E-Paper
Advertisement

కొత్త ఇల్లు కొన్న యానిమల్ బ్యూటీ.. ఎన్ని కోట్లో తెలుసా..?

కొత్త ఇల్లు కొన్న యానిమల్ బ్యూటీ.. ఎన్ని కోట్లో తెలుసా..?

Triptii Home: తృప్తి డిమ్రి..బాలీవుడ్ వెండితెరపై ఒక్కసారిగా తుఫానులా దూసుకొచ్చిన నటి.ముఖ్యంగా బుల్బుల్ ,ఖలా సినిమాలతో సత్తా చాటిన ఈ అమ్మడు 2023 డిసెంబర్‌లో విడుదలైన సందీప్ రెడ్డి వంగా సంచలన చిత్రం ‘యానిమల్’ ఆమె కెరీర్‌ను పూర్తిగా మార్చేసింది. ఆ సినిమాలో జోయా పాత్రలో ఆమె నటనాకి, గ్లామర్ కి యూత్ ఫిదా అయిపొయింది.అలా రాత్రికి రాత్రే ‘నేషనల్ క్రష్’గా మారిపోయిన ఈ ఉత్తరాఖండ్ బ్యూటీ, వరుస అవకాశాలతో బాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారిపోయింది,

ఇక 2024లో విక్కీ కౌశల్‌తో కలిసి నటించిన ‘బ్యాడ్ న్యూజ్’ సినిమాతో పాటు రాజ్‌కుమార్ రావుతో చేసిన ‘విక్కీ విద్యా కా వో వాలా వీడియో’ చిత్రాలు ఆమె క్రేజ్‌ను మరింత పెంచేశాయి.ఇక ఇదే క్రమంలో సందీప్ వంగా , ప్రభాస్ కాంబోలో వస్తున్న స్పిరిట్ లో కూడా ఈ అమ్మడే అని స్పెషల్ గా చెప్పక్కర్లేదు.అలా వరుస క్రేజీ ప్రాజెక్ట్ లతో సత్తా చాటుతున్న తృప్తి ఇపుడు తనదైన లగ్జరీ హౌస్ తో మరోసారి వార్తల్లో నిలిచింది.

14 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో కొన్న ఇల్లు

మాములుగా సెలెబ్రిటీల ఇళ్ళు అనగానే  సెలబ్రిటీల ఇళ్లు అనగానే ఆడంబరాలు, మిరుమిట్లు గొలిపే లైటింగ్, ఖరీదైన షోపీస్‌లు గుర్తుకొస్తాయి. కానీ తృప్తి డిమ్రి అభిరుచి మాత్రం చాలా భిన్నంగా, ప్రశాంతంగా ఉంటుంది. ముంబైలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన, తారల నిలయమైన బాంద్రా వెస్ట్ ఏరియాలో  ఆమె ఒక అద్భుతమైన ఇల్లు కొనుగోలు చేశారు. సుమారు 14 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో కొన్న ఈ ఇల్లు ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.

also read :‘రాకా’ కోసం వెయిటింగ్…బన్నీ ట్వీట్‌కు చరణ్ క్రేజీ రిప్లై!

ఈ ఇంటి లివింగ్ రూమ్‌లోకి అడుగుపెట్టగానే ఒక కొత్త ప్రపంచంలోకి వెళ్లిన అనుభూతి కలిగుతుంది.మాములుగా  వాడే రంగులకు భిన్నంగా ఇక్కడ పిస్తా-గ్రీన్ కలర్ సోఫాను సెట్ చేశారు. దీనికి కాంబినేషన్‌గా గోడలకు లేత గులాబీ రంగు వేయడం విశేషం. ఈ రెండు రంగుల కలయిక గదికి ఒక క్లాసిక్ మరియు మోడర్న్ లుక్‌ను తీసుకొచ్చింది. పైగా రోజంతా ఇంట్లోకి సహజమైన సూర్యరశ్మి వచ్చేలా ఇక్కడ భారీ గాజు కిటికీలను డిజైన్ చేశారు. పగటిపూట ఎలాంటి లైట్లు లేకుండానే ఇల్లంతా ప్రకృతిсиద్ధమైన వెలుతురుతో, గాలితో కళకళలాడుతూ ఉంటుంది. ఈ కిటికీల నుండి చూస్తే ముంబై సిటీ బ్యూటీ కనిపిస్తుంది.

