E-Paper
Advertisement

తమిళనాడు ఎలక్షన్ రిజల్ట్ ..టెన్షన్ లో విజయ్.. తిరుమలలో త్రిష!

తమిళనాడు ఎలక్షన్ రిజల్ట్ ..టెన్షన్ లో విజయ్.. తిరుమలలో త్రిష!
Advertisement

Trisha Krishnan:కోలీవుడ్ స్టార్ హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న త్రిష దక్షిణాది భాషలలో ఊహించని పాపులారిటీ సొంతం చేసుకుంది. ఇండస్ట్రీకి వచ్చి రెండు దశాబ్దాలకు పైగానే అవుతున్నా.. ఇప్పటికీ తరగని అందంతో వరుస అవకాశాలు అందుకుంటూ బిజీగా మారింది. ఇకపోతే ఈరోజు ఈమె 43వ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఈమెకు సోషల్ మీడియా వేదికగా సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజనులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇకపోతే ఈరోజు ఈమె పుట్టిన రోజు కావడంతో తిరుమల తిరుపతి దేవస్థానానికి శ్రీవారి దర్శనం కోసం వెళ్ళింది. ఈ సందర్భంగా తన ఇంస్టాగ్రామ్ లో చేసిన పోస్ట్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

విజయ్ ఎన్నికల ఫలితాల వేళ తిరుపతిలో త్రిష..

అసలు విషయంలోకి వెళ్తే.. గత కొన్ని నెలలుగా త్రిష కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతితో రిలేషన్ లో ఉందంటూ వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. మరొకవైపు సినీనటి కారణంగా తాను తన భర్తకు విడాకులు ఇస్తున్నాను అని సంగీత కూడా కోర్టులో కేసు వేసింది. ఇవన్నీ నడుస్తున్న వేళ మరొకవైపు తమిళనాడులో టీవీకే పార్టీని స్థాపించి ఎన్నికల బరిలో దిగారు విజయ్. ముఖ్యంగా ఎన్నికల ఫలితాలు నేడు వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో విజయ్ టెన్షన్ లో ఉండగా.. మరోవైపు ఈరోజు ఆమె పుట్టిన రోజు.. పైగా తెల్లవారుజామునే శ్రీవారిని దర్శించుకోవడానికి ఆమె తిరుమలకు వెళ్ళింది. ఇవన్నీ కాదని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్ట్ కూడా సంచలనానికి దారితీసింది. నిన్న రాత్రి కారులో తిరుపతికి వెళుతున్న వీడియోని షేర్ చేసింది. తమిళనాడు ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న నేపథ్యంలో త్రిష తిరుపతి పర్యటన అందరి దృష్టిని విపరీతంగా ఆకర్షించింది. దర్శనం చేసుకున్న తర్వాత ఉదయాన్నే తిరుపతి ఎళుమలైయన్ ఆలయంలో సుప్రభాత సేవకు హాజరైంది.

అభిమాని కామెంట్.. సంతోషంలో త్రిష..

Advertisement

దర్శనం తర్వాత ఆలయ ప్రాంగణంలో నడుస్తుండగా ఒక అభిమాని మేడం ఈరోజు ఫలితం మన వైపే ఉంది అంటూ కామెంట్ చేయగా ..త్రిష నవ్వుతూ అక్కడ నుంచి వెళ్లిపోయింది . ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.. ఇకపోతే ఇది చూసిన నెటిజన్స్ అటు బర్తడే ఇటు విజయ్ ఎన్నికల ఫలితాలు అన్నీ శుభంగా జరగాలి అని తిరుపతి శ్రీవారిని దర్శించుకుంది త్రిష అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ALSO READ:రోజుకు 15 గంటలు పస్తు.. నరకం అనుభవించలేక చంపేయమన్నాను – సుప్రీత!

త్రిష కెరియర్..

Advertisement

ఇక త్రిష విషయానికి వస్తే ..2002లో వచ్చిన మౌనం పేసియతే చిత్రం ద్వారా నటిగా అరంగేట్రం చేసిన ఈమె.. ఆ తర్వాత తమిళ్ , తెలుగు, కన్నడ, హిందీ, మలయాళం భాషల్లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో నటించింది. ఇక తెలుగులో ప్రభాస్ సరసన వర్షం సినిమాతో ఊహించని విజయాన్ని అందుకున్న ఈమె తన అద్భుతమైన నటనతో తమిళనాడు రాష్ట్ర అవార్డులతో పాటు మరెన్నో పురస్కారాలు సొంతం చేసుకుంది. ఇక సెకండ్ ఇన్నింగ్స్ లో పొన్నియన్ సెల్వన్, లియో, ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం, విదాముయార్చి వంటి చిత్రాలలో నటించి మంచి విజయాలను అందుకున్న ఈమె.. ప్రస్తుతం చిరంజీవికి జోడిగా విశ్వంభర సినిమాలో నటిస్తోంది. అలాగే కరుప్పు సినిమాలో కూడా నటిస్తోంది. ఇక మే 14 వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Related News

వారికి అభినందనలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం!

వారణాసి షూటింగ్ పై క్రేజీ అప్డేట్.. జక్కన్న ఏం ప్లాన్ చేస్తున్నావయ్యా?

ఎమోషనల్ గా ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్.. కిరణ్ ఖాతాలో మరో హిట్?

ఫిగర్ బాలేదని టార్చర్.. 40 ఏళ్లొచ్చాకే ఆ నరకం నుండి బయటపడ్డానంటున్న తారక్ హీరోయిన్

యాంకర్ సుమ హీరోయిన్‌గా నటించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా ?

‘టాక్సిక్’ ట్రైలర్ డేట్ ఫిక్స్..ఇదైనా ఖాయమా యష్?

72వ జాతీయ అవార్డుల్లో సత్తా చాటిన తెలుగు సినిమాలు.. ఉత్తమ చిత్రం ఏదంటే?

విక్రమ్ 1 సక్సెస్.. చిరు ఫిదా: ప్రైవేట్ రాకెట్ ప్రయోగంపై మెగాస్టార్ క్రేజీ రియాక్షన్!

Big Stories

Advertisement
×