Hollywood Actor..ఫిలిం ఇండస్ట్రీలో వరుస విషాదాలు అభిమానులను కలవరపాటుకు గురిచేస్తున్నాయి. ఇందులో కొంతమంది ఆత్మహత్య చేసుకొని మరణిస్తే.. మరికొంతమంది వృద్ధాప్య కారణాలతో మరణిస్తున్నారు. ఇంకొంతమంది అనారోగ్య సమస్యలతో స్వర్గస్తులవుతున్నారు. అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన మరో విషయం ఏమిటంటే.. వింత వ్యాధులతో బాధపడుతూ తుది శ్వాస విడవడం అభిమానులు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. అలాంటి వారిలో ప్రముఖ హాలీవుడ్ దిగ్గజ నటుడు అకీ అలియోంగ్ (Aki Aleong) కూడా ఒకరు.
వింత వ్యాధితో నటుడు కన్నుమూత..
అందుతున్న సమాచారం ప్రకారం.. ప్రముఖ హాలీవుడ్ నటుడు అకీ అలియోంగ్ కన్నుమూశారు. గత కొన్ని సంవత్సరాలుగా డిమోంటియా అనే వ్యాధితో ఆయన బాధపడుతున్నట్లు ఆయన సతీమణి సిల్మర్ తెలిపారు. ఈ నేపథ్యంలోనే చికిత్స తీసుకుంటూ ఇంటి వద్దె మరణించినట్లు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆయన వయసు 90 సంవత్సరాలు. అకీ అలియోంగ్ మరణ వార్త విని అటు సినీ పరిశ్రమ, ఇటు అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఒక గొప్ప నటుడిని కోల్పోయామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నారు. అంతేకాదు ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వరుస పోస్టులు పెడుతున్నారు.
అకీ అలియోంగ్ సినిమాలు..
ఇకపోతే ఈయన నటించిన సినిమాల విషయానికే వస్తే నో డౌన్ పేమెంట్, బ్రాడ్ డాక్ : మిస్సింగ్ ఇన్ యాక్షన్ 3, ది బ్రూస్ లీ స్టోరీ (1993), ది క్వెస్ట్ (1996) వంటి చిత్రాలలో నటించి మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు.
అకీ అలియోంగ్ తొలినాళ్ళ జీవితం..
అమెరికన్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, గాయకుడిగా, పాటల రచయితగా, సంగీత నిర్మాణంలో కూడా చురుకుగా ఉంటూ బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరు సొంతం చేసుకున్నారు. ఇక ఈయన తొలి రోజుల జీవితానికి వస్తే.. హాంకాంగ్ కి చెందిన వంటవాడు హెన్రీ లియోంగ్, బ్రిటిష్ వెస్టిండీస్ లోని సెయింట్ విన్సెంట్ కు చెందిన ఆగ్నెస్ వెరా గోన్సాల్వ్స్ దంపతులకు 1934 డిసెంబర్ 19న ట్రినిడాడ్ లో అకీ అలియోంగ్ జన్మించారు.
అకీ అలియోంగ్ సినిమా జీవితం..
1957లో జోవాన్ వుడ్ వార్డ్, జఫ్రి హంటర్ నటించిన ‘నో డౌన్ పేమెంట్’ అనే చిత్రం ద్వారా నటుడిగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఆ తర్వాత బాబి లోన్ 5 మొదటి సీజన్లో సెనేటర్ హిడోషి పాత్ర పోషించి మరింత పాపులారిటీ అందుకున్నారు. ఇకపోతే ఈయన నటుడు కానే కాకుండా కాలిఫోర్నియాలో కింగ్ హామ్ డాగ్ ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్ ను కూడా కలిగి ఉన్నారు. సుమారుగా 1965 నుండే ఈ రెస్టారెంట్ ను నిర్వహిస్తూ ఉండడం గమనార్హం. ఇక ఈయన మీడియా యాక్షన్ నెట్వర్క్ ఫర్ ఆసియన్ అమెరికన్స్ (MANAA) లో సభ్యుడు అలాగే ఆసియన్స్ ఇన్ మీడియాలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా కూడా పనిచేశారు.