E-Paper
Advertisement

విజయ్ ఓటమి పుకార్లు.. గొంతు కోసుకున్న అభిమాని!

విజయ్ ఓటమి పుకార్లు.. గొంతు కోసుకున్న అభిమాని!
Advertisement

Vijay Fan: విజయ్ అంటే ప్రాణమిచ్చే అభిమానులు ఉంటారని మనకు తెలుసు కానీ, కేవలం ఒక పుకార్లు విని ప్రాణాల మీదకు తెచ్చుకోవడం నిజంగా కలచివేసే విషయం. తాజాగా తమిళనాడులోని కృష్ణగిరిలో జరిగిన ఈ ఘటన అందరినీ షాక్‌కు గురిచేస్తోంది.

కృష్ణగిరి జిల్లా బరూరుకు చెందిన కె. మహేంద్రన్ (28) అనే యువకుడు నటుడు, టీవీకే (TVK) పార్టీ అధినేత విజయ్‌కు వీరాభిమాని. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ ఓడిపోతారంటూ సోషల్ మీడియాలో, బయట కొన్ని వదంతులు చక్కర్లు కొట్టాయి. ఈ వార్తలు విన్న మహేంద్రన్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. విజయ్ ఓటమిని తాను తట్టుకోలేనంటూ, తన గొంతు తానే కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

Advertisement

రక్తపు మడుగులో ఉన్న మహేంద్రన్‌ను గమనించిన కుటుంబ సభ్యులు, స్థానికులు హుటాహుటిన కృష్ణగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతనికి అత్యవసర విభాగంలో చికిత్స అందుతోంది. పరిస్థితి విషమంగానే ఉందని సమాచారం.

రాజకీయాల్లో గెలుపోటములు సహజం. అభిమానం ఉండాలి కానీ, అది ప్రాణాలు తీసుకునేంత స్థాయికి వెళ్లకూడదు. విజయ్ లాంటి నాయకులు కూడా తమ అభిమానులు క్షేమంగా ఉండాలనే కోరుకుంటారు. ఇలాంటి విపరీత నిర్ణయాలు తీసుకుని కుటుంబాలను రోడ్డును పడేయడం ఎవరికీ మంచిది కాదు. పుకార్లను నమ్మి ఆవేశపడకుండా నిబ్బరంగా ఉండాలని పోలీసులు, సామాజిక కార్యకర్తలు కోరుతున్నారు.

Advertisement

Also Read:తమిళనాడు ఎలక్షన్ రిజల్ట్ ..టెన్షన్ లో విజయ్.. తిరుమలలో త్రిష!

Related News

ఇరుముడి ఎఫెక్ట్.. ‘తులాభారం’ కోసం రవితేజ భారీ రెమ్యూనరేషన్..

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

‘కంచె చేను మేస్తున్న’ దారుణ హత్యలు! పని మనుషుల ముసుగులో నరరూప హంతకులు!

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

Big Stories

Advertisement
×