E-Paper
Advertisement

T20 World Cup 2026: వివాదంలో హర్మన్‌ప్రీత్ కౌర్..పాకిస్తాన్ కెప్టెన్ తో సెల్ఫీలు !

T20 World Cup 2026: వివాదంలో హర్మన్‌ప్రీత్ కౌర్..పాకిస్తాన్ కెప్టెన్ తో సెల్ఫీలు !
Advertisement

Women’s T20 World Cup 2026:  టీ20 ప్రపంచ కప్ 2026 మహిళల టోర్నమెంట్ కు (Women’s T20 World Cup 2026) కౌంట్ డౌన్ షురూ అయింది. ఈ మెగా టోర్నమెంట్ రేపటి నుంచి ప్రారంభం కానుంది. ఇంగ్లాండ్ వేదికగా జరగనున్న ఈ మహిళల టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ కోసం టీం ఇండియా సిద్ధమవుతోంది. ప్రస్తుతం వామప్ మ్యాచ్ లలో టీమిండియా అదరగొడుతూ.. టోర్నమెంట్ పై ఫోకస్ పెట్టింది. అయితే ఈ టోర్నమెంట్ రేపటి నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో.. టీమిండియా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ( Harmanpreet Kaur) సరికొత్త వివాదంలో చిక్కుకున్నారు. పాకిస్తాన్ కెప్టెన్ ఫాతిమా సనాతో ( Fatima Sana ) క్లోజ్ గా కనిపించిన హర్మన్‌ప్రీత్ కౌర్ పైన దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. పాకిస్తాన్ కెప్టెన్ ఫాతిమాతో హర్మన్‌ప్రీత్ కౌర్ సెల్ఫీ దిగే ప్రయత్నం చేసిందని కూడా విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆమెపై దేశ ద్రోహి ముద్ర వేస్తున్నారు.

Also Read: Manav Sutar’s career changed with superstition: మూఢనమ్మకాల‌తో మాన‌వ్ సుతార్ కెరీర్ ఛేంజ్…6 వికెట్లు తీసి 38 ఏళ్ల రికార్డ్ బ్రేక్ చేసిన‌ జ‌డేజా వార‌సుడు

వివాదంలో హర్మన్‌ప్రీత్ కౌర్..పాకిస్తాన్ కెప్టెన్ తో సెల్ఫీలు !

Advertisement

మహిళల టీ20 ప్రపంచకప్ 2026 టోర్నమెంట్ రేపటి నుంచి ప్రారంభం కానుంది. ఈ క్రమంలో తాజాగా కెప్టెన్ల ఫోటోషూట్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఈవెంట్ సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ బాస్ జై షా కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా పాకిస్తాన్ కెప్టెన్ ఫాతిమా సనాకు షేక్ హ్యాండ్ ఇచ్చి వివాదానికి తెర లేపారు. దీనిపై ఇప్పటికి కూడా పాకిస్తాన్ నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఇటు ఇండియన్స్ కూడా జై షాపై సీరియస్ అవుతున్నారు. అయితే ఈ సంఘటన మరువక ముందే టీమిండియా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ వివాదంలో చిక్కుకున్నారు. కెప్టెన్ల ఫోటో షూట్ అయిన తర్వాత అభిమానులందరికీ ఆటోగ్రాఫ్ లు ఇచ్చే ప్రయత్నం చేశారు అన్ని జట్ల కెప్టెన్లు. ఈ సందర్భంగా ఫాతిమా సనాతో చాలా క్లోజ్ గా మూవ్ అయ్యారు హర్మన్‌ప్రీత్ కౌర్. అంతేకాదు పాకిస్తాన్ కెప్టెన్ ఫాతిమా సనాతో సెల్ఫీ దిగుతున్నట్లుగా హర్మన్‌ప్రీత్ కౌర్ వీడియో బయటకు వచ్చింది.

దీంతో ఇండియన్ ఫ్యాన్స్ సీరియస్ అవుతున్నారు. ఇదెక్కడి దరిద్రం రా నాయనా.. పాకిస్తాన్ కెప్టెన్ స‌నా దగ్గర ఏముందని, సెల్ఫీ దిగుతున్నామని హర్మన్‌ప్రీత్ కౌర్ పైన ట్రోల్ చేస్తున్నారు. ఆమెను దేశ ద్రోహి అంటూ కామెంట్స్ కూడా చేస్తున్నారు. దీంతో ఈ సంఘటన హాట్ టాపిక్ అయింది. అయితే ఈ వీడియో చూసిన మరి కొంతమంది మాత్రం హర్మన్‌ప్రీత్ కౌర్ తప్పేం లేదని అంటున్నారు. అభిమానులతో సెల్ఫీ దిగింది తప్ప.. కావాలని ఫాతిమాతో దిగలేదని అంటున్నారు. అభిమానులతో సెల్ఫీ దిగే సమయంలో ఫాతిమానే మీద మీద పడిందని కౌంటర్ ఇస్తున్నారు. హర్మన్‌ప్రీత్ కౌర్ జోలికి వస్తే ఊరుకునేది లేదని వార్నింగ్ ఇస్తున్నారు.

Advertisement

 

Also Read: Litton Das ON T20 World Cup 2026 : పాకిస్తాన్ లో అడుగుపెట్టాలంటే గన్ మెన్లను పెట్టుకోవాల్సిందే..బంగ్లా క్రికెటర్ సంచలనం

 

Related News

సంజు కంటే అభిషేక్ శ‌ర్మ పెద్ద‌ పోటుగాడా? అంద‌రికీ ఒకే రూల్స్ ఉండాలి

పసికూన‌ జింబాబ్వే పైన గెలవడం కాదు…మ‌గాళ్లు అయితే మాపై గెల‌వండి!

పాకిస్తాన్ ఘోర అవ‌మానం…ఏ ఒక్క కామెంటేటర్ ను పిల‌వ‌ని వెస్టిండీస్‌

వైభ‌వ్ సెంచ‌రీ మిస్…టీమిండియా చేతిలో జింబాబ్వే వైట్ వాష్

Video: వైభవ్ సూర్యవంశీ భారీ సిక్సర్..స్టేడియం బయట పడ్డ బంతి

జింబాబ్వేను బెదిరించి సిరీస్ గెలుచుకున్నారు..త‌న్వీర్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనుక ధోని కుట్ర‌లు?

జింబాబ్వే బౌలర్లు స్లో బంతులు వేశారు…అందుకే టీమిండియా గెలుపు

Big Stories

Advertisement
×