E-Paper
Advertisement

Raviteja Daughter: కొడుకేమో అసిస్టెంట్ డైరెక్టర్… కూతురేమో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్..

Raviteja Daughter: కొడుకేమో అసిస్టెంట్ డైరెక్టర్… కూతురేమో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్..
Advertisement

Raviteja Daughter: సినిమా ఇండస్ట్రీలో వారసుల పరంపర కొనసాగడం సర్వసాధారణం. ఇప్పటికే ఎంతోమంది హీరోల వారసులు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉండగా మరి కొంతమంది అసిస్టెంట్ డైరెక్టర్స్ గా హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. అలాగే మరికొంతమంది వారసురాళ్లు నిర్మాతలుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా మంచి సక్సెస్ అందుకున్న రవితేజ వారసులు కూడా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

అసిస్టెంట్ డైరెక్టర్ గా మహాధన్…

రవితేజకు కుమారుడు మహాదన్(Mahadhan), కూతురు మోక్షధ(Mokshadha) ఉన్న సంగతి తెలిసిందే. రవితేజ కొడుకు మహాదన్ ఇప్పటికే బాలనటుడిగా రాజా ది గ్రేట్ సినిమాలో చిన్నప్పటి రవితేజ పాత్రలో నటించే ప్రేక్షకులను మెప్పించారు. అయితే ప్రస్తుతం ఈ కుర్రాడు అసిస్టెంట్ డైరెక్టర్గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈయన సందీప్ రెడ్డి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న స్పిరిట్ సినిమాతో పాటు వెంకీ అట్లూరి డైరెక్షన్ లో సూర్య నటిస్తున్న సినిమాకి కూడా అసిస్టెంట్ డైరెక్టర్ గా వ్యవహరించబోతున్నారు. ఇలా కొడుకు అసిస్టెంట్ డైరెక్టర్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వగా కూతురు మోక్షద మాత్రం నిర్మాతగా ఎంట్రీ ఇవ్వనున్నారు.

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా మోక్షద…

Advertisement

రవితేజ కుమార్తె మోక్షద గురించి కూడా అందరికీ ఎంతో సుపరిచితమే ఈమె ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టబోతున్నారని తెలుస్తోంది. తన తండ్రి రవితేజ హీరోగా డైరెక్టర్ శివ నిర్వాణ (Siva Nirvana)దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమాకు మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలుగా వ్యవహరించబోతున్నారు. ఇక మోక్షద ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించబోతున్నారు. ఇక ఈ సినిమాలో రవితేజకు జోడిగా నటి ప్రియా భవాని శంకర్ (Priya Bhavani Shankar)నటిస్తున్నారు.

రవితేజకు జోడిగా ప్రియా భవాని శంకర్..

Advertisement

ఇక ఈ సినిమాకు కాంతార ఫేమ్ సంగీత దర్శకుడు అజనీష్ లోకనాథ్ సంగీతం అందించబోతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులలో ఉన్నారు త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ పనులు ప్రారంభం కానున్నాయి. అయితే ఈ సినిమాలో ముందుగా హీరోయిన్ గా సమంత నటించబోతున్నారు అంటూ పెద్ద ఎత్తున వార్తలు వినిపించాయి కానీ చిత్ర బృందం మాత్రం నటి ప్రియా భవాని శంకర్ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఇక త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళబోతుంది. ఇటీవల కాలంలో రవితేజ వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్న పెద్దగా సక్సెస్ మాత్రం అందుకోలేకపోతున్నారు. మాస్ జాతర సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన రవితేజ 2026 సంక్రాంతి పండుగ సందర్భంగా భర్త మహాశయులకు విజ్ఞప్తి అనే సినిమా ద్వారా మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. మరి ఈ సినిమా రవితేజకు ఎలాంటి సక్సెస్ అందిస్తుందో తెలియాల్సి ఉంది.

Also Read: Krithi Shetty : టైం పాస్ కోసం వెళితేలో లక్కీగా… ఫస్ట్ మూవీ ఛాన్స్‌పై కృతి శెట్టి ఓపెన్

Related News

‘గరివిడి లక్ష్మి’లో ఆర్పీ పట్నాయక్ పాత్ర వెనుక అసలు కథ ఇదేనా?

క్యాస్టింగ్ కౌచ్‌పై ఝాన్సీ ఏమన్నారంటే.. ఇండస్ట్రీలో మహిళల పరిస్థితి ఇదేనా?

యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న ‘హైకూ’.. అక్టోబర్ 23న థియేటర్లలోకి!

మాల్దీవుల్లో ఖుషీ కపూర్ అందాల సందడి.. ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్!

రామాయణంపై రాజమౌళి పోస్ట్.. ఏమన్నారంటే!

విజయ్ దేవరకొండ, రష్మికతో మధ్యప్రదేశ్ సీఎం.. అసలు విషయం ఇదే!

మహిళా కథ అనగానే నో చెప్పారు.. చివరికి అదే సినిమాతో సక్సెస్!

సలార్‌లో ఛాన్స్ కోసం ఝాన్సీ ఏం చేశారో తెలుసా?

Big Stories

Advertisement
×