BigTV English
Advertisement

Allu Arvind Mother Health: బిగ్ బ్రేకింగ్… అల్లు అరవింద్ తల్లికి తీవ్ర అస్వస్థత!

Allu Arvind Mother Health: బిగ్ బ్రేకింగ్… అల్లు అరవింద్ తల్లికి తీవ్ర అస్వస్థత!

Allu Arvind Mother Health..అల్లు అర్జున్ (Allu Arjun) నానమ్మ , అల్లు అరవింద్(Allu Aravindh) తల్లి అల్లు కనకరత్నం (Allu Kanaka Ratnam) తీవ్ర అస్వస్థతకు గురైనట్లు ఒక వార్త సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. ప్రస్తుతం ఆమె వయసు 94 సంవత్సరాలు కావడంతో.. కుటుంబ సభ్యులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వయసులో ఆమె అస్వస్థతకు గురికావడంతో వెంటనే కుటుంబ సభ్యులు అప్రమత్తమై.. ఫ్యామిలీ డాక్టర్ పర్యవేక్షణలో ఇంట్లోనే ఆమెకు ప్రత్యేకంగా ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నట్లు సమాచారం.. ప్రస్తుతం తన నానమ్మకు అస్వస్థతగా ఉందని సమాచారం అందడంతో అట్లీ (Atlee ) సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న అల్లు అర్జున్ హుటాహుటిన ఇంటికి బయలుదేరినట్లు సమాచారం. ఇక ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది.


అల్లు రామలింగయ్య శత జయంతి వేడుకల్లో కనిపించిన అల్లు కనకరత్నం..

దివంగత దిగ్గజ హాస్యనటులు అల్లు రామలింగయ్య (Allu Ramalingaiah) సతీమణిగా పేరు సొంతం చేసుకున్న ఈమె గత రెండు సంవత్సరాల క్రితం జరిగిన అల్లు రామలింగయ్య శత సంవత్సర పురస్కారం సందర్భంగా ఒక గ్రాండ్ ఈవెంట్ నిర్వహించగా.. ఆ కార్యక్రమానికి మాత్రమే ఈమె హాజరయ్యారు. ఇక అప్పటినుంచి మీడియా ముందు కనిపించలేదు. ఇప్పుడు ఇలా అస్వస్థతకు గురైనట్లు వార్తలు రావడంతో అటు అల్లు అభిమానులు ఇటు మెగా అభిమానులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


అల్లు కనకరత్నం వారసులు..

అల్లు రామలింగయ్య – అల్లు కనక రత్నం దంపతులకు అల్లు అరవింద్, కొనిదెల సురేఖ పిల్లలు అన్న విషయం అందరికీ తెలిసిందే. కొణిదెల సురేఖ(Surekha Konidela), మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi ) సతీమణిగా గుర్తింపు తెచ్చుకోగా టాలీవుడ్ లో బడా నిర్మాతగా అల్లు అరవింద్ పేరు సొంతం చేసుకున్నారు.

Also read: Film industry: ఇండస్ట్రీలో విషాదం.. వింతవ్యాధితో నటుడు మృతి!

అల్లు అర్జున్..

అల్లు అరవింద్ రెండవ కుమారుడిగా పేరు సొంతం చేసుకున్న అల్లు అర్జున్ (Allu Arjun) నేడు పాన్ ఇండియా స్టార్ గా చలామణి అవుతున్న విషయం తెలిసిందే. పుష్ప, పుష్ప 2 చిత్రాలతో భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న ఈయన.. ఏకంగా నేషనల్ అవార్డు అందుకున్నారు. ప్రస్తుతం కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ (Atlee) దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాను హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కించబోతున్నారు. హాలీవుడ్ సినిమాలకు పనిచేసిన విఎఫ్ఎక్స్ కంపెనీలను రంగంలోకి దింపారు. సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. మొత్తానికి అయితే కోలీవుడ్ ప్రొడక్షన్ సంస్థలో, కోలీవుడ్ డైరెక్టర్ నిర్మిస్తున్న చిత్రంలో బన్నీ నటిస్తున్నారు. ఈ సినిమాతో ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తారో చూడాలి.

Related News

Hero Dharmendra: చనిపోకముందే చంపేశారు.. ధర్మేంద్రకు ఇది మొదటిసారి కాదు

Hero Dharmendra: మా నాన్న చనిపోలేదు.. మండిపడ్డ కూతురు!

Hero Dharmendra: భార్య ఉండగానే.. మతం మారి రెండో పెళ్లి.. ధర్మేంద్ర జీవితంలో అన్నీ ట్విస్ట్ లే

Dharmendra Death: బిగ్ బ్రేకింగ్ న్యూస్.. నటుడు ధర్మేంద్ర మృతి.. విషాదంలో బాలీవుడ్!

MM Keeravani: కీరవాణి సక్సెస్ సీక్రెట్ చెప్పేసిన శృతిహాసన్.. అందుకే ఆస్కార్ గ్రహీత అంటూ!

Shiva Re release: అప్పట్లోనే అన్ని కోట్ల కలెక్షన్స్.. సృష్టించిన రికార్డ్స్ ఇవే!

Sigma : సందీప్ కిషన్ తో విజయ కొడుకు చేయబోయే సినిమా కథ ఇదే

SS Rajamouli : గ్లోబల్ ట్రోటర్ ఈవెంట్ కి నో కెమెరాస్, తమిళ్ ఇండస్ట్రీని ఫాలో అవుతున్నారా?

Big Stories

×