స్విమ్మింగ్ పూల్ ఈ ఇంటికి ప్రధాన ఆకర్షణ

షూటింగ్‌లతో నిరంతరం బిజీగా ఉండే తృప్తి, మానసిక ప్రశాంతతకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. అందుకే తన ఇంట్లో ఒక ప్రత్యేకమైన వెల్‌నెస్ స్పేస్‌ను క్రియేట్ చేసుకున్నారు. పచ్చని చెట్ల మధ్య ఉండే ప్రశాంతమైన స్విమ్మింగ్ పూల్ ఈ ఇంటికి ప్రధాన ఆకర్షణ. ఆమె ప్రతిరోజూ ఉదయం ఇక్కడే యోగా మరియు ధ్యానం చేస్తూ గడుపుతారట. ప్రకృతితో ముడిపడి ఉండటం ఆమెకు ఇష్టం కావడంతో బాల్కనీతో పాటు ఇంటి లోపల, బయట కూడా రకరకాల ఇండోర్ ప్లాంట్స్, కుండీలను అమర్చారు. ఇవి కేవలం అలంకరణ కోసమే కాకుండా ఇంట్లోని వాతావరణాన్ని ఎప్పుడూ తాజాగా ఉంచడానికి ఎంతగానో ఉపయోగపడతాయి అనడంలో ఆశ్చర్యం లేదు.

కాస్ట్లీ హౌస్ తో మరోసారి వార్తల్లో నిలిచిన బ్యూటీ 

ఇక తృప్తి పర్సనల్ స్పేస్ అయిన బెడ్‌రూమ్ విషయానికి వస్తే, ఇది పూర్తిగా ఎర్తీ టోన్స్ (మట్టి రంగులు) మరియు సాఫ్ట్ టెక్స్చర్స్ చుట్టూ తిరుగుతుంది. ఎక్కడా హడావుడి లేకుండా, కేవలం రిలాక్సేషన్ మాత్రమే ఇచ్చేలా సింపుల్ ఫర్నిచర్‌ను ఎంచుకున్నారు. లగ్జరీ అంటే ఎక్కువ వస్తువులు పెట్టడం కాదు, ఉన్న స్పేస్‌ను ఎంత కంఫర్ట్‌గా వాడుకుంటాం అనేదానికి ఈ బెడ్‌రూమ్ ఒక ఉదాహరణ. బ్యాక్ టు బ్యాక్ బిజీ ప్రాజెక్టులతో అలసిపోయే తృప్తికి, రీఛార్జ్ అవ్వడానికి ఈ గది ఒక పర్ఫెక్ట్ హెవెన్ అని చెప్పవచ్చు.మొత్తానికి సినిమాలతో సత్తా చాటుతున్న ఈ బీ టౌన్ బ్యూటీ ఇపుడు ఇలా కాస్ట్లీ హౌస్ తో మరోసారి వార్తల్లో నిలిచిందన్న మాట !

also read :NBK111: ఎంట్రీ ఆఫ్ ఆన్ ఎరా.. బాలయ్య రౌద్రరూపం.. సోషల్ మీడియా షేక్!

Related News

రూ.కోటి తీసుకుని హ్యాండ్ ఇచ్చిన వరలక్ష్మీ శరత్ కుమార్? డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు

NBK111: ఎంట్రీ ఆఫ్ ఆన్ ఎరా.. బాలయ్య రౌద్రరూపం.. సోషల్ మీడియా షేక్!

‘రాకా’ కోసం వెయిటింగ్…బన్నీ ట్వీట్‌కు చరణ్ క్రేజీ రిప్లై!

వారణాసి’ తర్వాత బుచ్చిబాబుతో మహేష్ బాబు సినిమా?.. అదయ్యేపనేనా?

తొలిసారి పెదవి విప్పిన మెగా కూతురు శ్రీజ.. ఎమోషనల్ వీడియో వైరల్!

రణ్‌వీర్ సింగ్ బాక్సాఫీస్ సునామీ.. ‘పుష్ప-2’ రికార్డులను తిరగరాసిన ‘దురంధర్-2’

అల్లు అర్జున్‌ను అలా చూసి షాక్ అయ్యా.. వడ్డే నవీన్ ఆసక్తికర వ్యాఖ్యలు!

×