Meenakshi Chowdary: మీనాక్షి చౌదరి ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీ తో పాటు నార్త్ ఇండస్ట్రీలో కూడా అవకాశాలను అందుకుంటూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇచ్చట వాహనములు నిలపరాదు అనే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్గా పరిచయమైన ఈమె అనంతరం పలు సినిమాలలో నటిస్తూ ప్రేక్షకుల ముందుకు వచ్చారు అయితే మీనాక్షి చౌదరి (Meenakshi Chowdary)నటించిన సంక్రాంతికి వస్తున్నాం, లక్కీ భాస్కర్, గుంటూరు కారం వంటి సినిమాలు మంచి సక్సెస్ అందుకున్నాయి. ఈ క్రమంలోనే ప్రస్తుతం బాలీవుడ్ అవకాశాలను కూడా అందుకుంటూ వరుస సినిమా పనులలో బిజీగా ఉన్నారు.
ఇలా కెరియర్ పరంగా ఎంతో బిజీగా గడుపుతున్న మీనాక్షి చౌదరి తాజాగా ఒక ఇంటర్వ్యూ సందర్భంగా తన కెరీర్ గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. సినిమా ఇండస్ట్రీలో నటించే నటీనటులకు వయసుతో సంబంధం ఉండదని తెలిపారు. తనకంటే వయసులో పెద్దవాళ్ళైన హీరోలతో సినిమాలు చేయడానికి తనకు ఎలాంటి ఇబ్బంది లేదని కథ నచ్చితే తాను పెద్ద హీరోలతో సినిమాలు చేయటానికి వెనుకడుగు వేయనని తెలిపారు. అంతేకాకుండా తల్లి పాత్రలలో(Mother Roles) నటించడం గురించి కూడా ఈ సందర్భంగా మాట్లాడారు.
తాను పిల్లలకు తల్లి పాత్రలలో నటించే అవకాశాలు వస్తే కనుక నిర్మొహమాటం లేకుండా ఇలాంటి పాత్రలలో తాను నటించనని చెప్పేస్తాను అంటూ మీనాక్షి చౌదరి తెలిపారు. ఇటీవల ఈమె నటుడు దుల్కర్ సల్మాన్ తో కలిసి లక్కీ భాస్కర్ సినిమాలో చిన్నపిల్లడికి తల్లి పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే . అయితే ఆ కథ డిమాండ్ చేయడం కథ అద్భుతంగా ఉన్న నేపథ్యంలోనే తాను తల్లిగా నటించానని, ఇకపై ఇలాంటి పాత్రలలో నటించే అవకాశం వస్తే తాను రిజెక్ట్ చేస్తానని తెలిపారు. ఇటీవల మీనాక్షి చౌదరి వ్యక్తిగత జీవితం గురించి ఎన్నో రకాల వార్తలు బయటకు వచ్చాయి.
నేనే అన్ని విషయాలు చెబుతా..
ఈమె అక్కినేని హీరోతో రిలేషన్ లో ఉన్నారంటూ వార్తలు హల్చల్ చేస్తున్న నేపథ్యంలో పరోక్షంగా ఈ వార్తలను కూడా ఖండించారు. ఇటీవల నాకు సంబంధించిన ఎన్నో విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే నాకు సంబంధించిన ఏ విషయమైనా నేనే అధికారికంగా వెల్లడిస్తానని అలా కాకుండా సోషల్ మీడియాలో నా గురించి వచ్చే వార్తలను నమ్మదు అంటూ క్లారిటీ ఇచ్చారు. ఇక సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ సమయంలో బాగా ఎంజాయ్ చేశానని తెలిపారు. ఇక త్వరలోనే మెగాస్టార్ చిరంజీవి నటించిన విశ్వంభర సినిమా ద్వారా కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా తన కెరియర్ లోనే బెస్ట్ సినిమాగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక ప్రస్తుతం ఈమె కార్తీక్ దండు నాగచైతన్య కాంబినేషన్లో రాబోతున్న సినిమాలో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఈమె పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదల చేశారు.
Also Read: Vijay -Prakash Raj: CID ముందు హాజరైన విజయ్ దేవరకొండ.. ప్రకాష్ రాజ్..ఎందుకంటే!