బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్
Advertisement

ప్రేమలు ఓయో రూముల్లోనే ఎండ్ అవుతున్నాయి.. అల్లు అరవింద్ బోల్డ్ కామెంట్స్.

ప్రేమలు ఓయో రూముల్లోనే ఎండ్ అవుతున్నాయి.. అల్లు అరవింద్ బోల్డ్ కామెంట్స్.

Allu Aravind’s Viral Comments: అల్లు అరవింద్… గీతా ఆర్ట్స్ అధినేతగా టాలీవుడ్ లో మంచి పేరు తెచ్చుకున్న ఈ స్టార్ ప్రొడ్యూసర్ ప్రెసెంట్ జెనరేషన్ లవ్ స్టోరీస్ పై చేసిన కామెంట్స్ ఇపుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఇప్పుడున్న జెనరేషన్ లవ్ గురించి  చేసిన కామెంట్స్  ఫిలిమ్ సర్కిల్స్ లోనే కాకుండా యూత్ లోనూ హాట్ టాపిక్‌గా మారాయి.

ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. ఈ మధ్య కాలంలో యూత్ ఫుల్ కంటెంట్‌తో సినిమాలు బాగానే వస్తున్నాయి. ఈ క్రమంలోనే సరికొత్త లవ్ అండ్ ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న “దీవాన” అనే చిత్రంపై టాలీవుడ్‌లో మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను చిత్ర యూనిట్ తాజాగా హైదరాబాద్‌లో చాలా గ్రాండ్‌గా నిర్వహించింది. ఈ వేడుకకు అల్లు అరవింద్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ట్రైలర్ లాంచ్ చేసిన అనంతరం ఆయన స్టేజ్ పైకి వచ్చి మాట్లాడిన మాటలు అందరినీ ఆశ్చర్యపరిచాయి.

ఓయో రూముల్లోనే  లవ్ స్టోరీలకి ఎండ్ కార్డ్

ఈ రోజుల్లో లవ్ అంటే ఏంటో చెప్తాను వినండి అంటూ అల్లు అరవింద్ తనదైన శైలిలో చెప్పుకొచ్చారు. నేటి తరం ప్రేమికులు సినిమా చూడటానికి థియేటర్లకు వెళ్తున్నారు కానీ, అక్కడ సినిమా చూడటం లేదని అన్నారు. జనాలు పెద్దగా లేని థియేటర్లను వెతుక్కుని మరీ వెళ్లి, ఎవరికీ కనిపించని ఆ చివరి కార్నర్ సీట్లలో కూర్చొని సినిమాను ఎంజాయ్ చేస్తున్నారని తెలిపారు.ఇక అంతటి తో ఆగకుండా ఒక రెండు షాపింగులు చేసి, ఆ తర్వాత డైరెక్ట్ గా ఓయో రూముల్లోకి వెళ్లి తమ లవ్ స్టోరీలకి ఎండ్ కార్డ్ వేసుకుంటున్నారని సెన్సేషన్ కామెంట్స్ వదిలారు.

also read :అరిచే కుక్కలు కరవవు.. ‘పోలీస్ కంప్లైంట్’ డైరెక్టర్‌కు వరలక్ష్మి శరత్ కుమార్ పవర్‌ఫుల్ పంచ్!

అల్లు అరవింద్ అంత సీరియస్‌గా ప్రాక్టికల్ విషయాలు మాట్లాడుతుంటే, పక్కనే ఉన్న టాలీవుడ్ మాస్ కా దాస్, హీరో విశ్వక్ సేన్ మాత్రం అసలైన ఎంటర్‌టైన్‌మెంట్ అందించారు. అరవింద్ మాటలు వినగానే విశ్వక్ సేన్ వెంటనే మైక్ అందుకుని, “అంటే ఏంటి సార్.. నాకేమీ తెల్వదు.. ఓయో అంటే ఏంటి?” అంటూ చాలా అమాయకంగా ఫన్నీ ఎక్స్‌ప్రెషన్స్ ఇచ్చారు. దీంతో స్టేజ్ మీదున్న వారితో పాటు ఆడిటోరియంలో ఉన్న వారంతా ఒక్కసారిగా నవ్వేశారు. దీంతో అల్లు అరవింద్ మాట్లాడుతూ ఇంత అరుస్తున్నారంటే ఇంకా తెలీకపోవడం ఏంటి ?అంటూ తానూ కూడా నవ్వేశాడు.

ఈ  కామెంట్స్ సినిమాకి ఏమైనా టికెట్స్ తెంచుతాయా?

నిజానికి అల్లు అరవింద్ యూత్ అండ్ ట్రెండ్స్‌పై ఇలాంటి బోల్డ్ కామెంట్స్ చేయడం ఇది కొత్తేమీ కాదు.గతంలో “బేబీ” సినిమా సమయంలోనూ నేటి తరం రిలేషన్‌షిప్స్ ఎలా ఉంటున్నాయనే దానిపై కూడా ఇలాగే మాటలతో మంటలు పుట్టించాడు. ఇప్పుడు “దీవాన” ఈవెంట్‌లో ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా నేటి సమాజంలో జరుగుతున్న వాస్తవాలనే రిఫ్లెక్ట్ చేస్తుందని కొందరు నెటిజన్లు సపోర్ట్ చేస్తుంటే, మరికొందరు మాత్రం సీనియర్ ప్రొడ్యూసర్ ఇంత ఓపెన్‌గా మాట్లాడటం క్రేజీగా ఉందంటున్నారు. ఏదేమైనా విశ్వక్ సేన్ తనదైన స్టైల్లో రియాక్ట్ అవ్వడం వల్ల ఈ ఇష్యూ మరింత వైరల్ అయింది.చూడాలి మరి అల్లు వారి ఈ క్రేజీ కామెంట్స్ సినిమాకి ఏమైనా టికెట్స్ తెంచుతాయో లేదో !

also read :కొత్త ఇల్లు కొన్న యానిమల్ బ్యూటీ.. ఎన్ని కోట్లో తెలుసా..?

Related News

4 నిమిషాల నాన్‌స్టాప్ కామెడీ.. అక్షయ్ ‘వెల్‌కమ్ టు ది జంగిల్’ ట్రైలర్ సెన్సేషన్..

బాలయ్య సినిమాలో పవర్‌ఫుల్ విలన్‌గా రాజశేఖర్?.. కొరటాల శివ స్కెచ్ మామూలుగా లేదుగా!

అరిచే కుక్కలు కరవవు.. ‘పోలీస్ కంప్లైంట్’ డైరెక్టర్‌కు వరలక్ష్మి శరత్ కుమార్ పవర్‌ఫుల్ పంచ్!

టాలీవుడ్‌లోకి మరో కొత్త దర్శకుడు.. హీరోగా ఉంటూనే మరో కొత్త ప్రయోగం..

గీతా ఆర్ట్స్ నుంచి ‘దీవానా’ ట్రైలర్ వచ్చేసింది.. మరో రూటెడ్ లవ్ స్టోరీ..

సోషల్ మీడియా ట్రోలర్స్‌కు నటి హేమ షాక్.. సీపీ సజ్జనార్‌కు ఫిర్యాదు!

సరిహద్దు వద్ద ఏఆర్ రెహమాన్‌లను కలిసిన పాకిస్థానీ అభిమాని.. ఎమోషనల్ పోస్ట్ వైరల్!

×