనుకున్నారు.. కానీ ప్రస్తుతం ఈ సినిమాకు రిస్కులు ఎక్కువ అవడంతో ఆ డేటు పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.. ఒకవేళ అదే కనుక నిజమైతే మరి సినిమా ఎప్పుడు రిలీజ్ అయ్యే అవకాశం ఉంది అన్నది ఒకసారి తెలుసుకుందాం..

‘పెద్ది’ కోసం వెనక్కి వెళ్లిన జైలర్ 2.. 

మార్చి నెలలో రిలీజ్ కావాల్సిన చాలా సినిమాలు జూన్ కి వాయిదా పడిన విషయం తెలిసిందే.. ఈ సినిమా వెనక్కి వెళ్లడానికి కారణం రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది అని తెలుస్తుంది. జూన్ 4 పెద్ది రిలీజవుతోంది. ఇది ఒకవేళ బ్లాక్ బస్టర్ అయితే ఏపీ, తెలంగాణ, ఓవర్సీస్ లో దీని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ఆ టైంలో సినిమా రిలీజ్ చేసి రిస్క్ చేయడం అవసరమా అని ఈ చిత్ర యూనిట్ వెనక్కి తగ్గేందుకు ఆలోచిస్తుందట.. జూన్ లో ఇంకా టాక్సిక్ మూవీ కూడా రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఈ క్రమంలో రిస్క్ ఎందుకని జూలై లో రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. పరిస్థితి చూస్తుంటే ఆగస్టు లో విడుదల అయ్యే ఛాన్స్ ఉన్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాని ఎప్పుడు చూస్తామా అని ఎదురుచూస్తున్న తలైవా అభిమానులకు ఇది షాకింగ్ న్యూస్.. త్వరలోనే ఈ మూవీ రిలీజ్ డేట్ గురించి ప్రకటించే అవకాశం ఉన్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి..

Advertisement

Also Read :డైరెక్టర్ అనిల్ రావిపూడికి, జబర్దస్త్ అభికి మధ్య ఉన్న రిలేషన్ ఏంటో తెలుసా..?

ట్రైలర్ రిలీజ్.. 

ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ఒక ట్రైలర్ ని రిలీజ్ చేసే ఆలోచనలు మేకర్స్ ఉన్నట్లు తెలుస్తుంది.. దానికి వచ్చే రెస్పాన్స్ని బట్టి సినిమా రిలీజ్ డేట్ ని ప్రకటించే అవకాశం ఉంది. ఏది ఏమైనా కూడా ఈ సినిమా నుంచి ఇప్పటివరకు వచ్చిన ప్రతి అప్డేట్ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఈ మూవీ నుంచి ఎక్కువగానే ఉన్నాయి. మరి ఈ చిత్రంతో రజినీకాంత్ ఎలాంటి రికార్డులను బ్రేక్ చేస్తాడో చూడాలి.. తెలుగు రాష్ట్రాల నుంచి జైలర్ 2 కనీసం అరవై కోట్ల బిజినెస్ ఆశిస్తోందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. కూలీ మూవీకి పెద్దగా వసూళ్లు అందుకోలేదు. జైలర్ కు ఎటు లేదన్నా అంచనాలను రీచ్ అవ్వాలంటే బాక్సాఫీస్ వద్ద కనీసం 100 కోట్లు అయిన గ్రాస్ రాబట్టాలి.. ఏం జరుగుతుందో తెలియాలంటే సినిమా వచ్చేవరకు వెయిట్ చెయ్యాల్సిందే..

Related News

ఐశ్వర్య రాజేష్ మొరను ఆలకించిన డైరెక్టర్.. బాలయ్య మూవీలో క్రేజీ రోల్!

‘విక్రమ్ 1’ ర్యాకెట్ ప్రయోగంలో జబర్దస్త్ సత్యశ్రీ చెల్లి కీలక పాత్ర.. ఆ ఫొటోలు షేర్ చేస్తూ నటి ఎమోషనల్!

నటిగా పీవీ సింధు.. ఆసక్తిని రేకెత్తిస్తున్న పోస్ట్!

చిన్న వయసులోనే గొప్ప మనసు చాటుకున్న సితార.. మహేష్ బాబు ఎమోషనల్ పోస్ట్!

టాలీవుడ్ లో నేషనల్ అవార్డు అందుకున్న తొలి చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరంటే?

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

Big Stories

Advertisement
×