E-Paper
Advertisement

Google Nanno Banana 2: నానో బనానా 2 వస్తోంది.. ఇక రియల్, ఏఐ గుర్తించడం కష్టమేనట, ఎందుకంటే?

Google Nanno Banana 2: నానో బనానా 2 వస్తోంది.. ఇక రియల్, ఏఐ గుర్తించడం కష్టమేనట, ఎందుకంటే?
Advertisement

Google Nano Banana 2:

టెక్ దిగ్గజం గూగుల్ తన జెమిని 2.5 ఫ్లాష్ మోడల్‌ ను నానో బనానా అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. ఈ   ఇమేజ్ టూల్ ఎడిటింగ్, నేచురల్ లాంగ్వేజ్ ఇమేజ్ జనరేటింగ్ ఫీచర్స్ యూజర్లను క్రేజీగా ఆకట్టుకున్నాయి. కొద్ది వారాల పాటు ఎక్కడ చూసినా గూగుల్ నానో బనానా ఫోటోలే హల్ చల్ చేశాయి. ఈ నేపథ్యంలో గూగుల్ మరో గుడ్ న్యూస్ చెప్పింది. నానో బనానా 2 వెర్షన్ ను అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు వెల్లడించింది. రాబోయే అడ్వాన్స్ డ్ వెర్షన్  టెక్స్ట్ రెండరింగ్, ఇన్ఫోగ్రాఫిక్స్, చార్ట్‌ లతో పాటు వినియోగదారుల సూచనలకు అనుగుణంగా పని చేయనున్నట్లు తెలిపింది. అదే సమయంలో కావాల్సిన రెజల్యూషన్, యాస్పెక్ట్ రేషియోతో పాటు నచ్చిన రెజల్యూషన్ లో ఇమేజెస్ పొందే అవకాశం ఉన్నట్లు తెలిపింది. త్వరలోనే నానో బనానా 2 వెర్షన్ అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది.

నానో బనానా 2 ప్రత్యేకత ఏంటంటే?

టెక్ నివేదికల ప్రకారం.. నానో బనానా 2.. కంప్లీట్ ఫోటోను అందుబాటులోకి తీసుకురావడానికి ముందు  అవుట్‌ పుట్‌ ను ప్లాన్ చేస్తుంది. ఎవాల్యుయేట్ చేస్తుంది. ఫైనల్ ఫోటో అద్భుతంగా వచ్చేందుకు కావాల్సిన అన్ని మెరుగులు అద్దుతుంది. ఈ మోడల్ అవుట్‌ పుట్‌ ను పూర్తిగా అంచనా వేస్తుంది. వ్యత్యాసాలను గుర్తించి ఆటోమేటిక్ గా సరి చేస్తుంది. గత ఫోటోలతో పోల్చితే అత్యంత కచ్చితత్వం, నేచురాలిటీని మరింత పెంచుతుంది. 1:1, 2:3, 3:2, 4:3, 16:9, 21:9 సైజులతో పాటు 1K నుంచి 4K అవుట్‌ పుట్ రిజల్యూషన్‌  వరకు ఫోటోల అవుట్ పుట్ ఉంటుంది. టెక్‌ రాడార్ రిపోర్ట్ ప్రకారం, నానో బనానా 2కి సపోర్ట్ చేసే జెమిని 3 ప్రో ఇమేజ్ మోడల్..  చక్కటి టెక్స్ట్, విజువల్ డీటైల్స్ ను మరింత అద్భుతంగా ప్రజెంట్ చేస్తుంది.  AI ద్వారా తయారు చేసిన పోస్టర్లు, ఇతర డిజైన్ గ్రాఫిక్స్ మరింత క్రిస్ప్ ఎడ్జ్ లను కలిగి ఉండనున్నాయి. అంతేకాదు, ప్రొఫెషనల్ డిజైనర్స్ కోసం  4K అప్‌ స్కేలింగ్‌తో పాటు 2K రెండరింగ్‌ ను కలిగి ఉంటుంది.

Advertisement

Read Also: Spotify సాంగ్స్ నేరుగా వాట్సాప్ స్టేటస్ పెట్టుకోవచ్చు, ఎలాగంటే?

రియల్, ఏఐ గుర్తించడం కష్టమే!

నానో బనానా 2 టూల్ మరింత కచ్చితత్వంతో కూడా ఫోటోలను అందిస్తుంది. ‘వసంత కాలంలో ఫ్యామిటీ టోక్యో పిక్ నిక్’, ‘స్ట్రీట్ వేర్ షూట్ ఇన్ బెర్లిన్’ లాంటి కమాండ్స్ తో అద్భుతమైన ఫోటోలను అందించనుంది. అంతేకాదు, ఆ ఫోటోలు నిజంగా తీసినవే అన్నట్లుగా కనిపించనున్నాయి. చూపరులను ఆకట్టుకునేలా ఉండబోతున్నాయి. అటు గూగుల్.. ఎడిట్ విత్ జెమిని అనే కొత్త ఫీచర్‌ను కూడా పరీక్షిస్తున్నట్లు తెలుస్తోంది. ఇది యూజర్లను మొదటి నుంచి ప్రారంభించకుండానే ఇప్పటికే ఉన్న ఫోటోలను ఎడిట్ చేయడానికి అనుమతిస్తుంది. బ్యాగ్రౌండ్, వేసుకున్న దుస్తులు,  లైటింగ్‌ను మార్చడం లాంటి చేసుకోవచ్చు.

Advertisement

Read Also: జియో యూజర్లకు గుడ్ న్యూస్.. AI, OTT బెనిఫిట్స్ తో 6 చీప్ అండ్ బెస్ట్ ప్లాన్స్ వచ్చేశాయ్!

Related News

నీళ్లు, చెత్తను ఒకేసారి శుభ్రం చేసే..అద్భుతమైన టూల్!

రూ.10వేలకే.. శామ్‌సంగ్ వాషింగ్ మెషీన్,ఆఫర్ కొన్ని రోజులే!

రూ.5,290 ధరకే 30W బేస్ స్మార్ట్ టీవీ..ఇక ఇల్లు దద్దరిల్లిపోవాల్సిందే !

రూ.7,490 కే 7.5 కేజీల కెపాసిటీనా? ఇంతమంచి వాషింగ్ మెషీన్ అస్సలు మిస్సవ్వొద్దు

చార్జింగ్ టెన్షన్ లేదు, లుక్ అద్దిరిపోతుంది.. ఈ ట్రెండింగ్ స్మార్ట్‌వాచ్ మీకోసమే!

రూ.34,999 ధరకే హై-ఎండ్ ఫీచర్లా? ఈ లేటెస్ట్ ఫిలిప్స్ టీవీ అదుర్స్!

ఒకసారి ఛార్జ్ చేస్తే రోజుల తరబడి నాన్‌స్టాప్ మ్యూజిక్.. ధర వింటే ఆశ్చర్యపోతారు!

8 గంటలకు పైగా బ్యాకప్ ఇచ్చే.. టాప్ 5 ల్యాప్‌టాప్‌లు ఇవే!

Big Stories

Advertisement
×