WhatsApp Location: ప్రస్తుంతం దాదాపు అందరి చేతుల్లో నూ మెబైల్ ఫోన్లు అతుక్కపోయి ఉంటున్నాయి. ఇక వాట్సప్ గురించి అయితే చెప్పనవసరం లేదు. వాట్సాప్‌లో ‘లైవ్ లోకేషన్’ ఫీచర్ ద్వారా మనం ఎక్కడున్నామో ఇతరులకు రియల్ టైమ్‌లో చూపించవచ్చు. అయితే, కొన్నిసార్లు పొరపాటున ఎవరికైనా షేర్ చేసినా లేదా ఎవరైనా మన ఫోన్ తీసుకుని రహస్యంగా ఈ ఆప్షన్ ఆన్ చేసినా మీ ప్రైవసీకి భంగం వాటిల్లుతుంది. దీని నుంచి ఎలా తప్పించుకోవాలంటే?
Read also-మొబైల్ వినియోగదారులకు అదిరిపోయే న్యూస్.. తగ్గనున్న రీఛార్జ్ భారం!
ముందుగా మీ ఫోన్‌లో WhatsApp ఓపెన్ చేయండి.
కుడివైపు పైన ఉన్న మూడు చుక్కల మెనూ (Settings) పై క్లిక్ చేయండి.
అందులో Privacy (ప్రైవసీ) విభాగాన్ని ఎంచుకోండి.
ప్రైవసీ సెట్టింగ్స్‌లో కిందకు స్క్రోల్ చేస్తే మీకు Live Location అనే ఆప్షన్ కనిపిస్తుంది.
దానిపై క్లిక్ చేయగానే, ప్రస్తుతం మీరు ఏయే వ్యక్తులకు లేదా గ్రూపులకు మీ లోకేషన్‌ను షేర్ చేస్తున్నారో అక్కడ జాబితా కనిపిస్తుంది.
ఒకవేళ మీరు ఎవరికీ షేర్ చేయకపోతే, అక్కడ ‘None’ అని చూపిస్తుంది. అలా ఉంటే మీరు సురక్షితంగా ఉన్నట్లే.
Read also-మామిడి పండు, కొబ్బరితో షుగర్ ఫ్రీ ఐస్‌క్రీం.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసేయండి
ఒకవేళ ‘Live Location’ జాబితాలో మీకు తెలియని వ్యక్తులు లేదా మీరు షేర్ చేయకూడదు అనుకున్న పేర్లు కనిపిస్తే, వెంటనే ఈ క్రింది విధంగా చేయండి.
అదే పేజీలో కింద ఎరుపు రంగులో ఉన్న ‘Stop Sharing’ బటన్‌పై క్లిక్ చేయండి.
దీనితో ఒక్క సెకనులో మీ లోకేషన్ ట్రాకింగ్ నిలిచిపోతుంది.
మీ వాట్సాప్ అకౌంట్ హ్యాక్ అవ్వకుండా ఉండాలంటే.. కేవలం లోకేషన్ మాత్రమే కాదు, మీ చాట్స్ కూడా ఇతరులు చూడకుండా ఉండాలంటే ఈ రెండు విషయాలు తప్పనిసరిగా గమనించండి.
లింక్డ్ డివైజెస్ (Linked Devices): వాట్సాప్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి ‘Linked Devices’ ఆప్షన్ చూడండి. అక్కడ మీకు తెలియని కంప్యూటర్ లేదా వేరే ఫోన్ లాగిన్ అయి ఉంటే, వెంటనే దానిపై క్లిక్ చేసి ‘Logout’ చేయండి.
టూ-స్టెప్ వెరిఫికేషన్ (Two-Step Verification): సెట్టింగ్స్ > అకౌంట్ > టూ-స్టెప్ వెరిఫికేషన్ ఆన్ చేసుకోండి. దీనివల్ల మీ సిమ్ కార్డు వేరే ఎవరి దగ్గర ఉన్నా, మీ అకౌంట్ ఓపెన్ చేయడం సాధ్యం కాదు.
మీ ఫోన్ పాస్‌వర్డ్ లేదా వాట్సాప్ ఫింగర్‌ప్రింట్ లాక్ ఎవరికీ తెలియకుండా చూసుకోండి. భద్రత విషయంలో అప్రమత్తంగా ఉండటమే అన్నిటికంటే ఉత్తమమైన మార్గం.