E-Paper
Advertisement

12A Railway Colony Trailer: అల్లరి నరేష్ కొత్త మూవీ ట్రైలర్.. క్రైమ్ – సస్పెన్స్ – థ్రిల్లర్

12A Railway Colony Trailer: అల్లరి నరేష్ కొత్త మూవీ ట్రైలర్.. క్రైమ్ – సస్పెన్స్ – థ్రిల్లర్
Advertisement

12A Railway Colony Trailer: అల్లరి నరేష్ హీరోగా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న తాజా చిత్రం “12 ఏ రైల్వే కాలనీ”(12A Railway Colony) . ఈ సినిమా క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రాబోతోందని తెలుస్తోంది. నవంబర్ 21 వ తేదీ ఈ సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ చూస్తుంటే సినిమా మొత్తం ఎంతో ఉత్కంఠ భరితంగా అనేక ట్విస్టులతో కొనసాగుతుందని స్పష్టం అవుతుంది. ఇలా ట్రైలర్ చూస్తుంటే నరేష్ ఖాతాలో హిట్ పడటం ఖాయమని తెలుస్తుంది.

ఇంటెన్స్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ..

పొలిమేర సినిమాలతో దర్శకుడుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నాని కాసర గడ్డ (Nani Kasaragadda)దర్శకత్వంలో అల్లరి నరేష్ కామాక్షి భాస్కర్ల(Kamakshi Bhaskarala) ప్రధాన పాత్రలలో నటిస్తున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్లను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే ఇప్పటికే సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ విడుదల చేయగా ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకుని తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ చూస్తుంటే ఇందులో ఇంటెన్స్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ భారీగా ఉన్నాయని తెలుస్తోంది. సినిమా మొత్తం ఇలాగే ఉత్కంఠ భరితంగా ఉండబోతుందని స్పష్టమవుతుంది.

అంచనాలు పెంచిన ట్రైలర్..

Advertisement

ఇక ఈ సినిమాలో వైవా హర్ష, గెటప్ శీను, కమెడియన్ సద్దాం వంటి తదితరులు కీలక పాత్రలలో కనిపించబోతున్నారని తెలుస్తోంది. ఇక ఈ చిత్రాన్ని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస్ చిట్టూరి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించగా ఈ సినిమాకు బీమ్స్ సంగీతం అందించబోతున్నారు. ఇక ఇటీవల అల్లరి నరేష్ వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నప్పటికీ సరైన సక్సెస్ మాత్రం అందుకోలేకపోతున్నారు. మరి క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో రాబోతున్న ఈ సినిమా ద్వారా ఎలాంటి సక్సెస్ అందుకుంటారో తెలియాల్సి ఉంది. ఈ సినిమాతో పాటు అల్లరి నరేష్ తదుపరి సినిమాలో షూటింగ్ పనులలో కూడా ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఈయన తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి హిట్టు ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.

Advertisement

ఇక అల్లరి నరేష్ ఇటీవల ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం, ఉగ్రం వంటి సినిమాల ద్వారా విభిన్న పాత్రలలో నటిస్తూ ప్రేక్షకుల ముందుకు వచ్చారు కానీ ఈ సినిమాలు పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి.ఈ సినిమా నవంబర్ 21 వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటూ భారీగా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

Also Read: Meenakshi Chowdary: బుద్ధుంటే అలాంటి పాత్రలో నటించను.. రూమర్లను ఖండించిన మీనాక్షి!

Related News

రణ్‌బీర్‌కు ముందు రాముడిగా ఫిక్స్ అయిన హీరోలు ఎవరంటే..!

రీజన్ లేకుండా ముద్దు పెట్టను.. అనన్య శర్మ బోల్డ్ స్టేట్‌మెంట్!

డ్యాన్సర్స్ అసోసియేషన్‌పై వేటు.. జానీ మాస్టర్ భార్య సుమలతపై ఫిల్మ్ ఫెడరేషన్ తీవ్ర ఆగ్రహం!

మిథున్ చక్రవర్తికి సర్జరీ.. అసలు ఏమైంది..?

దుబాయ్ క్యాన్సిల్.. ముంబైలోనే బన్నీ ‘రాకా’ రచ్చ!

రణ్‌వీర్ సినిమా దెబ్బకు నెట్‌ఫ్లిక్స్ రికార్డులన్నీ షేక్!

“విశ్వనాథ్ అండ్ సన్స్” ట్రైలర్ చూశారా..? చివర్లో ట్విస్ట్ అదిరిపోయింది!

విజయ్ విడాకుల కేసులో బిగ్ ట్విస్ట్.. వెనకడుగు వేసిన సంగీత!

Big Stories

Advertisement
×