E-Paper
Advertisement

Aryan Rajesh:ఇండస్ట్రీకి దూరంగా ఆర్యన్ రాజేష్.. అసలు కారణం చెప్పిన నరేష్!

Aryan Rajesh:ఇండస్ట్రీకి దూరంగా ఆర్యన్ రాజేష్.. అసలు కారణం చెప్పిన నరేష్!
Advertisement

Aryan Rajesh: సినిమా ఇండస్ట్రీలో ఒకానొక సమయంలో వరుస సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను మెప్పించిన కొంతమంది హీరోలు కొన్ని కారణాలవల్ల ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. ఇలా స్టార్ డైరెక్టర్ వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎన్నో సూపర్ హిట్ కామెడీ సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించిన వారిలో ఆర్యన్ రాజేష్(Aryan Rajesh) ఒకరు. దర్శకుడు ఇవివి సత్యనారాయణ కుమారులుగా ఆర్యన్ రాజేష్, అల్లరి నరేష్(Allari Naresh) ఇండస్ట్రీలోకి హీరోలుగా అడుగు పెట్టారు. ఇక వీరిద్దరూ వరుస సినిమాలలో నటిస్తూ ఒకానొక సమయంలో పెద్ద ఎత్తున సినిమాలు ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ప్రస్తుతం అల్లరి నరేష్ ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతూ ఉండగా ఆర్యన్ రాజేష్ మాత్రం ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు.

ఇండస్ట్రీకి దూరమైన ఆర్యన్ రాజేష్..

ఆర్యన్ రాజేష్ హీరోగా సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు అయితే ఈయన విలన్ పాత్రలలో నటించడానికి ఆసక్తి చూపుతున్నారని తన సెకండ్ ఇన్నింగ్స్ విలన్ గా కనిపించబోతున్నారు అంటూ వార్తలు వచ్చాయి. ఇక బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ చరణ్ నటించిన వినయ విధేయ రామ సినిమాలో కూడా రామ్ చరణ్ కు అన్నయ్య పాత్రలో కనిపించారు. ఈ సినిమాలో నటించిన సినిమా పెద్దగా సక్సెస్ కాకపోవడంతో ఆర్యన్ రాజేష్ కి కూడా ఎలాంటి గుర్తింపు లభించలేదు. అయితే తాజాగా అల్లరి నరేష్ 12 A రైల్వే కాలనీ(12A Railway Colony) ప్రమోషన్లలో భాగంగా తన అన్నయ్య ఇండస్ట్రీకి దూరం కావడానికి గల కారణాలను తెలిపారు.

ఫ్లాప్ సినిమాలే కారణమా?

Advertisement

ఆర్యన్ రాజేష్ తనలాగా అందరితో కలిసిపోయే స్వభావం కల వ్యక్తి కాదని తెలిపారు. చాలా రిజర్వ్డ్ గా ఉంటారు. తనకు ఎంత అవసరమో అంతే మాట్లాడతారు. ఇక సినిమాల విషయానికి వస్తే సినిమా అవకాశం రావాలి అంటే ముందు సినిమాల మార్కెట్, ఆ సినిమా సక్సెస్ రేట్ దృష్టిలో పెట్టుకుంటారు. అలా రాజేష్ నటించిన వరుస సినిమాలు పెద్దగా ఆకట్టుకోలేకపోవడంతో కాస్త గ్యాప్ వచ్చిందని, ఆ గ్యాప్ అలా పెరగడంతో ఇండస్ట్రీకి కాస్త దూరమయ్యారని వెల్లడించారు. మంచి పాత్రలలో అవకాశం వస్తే నటించడానికి రాజేష్ సిద్ధంగా ఉన్నారని తెలిపారు.

తల్లికి దూరంగా అల్లరి నరేష్..

Advertisement

ఈ విధంగా ఆర్యన్ రాజేష్ ఇండస్ట్రీకి దూరంగా ఉండడానికి గల కారణాలను తెలియజేసిన నరేష్ తన అమ్మ నుంచి వేరుగా ఉండడం గురించి కూడా క్లారిటీ ఇచ్చారు. తన అమ్మతో నరేష్ కుటుంబం కలిసి ఉన్నప్పటికీ ఇటీవల తన అమ్మ నుంచి వేరుగా ఉన్నారని తెలిపారు. అయితే పాప స్కూల్ కోసమే తాము ఇల్లు షిఫ్ట్ అయ్యామని త్వరలోనే అమ్మ కూడా మా దగ్గరికి వస్తుంది అంటూ క్లారిటీ ఇచ్చారు. ఇక ఈయన హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన 12 A రైల్వే కాలనీ సినిమా అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేక పోయిందని చెప్పాలి. హిట్టు, ఫ్లాప్ సినిమాలతో సంబంధం లేకుండా నరేష్ సెకండ్ ఇన్నింగ్స్ లో వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.

Also Read: Raviteja Daughter: కొడుకేమో అసిస్టెంట్ డైరెక్టర్… కూతురేమో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్..

Related News

నాగార్జున ‘కింగ్ 100’ నుంచి దసరా సర్‌ప్రైజ్.. అదేంటో తెలుసా ?

బాలీవుడ్‌లో కాల్పుల కలకలం.. టైగర్ ష్రాఫ్‌కు ఏమైంది?

40 ఏళ్ల తర్వాత కాశీకి వెళ్లిన రేణు దేశాయ్.. అక్కడ ఏం జరిగిందంటే?

విజయ్ యాక్షన్‌కు ఫిదా అయిన సందీప్ వంగా.. ఆర్జీవీ రియాక్షన్ మామూలుగా లేదుగా!

బాలు సినిమాలో పవన్ వేసుకున్న ప్యాంట్స్ వెనుక ఇంత కథ ఉందా?

పవన్ కళ్యాణ్‌తో విడిపోయాక నా పరిస్థితి ఇదే.. రేణు దేశాయ్ కామెంట్స్!

నవరాత్రుల వేళ హెబ్బా పటేల్ స్పెషల్ ట్రీట్..ఫ్యాన్స్‌కు కనువిందే!

జ్యోతి పూర్వజ్, పూర్వాజ్ మూవీ ‘కిల్లర్’.. ఒకేసారి రెండు అప్డేట్స్!

Big Stories

Advertisement
×